Madhuranagarilo July 3rd: రాధ కిచెన్ లో ఉండగా శ్యామ్ పండుని రెడీ చేస్తాడు. ఇక శ్యామ్ పండు మీద చూపిస్తున్న ప్రేమను చూసి స్వప్న ఫిదా అవుతుంది. కన్న తండ్రి లాగా చూస్తున్నాడు అని అనుకుంటుంది. ఇక రాధ దగ్గరికి వెళ్లి శ్యామ్ గురించి మాట్లాడుతూ ఉంటుంది. అదే సమయంలో పండు, శ్యామ్ అక్కడికి వస్తుంటారు. స్వప్న మాత్రం పండుని శ్యామ్ కన్న తండ్రి లాగా చూసుకుంటున్నాడు అని మీరిద్దరిని చూస్తే పండుకి సొంత తల్లిదండ్రులగా ఉన్నారు అని అంటుంది. రాధ గట్టిగా అరవకు మెల్లగా మాట్లాడు అనటంతో అక్కడికి శ్యామ్ వస్తాడు. ఇక కాసేపు మాట్లాడి పండుని తీసుకోని తన ఇంటికి బయలుదేరుతాడు.


అదే సమయంలో సంయుక్త వాళ్ళు అక్కడికి రాగా మాకోసమే ఎదురు చూస్తున్నావా అని శ్యామ్ ని అడుగుతుంది. లేదు మా ఇంటికి వెళ్లి వస్తున్నాము అని పండు అంటాడు. నాకోసమే కాదు మా మమ్మీ కోసం కూడా వచ్చాడు అని పండు అనటంతో సంయుక్తకు బాగా కోపం వస్తుంది. మరోవైపు వాసంతి జాకెట్ కుడుతూ ఉండగా గన్నవరం వచ్చి ఎవరికీ ఇది అని అంటాడు.


దాంతో వాసంతి శ్యామ్ ఇచ్చాడని అనటంతో ఎవరికోసమో అని ఆలోచనలో పడతాడు గన్నవరం. జాకెట్ సైజు రాధది ఉండటంతో గన్నవరం కి అనుమానం వస్తుంది. ఆ తర్వాత గదిలో పండు తను అందంగా రెడీ అయ్యానని ఫోటో దింపమని శ్యామ్ ని అంటాడు. శ్యామ్ ఫోటోలు దింపి చూడటానికి ఫోన్ ఇస్తాడు. అందులో రాధ ఫొటోస్ ఉండటంతో మా మమ్మీ ఫొటోస్ ఎందుకు ఉన్నాయి అని పండు అడుగుతాడు.


మీ మమ్మీ ఫోన్ లో స్టోరేజ్ ఎక్కువ ఉందని నాకు పంపింది అని కవర్ చేస్తాడు. ఇక శ్యామ్ కోసం తను తీసుకొచ్చిన డ్రెస్ ని ఇవ్వటానికి సంయుక్త శ్యామ్ దగ్గరికి వస్తుంది. అప్పుడే శ్యాం ఫోన్ కూడా ఫోన్ రావడంతో ఆ ఫోన్ రింగ్టోన్ రాధా రాధా అనే పాటతో ఉంటుంది. ఇక శ్యామ్ ఫోన్ మాట్లాడి కట్ చేసిన తర్వాత.. పండు తన పెద్దయ్యాక ఫోన్ కొన్నాక ఆ పాటలు తన ఫోన్ కు పెట్టుకుంటాను అని.. ఎందుకంటే అందులో తన మమ్మీ పేరు ఉందని అనటంతో.. శ్యామ్ కూడా అందుకే పెట్టుకున్నాడు అని సంయుక్త అంటుంది.


సంయుక్త లోపలకి వచ్చి సంగీత ఫంక్షన్ కోసం డ్రెస్ తీసుకొచ్చాను అని వేసుకోమని అంటుంది.  అప్పుడే అక్కడికి రాధ, స్వప్న కూడా వస్తారు. శ్యామ్ మాత్రం ఆ బట్టలు అస్సలు వేసుకుని అని మొండికి వేస్తాడు.  దానితో ఇద్దరి మధ్య కాసేపు మాటల యుద్ధం జరుగుతుంది. ఇక శ్యామ్ కోపంగా అక్కడున్న ఒక వస్తువుని కింద పడేయడంతో తన చేతి కమలిపోతుంది. వెంటనే రాధ శ్యామ్ చేయికి ఏదో అయింది అని పరిగెత్తుకెళ్ళి చెయ్యి పట్టుకుని చూస్తుంది. అది చూసి సంయుక్తకు మరింత కోపం వస్తుంది


ఆ తర్వాత రాధ వేసుకోమని బ్రతిమాలుతుంది. ఇక రాధ అడగటంతో శ్యామ్ కాదనడు. ఆ తర్వాత రాధ బయటికి రాగానే స్వప్న రాధ దగ్గరికి వచ్చి నువ్వు శ్యామ్ ను నిజంగానే ప్రేమిస్తున్నావని అక్కడ శ్యామ్ కి దెబ్బ తగిలితే సంయుక్త అలాగే చూస్తుంది కానీ నువ్వు మాత్రం వెళ్లి చూసావు అదే ప్రేమ అని అంటుంది. అంతేకాకుండా పెళ్లి చేసుకోమని సలహాలు కూడా ఇస్తుంది. ఇక ఈ విషయాన్ని నేను మధుర మేడంకు నేను చెబుతాను అని అనటంతో.. శ్యామ్ కూడా నేను మాట్లాడతాను అని అంటాడు. పెళ్లి చేసుకోమని అడుగుతాడు. ఆ మాటలకు రాధకు బాగా కోపం వస్తుంది.


also read it: Guppedantha Manasu August 2nd: 'గుప్పెడంత మనసు' సీరియల్: రిషిని చంపటానికి ప్రయత్నించిన రౌడీలు, కోపంతో రగిలిపోతున్న శైలేంద్ర?


 


Join Us on Telegram:  https://t.me/abpdesamofficial