Trinayani August 8th: విశాల్ జాతకంలో ఏదో సమస్య ఉందని నయని ఆ సమస్య గురించి తెలుసుకోవటానికి గురువు చెప్పినట్లు కొన్ని పనులు చేస్తుంది. ఇక విశాల్ చాట పట్టుకొని నిలబడి ఉండగా  గురువు దీపం పట్టుకొని నిలబడతాడు. ఇక సుమన ను  వచ్చి అందులో ఏం రాసి ఉందో చదవమని అంటారు.  దాంతో సుమనకు అందులో విశాల్ రక్తం త్యాగం చేయవలసి వస్తుందని అంతేకాకుండా రూపం మారాల్సి వస్తుందని ఉండటంతో అది పైకి చదవడం వల్ల అందరూ షాక్ అవుతారు.


వెంటనే హాసిని అక్కడ ఏమీ లేదు అలా ఎలా చదివావు అని ఆశ్చర్యపడటంతో.. అప్పుడే దీపం పోవడం వల్ల అక్షరాలు కూడా కనిపించకుండా పోతాయి. దీంతో సుమన అక్కడ ఏం రాసిందో నేను అదే చదివాను మీరు కూడా చూడండి అనడంతో అక్కడ సుమనకు కూడా అక్షరాలు కనిపించవు. ఇక దీపం పోయినందుకు అక్షరాలు కనిపించవు అని గురువు అంటాడు. ఇక విశాల్  కు ఏం జరుగుతుందో అని నయని టెన్షన్ పడుతూ ఉంటుంది.


ఆయనకు ఏమైనా అవుతే పిల్లలు ఏమవుతారు అని బాధపడుతుంది. దానితో గురువు.. పిల్లల వల్ల ఆయనకు ఏమైనా జరగవచ్చు అని అనడంతో అందరూ మరింత షాక్ అవుతారు. ఇక గురువు నయనికి ధైర్యం చెబుతాడు. ఆ తర్వాత నయని విశాల్ దగ్గరికి వెళ్ళగా ఏం జరుగుతుందో అని నయని అక్కడికి వచ్చి బాధపడుతూ ఉంటుంది. దాంతో ఆయన ఏమి కాదని  పిల్లల కోసం తను ప్రాణాలు కూడా త్యాగం చేస్తానని అంటాడు.


ఇక నయని గాయత్రి జోగయ్య శాస్త్రి మనవరాలు.. తను నీ కన్న కూతురు కాదు కాబట్టి తనకి ఏమి జరగదు. అయితే గానవికి ఏదైనా జరుగుతుందేమో అని టెన్షన్ పడుతుంది. ఇక విశాల్ మాత్రం తన మనసులో గాయత్రి కి ఏమైనా జరుగుతుందేమో అని భయపడుతూ ఉంటాడు. అలా ఇద్దరు కాసేపు ఈ విషయం గురించి మాట్లాడుకుంటూ బాధపడుతూ ఉంటారు.


ఇక పావనమూర్తి పిల్లలను ఆడిపిస్తూ ఉండగా అప్పుడే అక్కడికి తిలోత్తమా, వల్లభ వస్తారు. ఇక పావన మూర్తి వాష్ రూమ్ కి వెళ్తున్నాను అని పిల్లల్ని చూసుకోమని చెబుతాడు. తిలోత్తమా వెంటనే పిల్లలను జాలిగా చూడాలి అని వల్లభతో అంటుంది. ఇక వల్లభ దేని గురించి మాట్లాడుతున్నావ్ అనటంతో.. గాయత్రికి అమ్మానాన్నలు లేరు కాబట్టి ఇక్కడికి వచ్చి వారిని కుబేర్లుగా చేసిందని.. ఈ తల్లిదండ్రులను కూడా చంపేయాలి అని అనటంతో వల్లభ షాక్ అవుతాడు.


ఇక గాయత్రి వారి మాటలు వింటూ అక్కడున్న కొబ్బరి నూనె మూత తీసి నూనె మొత్తం నేలమీద పారేస్తుంది. ఈ తల్లి కొడుకులిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటుండగా విశాల్ రావడానికి గమనించి పిల్లలతో సరదాగా ఆడుకోవాలి అని ప్లాన్ చేస్తారు. దీంతో తిలోత్తమా గాయత్రి దగ్గరికి వెళ్తుండగా వెంటనే విశాల్.. చూసి అమ్మ గాయత్రిని పట్టుకుంటే షాక్ వస్తుంది అని.. ఆపడానికి వెళ్తుండగా అదే సమయంలో నూనె మీద కాలు వేసి తిలోత్తమా, వల్లభ కాలు జారి కింద పడతారు.


వెంటనే ఇంట్లో వాళ్ళు పరిగెత్తుకుంటూ వస్తారు. ఇక వారికి దెబ్బ గట్టిగా తగలడంతో బాగా నొప్పితో ఇబ్బంది పడుతూ ఉంటారు. తిలోత్తమా కు మాత్రం చాలా గట్టిగా దెబ్బ తగులుతుంది. ఇక గాయత్రి చేతిలో నూనె ఉండటంతో గాయత్రి పని అని అందరు తనపై విరుచుకుపడుతుంటారు. వెంటనే నయని దంపతులు, విక్రాంత్ పిల్లలకు ఏమీ తెలియదు అంటూ వాళ్ళని వెనకేసుకొస్తూ ఉంటారు.


ఇక తిలోత్తమా నొప్పితో చాలా బాధపడుతూ గాయత్రి వైపు చూసి బాగా తిట్టుకుంటుంది. ఆ తర్వాత తనను హాస్పిటల్ కు తీసుకొని వెళ్తారు. ఇక ఆ తర్వాత సుమన తను డెలివరీ అయ్యేది మరో 10 రోజులు మాత్రమే అని అద్దంపై రాసుకుంటూ ఉండగా విక్రాంత్ అక్కడికి వచ్చి వెటకారం చేస్తూ మాట్లాడుతూ ఉంటాడు. సుమన మాత్రం ఆస్తి కోసమే బిడ్డను కంటున్నట్లుగా తెగ ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక ఈ పది రోజులు తనకు మంచిగా రెస్ట్ ఇవ్వమని.. ఆ తర్వాత పురిటి నొప్పులతో బాధపడాలి అని అంటుంది.


also read it : Guppedantha Manasu August 7th: 'గుప్పెడంత మనసు' సీరియల్ - రిషిని చంపటానికి ప్రయత్నించిన రౌడీలు.. కోపంతో రగిలిపోతున్న శైలేంద్ర?


 


Join Us on Telegram: https://t.me/abpdesamofficial