Janaki Kalaganaledhu August 4th: జానకి కార్లో కిషోర్ ను ఫాలో అవుతూ ఉంటుంది. ఇక కిషోర్ తన ప్లాన్ ఆల్మోస్ట్ సక్సెస్ అయ్యింది అని.. ఇక వెన్నెల పెళ్లి సంగతి చూసుకుంటుంది అని.. ఆ తర్వాత ఏం చేయాలో అది చేసుకుంటాను అని ఒక దగ్గరికి వెళ్ళగా జానకి వీరిద్దరి మధ్య ఏం జరుగుతుందో వెన్నెలను అడిగి తెలుసుకోవాలి అని అనుకుంటుంది. మరోవైపు జ్ఞానంబ ఉతకడానికి బట్టలన్నీ తీస్తూ ఉండగా గోవిందరాజులు అక్కడికి వచ్చి నువ్వెందుకు బట్టలు పిండుతున్నావు అని తెగ ప్రేమ చూపిస్తూ మాట్లాడుతూ ఉంటాడు.
అప్పుడే మల్లిక మొక్కజొన్న తింటూ అక్కడికి వచ్చి వారు ఏం మాట్లాడుకుంటున్నారో చూస్తుంది. ఇక గోవిందరాజులు నువ్వేం పని చేయకు మళ్లీ కాళ్ళు నొప్పి పుడుతాయి అని అంటాడు. అప్పుడే జానకి కారు దిగి లోపలికి వస్తుంది. తన అత్త బట్టలు పిండుతున్న దాన్ని చూసి మీరెందుకు పిండుతున్నారు మేమున్నాము కదా.. ముగ్గురు కోడళ్ళమున్నాము అసలు మేము ఎందుకు ఉన్నాము. మీరు ఈ పనులన్నీ చేయకండి అని కోడలిగా బాధ్యతగా మాట్లాడుతూ ఉంటుంది.
ఇక జ్ఞానంబ మాత్రం అక్కడ పనిచేసి అలసిపోయి ఉంటావు కదా ఎందుకులే నీకు శ్రమ అని అంటుంది. అక్కడ నేనేమీ బస్తాలు మోయలేదు ఆడవాళ్లు బయట పనులే కాదు ఇంట్లో పనులు కూడా చేసుకుంటారు నేను ఇప్పుడే లోపలికి వెళ్లి వస్తాను అని లోపలికి వెళ్లి చీర మార్చుకొని వస్తుంది. ఇక తనే బట్టలు నానబెడుతూ ఉంటుంది. గోవిందరాజులు అక్కడినుండి వెళ్ళిపోతారు.
మల్లిక మాత్రం వారిని చూస్తూ కుళ్ళుకుంటూ ఉంటారు. అదే సమయంలో అక్కడికి జానకి అన్నయ్య వచ్చి తన చెల్లిని చూసి నిజంగానే చాకిరి చేపిస్తున్నారేమో అని కోపంతో రగిలిపోతాడు. అప్పుడే మల్లిక వచ్చి చూశారు కదా జానకిని ఎంత బాధ పెడుతుందో అని మరింత నిప్పు పెట్టింది. ఇక జానకి అన్నయ్య లోపలికి వెళ్లిన వెంటనే అందరిపై ఫైర్ అవుతాడు. నా చెల్లెలు ఒకప్పుడు కానిస్టేబుల్ కాదు.. ఇప్పుడు తను ఐఏఎస్ ఆఫీసర్.. అలాంటిది నా చెల్లెలితో ఇంట్లో బట్టలు ఉతికిస్తారా అంటూ నోటికి వచ్చినట్లు వాగుతూ అరుస్తాడు.
ఇక మల్లిక జానకికి వెళ్లి మీ అన్న వచ్చి బాగా గొడవ చేస్తున్నాడు అని చెప్పటంతో జానకి ఇంట్లోకి వస్తుంది. తన అన్నయ్య మాత్రం ఆవేశంతో బాగా రగిలిపోతూ ఉంటాడు. మల్లిక మాత్రం తెగ ఎంజాయ్ చేస్తూ కనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా రామను కూడా చదువు లేనివాడు అంటూ ఘోరంగా అవమానిస్తాడు. ఇక జానకి వచ్చి తన అన్నయ్య పై అరుస్తుంది.
ఇంటి కోడలి బాధ్యత తనది అంటూ నాకు లేనిది నీకెందుకు అని ఆవేశంగా అరుస్తుంది. ఇక తన అన్నయ్య మాత్రం ఇంట్లో నుంచి బయటికి వచ్చేసి సపరేట్ కాపురం పెట్టమని అంటాడు. దాంతో అందరూ షాక్ అవుతారు. కానీ జానకి మాత్రం తను ఇల్లు వదిలేది లేదని తనదైన స్టైల్ లో సమాధానాలు చెప్పేసి తన అన్నకు పెద్ద షాక్ ఇస్తుంది.
also read it: Madhuranagarilo July 3rd: శ్యామ్ ను పెళ్లి చేసుకోమని రాధకు సలహా ఇస్తున్న స్వప్న.. కోపంతో రగిలిపోతున్న సంయుక్త?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial