Janaki Kalaganaledhu August 7th: జానకి వెన్నెల దగ్గరికి వెళ్ళగానే వెన్నెల ఫోన్ మాట్లాడుతుంది. వెంటనే వెన్నెల తన వదిన ను షాక్ అవుతుంది. ఫోన్లో ఎవరు అని అడగటంతో తన కోచింగ్ సెంటర్ ఫ్రెండ్ అని అబద్ధం చెబుతుంది. సరే బాగా చదువుకో అని చెప్పి జానకి కాస్త ముందుకు జరిగి వెళ్లగా వెన్నెల ఊపిరి పీల్చుకుంటుంది. దాంతో వెన్నెల వైపు సీరియస్ గా చూస్తుంది జానకి.


కాలేజీ కి రోజు వెళ్తున్నావా అని అడగటంతో ప్రతిరోజు వెళ్తున్నాను అని చెబుతుంది. నిన్న సాయంత్రం ఎక్కడ ఉన్నావు అని అడగటంతో.. దాంతో వెన్నెల కాస్త కంగారు పడుతుంది. నిన్ను, గీతను సాయంత్రం చూశాను అనటంతో గీత నీకు తెలుసా వదిన అని అడుగుతుంది వెన్నెల. దాంతో కిషోర్ ఫోటో చూపించడంతో వెన్నెల షాక్ అవుతుంది. అబద్ధం చెప్పినందుకు సారీ చెబుతుంది.


ఇక నీ పక్కన ఉన్న వ్యక్తి ఎవరు అని అడగటంతో వెంటనే వెన్నెల అతనిని ప్రేమిస్తున్నాను అని చెబుతుంది. దాంతో జానకి నువ్వు అమ్మ చాటు పిల్లవని అనుకున్నాను కానీ ఇంత పెద్ద దానివి అయ్యావని అనుకోలేదు. సరదాగా నిన్ను అత్తారింటికి పంపిస్తాము అన్నప్పుడు కొప్పడే దానివి.. అప్పుడు మా మీద ఎంతో ప్రేమ ఉండేదని అందుకే మమ్మల్ని వదిలి వెళ్ళటం ఇష్టం లేక అలా అంటున్నావ్ అని అనుకున్నామని.. కానీ నీవు సపరేట్ దారి ఎంచుకున్నావు అని అంటుంది.


ఇటువంటి ప్రేమ అత్తయ్యకు నచ్చదని సంగతి నీకు తెలుసు కదా.. మళ్లీ ఎందుకిలా తెగించావు అని అంటుంది. దాంతో వెన్నెల నువ్వు ఉన్నావన్న ధైర్యంతోనే అలా చేశాను అని అంటుంది. ఒకవేళ నేను ఒప్పుకోకపోతే ఏం చేస్తావు అని అనడంతో.. అలా అనకు వదిన అంటూ బ్రతిమాలుతుంది. అయితే అతని ఇంటికి వెళ్లి అతని డీటెయిల్స్ అన్ని కనుక్కున్నాకే ఇంట్లో ఈ విషయం అత్తయ్యకు చెబుతాను లేదంటే వదులుకోవాలి అని అంటుంది.


ఇక మరోవైపు కిషోర్ తనకు ఒక గన్ కావాలి అని ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే జానకి యూనిఫాంలో రావడంతో వెన్నెల ద్వారా నిజం తెలుసుకొని వచ్చిందేమో అని భయపడతాడు. ఇక జానకి ఇంట్లోకి రాగానే కిషోర్ పెట్టిన ఫేక్ తల్లిదండ్రులు అక్కడే ఉండటంతో వాళ్లను పలకరించి మాట్లాడుతుంది. కిషోర్ కూడా మంచివాడిగా నటించాలి అని దేవుని బొట్టు పెట్టుకొని బయటికి అమాయకంగా వస్తాడు.


ఇక ఆ ఫేక్ తల్లిదండ్రులు కిషోర్ గురించి గొప్పగా చెప్పటంతో జానకి గుడ్డిగా నమ్మేస్తుంది.  అంతే కాకుండా కిషోర్ గదిలోకి వెళ్లగా అక్కడ గన్ కనిపించకుండా దాచిపెడతాడు. ఇక నీ జాతకాలు గురించి రాసుకుంటాను అని గన్ పైన కప్పి ఉన్న పేపర్ తీయబోతుండగా నో అని గట్టిగా అరుస్తాడు.  అలా ఎందుకు అరిచావు అని జానకి అనటంతో ఆ పేపర్ బాగాలేదు అని అంటాడు.


నా డీటెయిల్స్ అన్నీ వెన్నెలకు పంపిస్తాను అని అంటాడు. ఆ తర్వాత తన తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి మాట్లాడుతుండగా ఇద్దరు టెర్రరిస్టులు దొరికారు అని జానకి కి ఫోన్ రావడంతో జానకి వెంటనే అక్కడికి బయలుదేరుతుంది. కిషోర్ తన ఫేక్ తల్లిదండ్రులతో బాగానే నటించారు అని తెగ నవ్వుకుంటూ ఉంటాడు.  అప్పుడే తనకు ఇద్దరు టెర్రరిస్టులు దొరికిపోయారు అని ఫోన్ రావడంతో కంగారు పడతాడు.


ఇక జానకి ఇద్దరి టెర్రరిస్టులను చంపేస్తుంది. మరోవైపు కిషోర్ కి ఈ విషయం తెలియడంతో భయపడుతూ ఉంటాడు. జానకి చనిపోయిన ఇద్దరు టెర్రరిస్టుల టాటూ లు ఒకేలా ఉండటంతో మరో టెర్రరిస్టుకు కూడా ఇదే టాటూ ఉంటుంది అని అతడిని ఎలాగైనా పట్టుకోవాలి అని తెలుసుకుంటుంది. 


 


also read it : Prema Entha Madhuram August 5th: ఆర్య మాటలకు ధైర్యం తెచ్చుకున్న అంజలి.. మాన్సీ నిజరూపం చూసి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టిన వర్ధన్ ఫ్యామిలీ?


Join Us on Telegram: https://t.me/abpdesamofficial