కూతుర్ని కాపురం నిలబెట్టుకోమని నందు ధైర్యం చెప్తాడు. ఎవరికోసమో ఆలోచించి జీవితాన్ని పాడు చేసుకోవడం కరెక్ట్ కాదని అంటాడు. మీ గురించి, అమ్మ గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే తట్టుకోలేకపోయానని చెప్తుంది.


నందు: మీ అత్త చూపించే దొంగ ప్రేమ బయట పెట్టు. మీ మధ్య ఉన్న మనస్పర్థలు తొలగిపోయేలా చేసుకో


దివ్య: విక్రమ్ నేను చెప్పే మాట వింటాడు కానీ ఒక్క అమ్మ విషయంలో మాత్రం వినడు. అది అలుసుగా తీసుకుని మా అత్త రెచ్చిపోతుంది


నందు: ఎదురుతిరుగు.. డివోర్స్ అంటే బొమ్మలాట కాదు. నీకు వచ్చింది నోటీస్ విడాకులు కాదు. ఇప్పటికీ నువ్వు ఆ ఇంటి కోడలివే నిన్ను ఎవరూ అడ్డుకోలేరు ఆపలేరు. ఏం చేయాలో నువ్వే ఆలోచించుకో


విక్రమ్ దివ్యని తలుచుకుని బాధపడుతూ చేతికి గాయం చేసుకుంటాడు. రాజ్యలక్ష్మి, లాస్య వచ్చి చూసి బాధపడుతున్నట్టు నటిస్తారు. కొడుకు మీద దొంగ ప్రేమ నటిస్తుంది.


రాజ్యలక్ష్మి: డైవర్స్ తీసుకోవడం ఇష్టం లేకపోతే దగ్గరుండి దివ్యని తీసుకొస్తాను. ఎవరి మాటలు పట్టించుకోకు


విక్రమ్: దివ్యని ప్రేమించి కోరి పెళ్లి చేసుకున్నా. గుండెల్లో పెట్టి చూసుకుంటున్నా. ఇలాంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదు. తను నాకు దూరం అయ్యే రోజు వస్తుందని అనుకోలేదు. ఎందుకు ఇలా మారిపోయి మనల్ని దూరం చేసుకుంటుంది. ఎందుకు ఇంత దురుసుగా ప్రవర్తిస్తుంది. నేనేమైనా తప్పు చేశానా?


రాజ్యలక్ష్మి: లేదు ఏ తప్పు చేయలేదు. తనని గుండెల్లో పెట్టుకుని చూసుకున్నావ్. నేను తులసితో మాట్లాడేదా?


Also Read: నందుకి తన ప్రేమ గురించి చెప్పిన మురారీ- అగ్రిమెంట్ సంగతి భవానీకి చెప్పాల్సిందేనన్న కృష్ణ


విక్రమ్: దివ్యతో విడిపోయే విషయంలో వెనక్కి తగ్గేదే లేదు. నిన్ను గౌరవించని వాళ్ళని క్షమించను


లాస్య: నువ్వు తీసుకున్న నిర్ణయం సరైనది కట్టుబడి ఉండు. దివ్య కోసం అమ్మ ప్రేమని తాకట్టు పెట్టాల్సిన పని లేదు. విడాకులు ఇచ్చి బతకగలనని దివ్య అనుకుంటే నువ్వు ఎందుకు ఇలా అవుతావ్. తనని నీ మనసులో నుంచి బయటకి తీసేయ్. తను ఈ పరిస్థితి నుంచి బయట పడాలంటే విడాకులు రాగానే మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసేయడమే


విక్రమ్: ఇక ఆపుతారా? నా పెళ్లి గురించి నేనేం దిగులు పెట్టుకోలేదు. జీవితాంతం ఒంటరిగా బతకగలను అనేసి కోపంగా వెళ్ళిపోతాడు.


రాజ్యలక్ష్మి: వాడికి ఇంకో పెళ్లి చేసి ఇంకొక కోడల్ని నెత్తిన పెట్టుకునే ఆలోచన నాకు లేదు. వీడిని కూడా వాడి నాన్న పక్కన వీల్ చైర్ వేసుకుని పక్కన కూర్చునేలా చేస్తాను


దివ్య బ్యాగ్ పట్టుకుని అత్తారింటికి బయల్దేరుతుంది. తులసి జీవితం గురించి నాలుగు మంచి మాటలు చెప్తుంది. అత్తింటి నుంచి వచ్చేసి తప్పు చేశానని దివ్య రియలైజ్ అవుతుంది. ఇక నుంచి పుట్టింటికి చుట్టం చూపుగానే వస్తాను తప్ప ఇక్కడ ఉండిపోవడానికి రానని దివ్య తల్లికి మాట ఇస్తుంది. కూతురికి చీర సారె పెట్టి సాగనంపుతుంది. దివ్య అత్తింటి గుమ్మంలో అడుగుపెడుతుంది. విక్రమ్ కోపంగా ఆగమని అరుస్తాడు.


విక్రమ్: ఎందుకు వచ్చావ్


దివ్య: ఇది నా ఇల్లు కావాలనుకుని వచ్చాను


తాతయ్య: కావాలనుకుని వచ్చింది కదా అడ్డదిడ్డమైన ప్రశ్నలు వేస్తావ్ ఎందుకు


విక్రమ్: అంతా తన ఇష్టమేనా. తను నాకు విడాకుల పేపర్లు పంపింది దాని అర్థం ఏంటి?


Also Read: అదిరిపోయిన ఎపిసోడ్.. మాళవిక అవుట్- వేద మమ్మీ దగ్గరే ఉంటానన్న ఆదిత్య


దివ్య: అసలు కోర్టు దాకా కూడా వెళ్లలేదు. అప్పటి వరకు నేను నీ భార్యని.. ఈ ఇంటి కోడలిని. కోడలిగా నాకు అన్నీ హక్కులు ఉంటాయ్


విక్రమ్: లాజిక్ మాట్లాడకు వద్దు అనుకున్నప్పుడు ఇదంతా ఎందుకు. విడాకుల పేపర్లు నీ ఇంటికి వస్తాయ్


దివ్య: నేను వస్తే తప్పు ఏంటి? కంట్రోల్ లో ఉండలేవా కావాలని అనిపిస్తుందా?


విక్రమ్: నాది అంత చీప్ క్యారెక్టర్ కాదు. అయినా ముందు కాగితాలు పంపింది నువ్వు.. ఆ మాత్రం మాట మీద నిలబడలేవా


దివ్య: నేను పంపించడం ఏంటి? ఓహో ఈ విడాకుల పేపర్లు పంపింది వీళ్ళా ఈ నిజం చెప్తే విక్రమ్ నమ్మడు. నేను వెనక్కి తిరిగి వెళ్లను


లాస్య: తనని మెడ పట్టుకుని బయటకి గెంటేసేయ్


దివ్య: ఏం చేయాలో నీ దగ్గరే నేర్చుకున్నా ఆంటీ.. గృహహింస కేసు పెట్టి అందులో నీ పేరు కూడా రాస్తాను