Madhuranagarilo August 5th: శ్యామ్ దగ్గరికి వెళ్లిన సంయుక్త జ్యూస్ ఎవరు తాగారు పండుకి ఇచ్చావా అనటంతో లేదు అంటాడు. మరి నువ్వు తాగావా అనటంతో లేదు రాధకు ఇచ్చాను అని అంటాడు. దాంతో సంయుక్త షాక్ అవుతుంది. మరో వైపు రాధ జ్యూస్ తాగేస్తుంది. ఇక సంయుక్తను తన ఫ్రెండ్ వచ్చి ఏం జరిగింది అని అనటంతో ఆల్రెడీ రాధ జ్యూస్ తాగిందని చెబుతుంది.


ఆ తర్వాత ఫంక్షన్ రెడీ అవుతుంది. ఇక గన్నవరం యాంకరింగ్ చేస్తాడు. మొదట మధుర వచ్చి డాన్స్ చేస్తుంది. మధుర డాన్స్ చూసి ఫిదా అవుతారు . ఆ తర్వాత గన్నవరం తన గురించి తను గొప్పగా పొగుడుకోవడంతో ఎవరు పట్టించుకోరు. అక్కడ కాసేపు సరదాగా సాగుతుంది. ఆ తరువాత గన్నవరం దంపతులు డాన్స్ చేస్తారు. విల్సన్ కూడా డాన్స్ చేస్తాడు.


ఆ తరువాత శ్యామ్, సంయుక్త కూడా డాన్స్ చేస్తుండగా మత్తులో ఉన్న రాధ స్టేజి పైకి వెళ్లి ఈ పాట మీద కాదు మంచి మాస్ పాట తో డాన్స్ చేయమని రచ్చ చేస్తుంది. ఇక తను కూడా తీన్మార్ డాన్స్ తో రచ్చ చేస్తుంది. తర్వాత అక్కడ నుండి ఊగుతూ వెళ్తుండగా వెంటనే శ్యామ్ రాధ ఇలా ప్రవర్తిస్తుందని అనుకుంటాడు. వెంటనే విల్సన్ వాళ్ళు జ్యూస్ లో కలిపిన మందు తాగింది అని తనను ఇంటికి తీసుకెళ్తాడు.


ఇక రాధ తాగిన మైకంలో ఏదేదో మాట్లాడుతూ ఉంటుంది. ఇక వాటర్ తాగుతూ వాటర్ మీద పోసుకుంటుంది. దాంతో శ్యామ్ తనకు డ్రెస్ మార్చలని లేదంటే జలుబు చేస్తుందేమో అని అనుకుంటాడు. ఇక మరుసటి రోజు రాధ నిద్ర లేవగానే జరిగింది గుర్తుకు చేసుకొని ఇలా చేసానేంటీ అని అనుకుంటుంది. ఇక డ్రెస్ వేరేది ఉండటంతో షాక్ అవుతుంది.


అప్పుడే అక్కడకి శ్యామ్ రావటంతో శ్యామ్ పై కోపంగా అరుస్తుంది. బాగా తిడుతుంది. మత్తులో నేను ఉండటంతో అడ్వాన్టేజ్ తీసుకున్నావంటూ.. నా శరీరంపై ఎందుకు తాకావు అంటూ చిరాకు పడుతుంది. ఇక శ్యామ్ చెప్పేది వినకుండా తనకు నచ్చినట్లు తిడుతుంది. ఇక స్వప్న రావటంతో స్వప్న కు జరిగిన విషయం చెబుతూ బాధ పడుతుంది.


ఇక స్వప్న వెంటనే మాట్లాడుతూ నీ డ్రెస్ మార్చింది శ్యామ్ కాదు నేను అంటూ జరిగిన విషయం చెబుతుంది. అనవసరంగా శ్యామ్ పై కోపడ్డావ్ అని అనటంతో శ్యామ్ కు సారీ చెబుతుంది. ఇక శ్యామ్ నేను నిన్ను ప్రేమించాను. నీ శరీరం ను కాదు అని చెప్పి సైలెంట్ గా వెళ్తాడు. ఇక రాధ చాలా బాధ పడుతుంది. ఇక ఎప్పుడు శ్యామ్ ను అపార్ధం చేసుకోను అని అనుకుంటుంది. తరువాయి భాగం లో రాధ శ్యామ్ ఫోటో చూసి మీ ప్రేమతో నన్ను కూడా ప్రేమలో పడేసావు అని అనుకుంటుంది. ఇక శ్యామ్ కూడా వచ్చి పెళ్లి జరిగే ఆఖరి క్షణం వరకు నువ్వు వచ్చిన కూడా నీ మెడలో తాళి కడుతాను అని అంటాడు.
 


 


also read it : Janaki Kalaganaledhu August 4th: 'జానకి కలగనలేదు' సీరియల్: నిప్పు పెట్టి పక్కకు జరిగిన మల్లిక, జానకి అన్న రచ్చ


 


 



Join Us on Telegram:  https://t.me/abpdesamofficial