గుప్పెడంతమనసు ఆగష్టు 8 ఎపిసోడ్ (Guppedanta Manasu August 8th Written Update)
అన్నీ ఆయనకోసమే కదా చేస్తున్నాను అయినా గుర్తించరేంటని ప్రేమ-అలకతో కూడిన కోపాన్ని ప్రదర్శిస్తుంది వసుధార...వసు మాటలు విన్న తండ్రి చక్రపాణి నీ తీరు మళ్లీ చిన్నతనాన్ని గుర్తుచేస్తోందని నవ్వుతాడు
చక్రపాణి: తను కూడా మనిషే కదా..ఇప్పుడంటే నువ్వు కాపాడి ఉండొచ్చు కానీ జరిగినవన్నీ చిన్న విషయాలు కాదుకదా
వసు: చైర్మన్ ఇంటికెళ్లి జాగ్రత్తలు చెప్పి వస్తే వెనుకే వచ్చి నిలదీయడం అవసరమా
చక్రపాణి: అదంతా బాధ, నీపై ఉన్న ప్రేమ..నిన్ను నిలదీసే ముందు తనని తాను నిలదీసుకుని ఉంటారు. మనం తన మనసుని, ప్రేమని అర్థం చేసుకోవాలి కదా అని చెబుతాడు
ఇంతలో ఫోన్ కి మెసేజ్ వస్తుంది...జగతి
జగతి: నీతో చేయకూడని పని చేయించాను ఎందుకు చేయించానో తెలుసు, కచ్చితంగా నువ్వ అర్థం చేసుకుంటావని నమ్మకం, రిషి నీ దగ్గర ఉన్నాడు కాబట్టి తను భద్రంగా ఉన్నాడని అనుకుంటున్నాను, నువ్వు రిషి క్షేమం కోసమే ఆలోచిస్తావు, గురదక్షిణగా మహేంద్ర కోసం కష్టపడ్డావు, రెండోసారి నాకోసం నష్టపోయావు, రిషి ప్రేమకు దూరమయ్యావు, తల్లిప్రేమను పోగొట్టుకున్నావు..మా వల్ల నువ్వు చాలా ఇబ్బందులకు గురవయ్యావు, ఇకపై నీ విషయంలో నేను-మహేంద్ర కలగజేసుకోం..నువ్వు ఇప్పుడు ఓ పని చేయి.. ఇది మాకోసం నీకోసం ఇప్పుడు మేం నిన్ను ఇది గురుదక్షిణగా అడగడం లేదు రిషి తల్లిదండ్రులుగా ప్రార్థిస్తున్నాం.. రిషిని మామూలు మనిషిని చేయాలి..నా కొడుకుని మామూలు మనిషిగా చేసే శక్తి నీ ఒక్కదానికే ఉంది. ప్రపంచం తెలియని రిషికి ప్రపంచం ఎలా పరిచయం చేశావో అందులో ఉన్న గొప్పతనాన్ని ఎలా చూపించావో ప్రేమను మరిచిపోయిన రిషికి ప్రేమను చూపించాలి...ఇదీ ఆ మెసేజ్ శారాంశం...
Also Read: 'గుప్పెడంత మనసు' సీరియల్ - రిషిని చంపటానికి ప్రయత్నించిన రౌడీలు.. కోపంతో రగిలిపోతున్న శైలేంద్ర?
రిషి కూర్చుని ఆలోచనలో పడతాడు నాపై ఆటాక్స్ ఎందుకు జరుగుతున్నాయి, ఎవరు చేయిస్తున్నారని అనుకుంటాడు.. ఇంతలో ఫోన్ రింగవుతుంది.(రిషిని చంపబోతున్న సమయంలో ఆ విలన్ ఫోన్ ఎగిరి దూరంగా పడుతుంది అది రిషి దగ్గరుంటుంది). ఆ ఫోన్ లిఫ్ట్ చేద్దాం అనుకునేలోగా స్విచ్చాఫ్ అయిపోతుంది. అప్పుడు రిషి పోలీస్ ఆఫీసర్ కి కాల్ చేసి మీతో పనిపడిందని చెబుతాడు. కచ్చితంగా వాడెవడో కనిపెట్టాలి అనుకుంటాడు రిషి.. అటు శైలేంద్ర మాత్రం ఆ ఫోన్ కి పదే పదే కాల్ చేస్తూనే ఉంటాడు...స్విచ్చాఫ్ రావడంతో ఏం చేయాలి అనే ఆలోచనలో పడాడు
మమ్మీ అనుకుంటూ ఫాస్ట్ గా హాల్లోకి వస్తాడు శైలేంద్ర..ఇంతలో ధరణి కాఫీ ఇవ్వడంతో కోపంగా విసికి కొడతాడు. అప్పుడే హాల్లోకి వచ్చిన ఫణీంద్ర అది చూసి గట్టిగా శైలేంద్ర అని అరుస్తాడు...
ఫణీంద్ర: ఏంటిది..కాఫీ కప్పు ఎందుకు పగిలింది..మౌనంగా ఉంటావేంటి సమాధానం చెప్పు. అదెలా కిందపడింది..నువ్వే పడేశావా.. పడేస్తే ఎందుకు పడేశావు..రోజురోజుకీ నీ వికృత చేష్టలు పెరిగిపోతున్నాయి, చెట్టంత పెరిగావు కొంచెం కూడా బుద్ధి జ్ఞానం లేకుండా ఉంటున్నావ్.. అసలు ఏం జరిగింది కప్పు పడేయాల్సినంత అవసరం ఏమొచ్చింది...
ధరణి: ఇందులో ఆయన తప్పేం లేదు..నా చేయి జారి కిందపడిందని కవర్ చేస్తుంది ధరణి...
ఫణీంద్ర: వీడు నీ భర్త తన దగ్గర నీకు భయమెందుకు. తను భయపడుతోందంటే కారణం ఏంటో తెలుసా నువ్వే... భర్తంటే భార్యకు ప్రేమ ఉండాలి కానీ భయం ఉండ కూడదు.. భార్య-భర్త ఒకరికొకరు తోడుగా ఉండాలి..అప్పుడే కాపురం బావుంటుంది..
శైలేంద్ర: నేను అదే చెబుతున్నా..నాకు నచ్చినట్టు ఉండమని
ఫణీంద్ర: ఏం నువ్వు ఫాలో అవొచ్చు కదా.. తను చేసే ప్రతి పనిలో క్లారిటీ ఉంటుంది కానీ నువ్వు చేసే పనిలో క్లారిటీ లేదన్న విషయం అందరికీ తెలుసు. ధరణీ నువ్వు భయపడినంతకాలం నీ కాపురం బాగోదని చెప్పి వెళ్లిపోతాడు..
దేవయాని: మీ మావయ్యగారు చెప్పారని నువ్వు వీరవనితలా నా కొడుకుని మార్చాలని చూడకు అది నీకే మంచిది కాదు..
ధరణి: ఆయన నా మాట వింటారనే నమ్మకం ఉంటే పరిస్థితి ఇంతవరకూ వచ్చేది కాదు..మీరు నా గురించి ఆలోచించకండి నేను నా హద్దుల్లో ఉంటానంటుంది..
దేవయాని-శైలేంద్ర వెళ్లిపోతారు..
జగతి: ఎందుకమ్మా అబద్దం చేశావ్
ధరణి: ఆయనకు అంతో ఇంతో మావయ్యగారంటే భయం ఉంది..ఇప్పుడు నిజం బయటపడితే అది కూడా పోతుంది అందుకే అలా చెప్పానంటుంది.
Also Read: రిషికి స్వీట్ వార్నింగ్ ఇచ్చిన వసు, పొగరు అని ప్రేమగా తిట్టుకున్న ఈగోమాస్టర్!
కాలేజీలోకి పోలీసులు వస్తారు... వసుధార చూసి ఏంటిలా వచ్చారని అడిగితే రిషి సార్ కోసం వచ్చానంటాడు..ఎందుకని అడిగితే తెలియదు రమ్మన్నారని చెప్పి వెళ్లిపోతాడు. రిషిని కలుస్తాడు పోలీస్ ఆఫీసర్..అటాక్, ఫోన్ విషయం చెప్పిన రిషి..వేరే కాల్ రావడంతో బయటకు వెళ్లిపోతాడు. ఇంతలో ఫన్ రింగవుతుంది.. పోలీస్ ఆఫీసర్ లిఫ్ట్ చేస్తాడు...
ఎక్కడ చచ్చావ్ ఫోన్ చేస్తే తీయవేంటి మళ్లీ ట్రై చేస్తే స్విచ్చాఫ్ వస్తోందేంటి పని పూర్తైందా లేదా..అడుగుతుంటే సైలెంట్ గా ఉంటావేంటి మాట్లాడు అనగానే అట్నుంచి పోలీస్ హలో అనగానే శైలేంద్ర సైలెంట్ అయిపోతాడు... ఇంతలో రిషి క్యాబిన్లోకి వస్తాడు... ఆ వాయిస్ ఎక్కడైనా విన్నారా అని అడిగితే...చాలా సేపు నసిగి నసిగి ఆ వాయిస్ మీ అన్నయ్య శైలేంద్రది అని చెబుతుంది...
రిషి: మా అన్నయ్యదా..అంటే
వసుధార: అవును సార్..అప్పుడు మేం అలా చేయడానికి, ఇప్పుడు మీపై అటాక్స్ జరగడానికి మీ అన్నయ్యే సార్..
రిషి: ఈ విషయం నాకెందుకు చెప్పలేదు..
వసు: చెప్తే నమ్మరు అనుకున్నాం సార్
రిషి: మరి ఇప్పుడెలా నమ్ముతాం అనుకున్నాను..అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతోందా.. అప్పుడు నాపై ఇప్పుడు మా అన్నయ్యపై అభాండం వేస్తున్నావా...
వసు: మీ అన్నయ్య మీరు అనుకున్నంత మంచివాడు కాదు..మోసం చేస్తున్నాడు
రిషి: మా అన్నయ్యకి నేనంటే ప్రాణం..నాకోసం తన ప్రాణాలను కూడా లెక్కచేయడు అలాంటి తను నా ప్రాణాలు తీయాలి అనుకుంటాడా.. నెవ్వర్ అలా ఎప్పుడూ జరగదుంటాడు
ఎపిసోడ్ ముగిసింది.....