Prema Entha Madhuram August 5th: అంజలి ఆర్య దగ్గరికి వెళ్లి మాన్సీ గురించి మాట్లాడుతుంది. ఇక తన గురించి ఇప్పుడెందుకు అన్నట్లుగా ఆర్య అంటాడు. ఒకవేళ తను మారిపోయాను అని వస్తే అప్పుడు నీరజ్ కూడా తనను అర్థం చేసుకుంటే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని అంటుంది. తను ఎప్పుడు మారదు తను అవకాశం చూసుకుంటుంది తప్ప మారదు అని ఆర్య అంటాడు. తనను ఎప్పటికీ దూరంగా ఉంచాలి అని అంటాడు.
నీకు నీరజ్ కు మధ్య ఎటువంటి అండర్ స్టాండింగ్ ఉందో తెలియదు కానీ నువ్వు ఈ ఇంట్లో ఉండటం చాలా ఇంపార్టెంట్.. అది కూడా మా ఫ్యామిలీ మెంబర్ గా ఉండటం చాలా బాగుంటుంది.. నువ్వు ఉండటం వల్ల మాకే కాకుండా నీరజ్ కి కూడా చాలా ధైర్యం ఉంటుందని కాబట్టి మాన్సీ గురించి ఎటువంటి టెన్షన్ పడకుండా నువ్వు ఫ్రీ గా ఉండు అని అంటాడు.
దాంతో అంజలికి ధైర్యం వస్తుంది. మీరు ఇలా చెప్పినందుకు ఇప్పుడు నేను చాలా ఫ్రీగా ఉన్నాను.. నాకు ఎటువంటి టెన్షన్స్ లేవు అని కాస్త సంతోషపడుతుంది. అంజలి అక్కడినుంచి వెళ్లిన తర్వాత ఆర్య జిండే కి ఫోన్ చేసి ఇంటికి రమ్మని కబురు చేస్తాడు. ఇక జిండేతో ఇంట్లో వాళ్ళు మాన్సీ గురించి భయపడుతున్నారు అని అంజలి మాట్లాడిన మాటలన్నీ చెబుతాడు.
మాన్సీ ఎక్కడ కనిపించినా కూడా తనను ఇంట్లోకి రానివ్వకుండా చేయమని చెబుతాడు. దాంతో జిండే నేను చూసుకుంటాను తను ఎప్పుడు కనిపించినా కూడా తనను ఫ్యామిలీ జోలికి రానివ్వను అని మాట ఇస్తాడు. ఇక మరుసటి రోజు ఉదయాన్నే మాన్సీ అందర్నీ నమ్మించడానికి చేయి కట్ చేసుకున్నాను.. ఇప్పుడు చాలా నొప్పిగా ఉంది అని నొప్పితో బాధపడుతూ ఉంటుంది.
అయిన ఈ ఇంట్లో సెటిల్ అవ్వాలంటే కొన్ని రోజులు ఈ నొప్పి భరించాల్సిందే అని అనుకుంటుంది. అప్పుడే అక్కడికి అంజలి రావటంతో నొప్పి పుడుతున్నట్లుగా నటిస్తుంది. ఇక అంజలి వచ్చి మాన్సీ నిజరూపాన్ని బయటపెట్టే ప్రయత్నం చేస్తుంది. కానీ మాన్సీ అంజలి మాటలను కంట్రోల్ చేసుకుంటుంది. ఈ ఇంట్లో ఉండాలి అంటే ఆస్తిని వదులుకుంటున్నట్లు.. మా ఇద్దరి మధ్య రాకూడదు అని అగ్రిమెంట్ తీసుకోవాలని చెబుతుంది.
దాంతో మాన్సీ ఈ ఆస్తిని అస్సలు వదులుకోలేను అని తన అసలు రూపాన్ని చూపిస్తుంది. వెంటనే అంజలి నాకు తెలుసు నీ అసలు రూపం అని నేను ఆస్తి కోసం ఇలా చేయలేదు నీ అసలు రూపాన్ని బయట పెట్టడం కోసం ఇలా చేశాను.. ఇక నీ గురించి అందరికీ తెలిసేలా చేశాను అని అక్కడే వచ్చి నిలబడి ఉన్న జిండే, శారదమ్మ, నీరజ్ లను చూసి షాక్ అవుతుంది.
ఇక వాళ్ళు ఫైర్ అయ్యి ఆర్య జాగింగ్ నుండి వచ్చే వరకు నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అని మర్యాదగా చెపుతారు. కానీ తను మాత్రం వచ్చాక ఆర్యతో మాట్లాడుతాను అనడంతో వాళ్ళందరూ అసలు ఒప్పుకోరు. ఇంట్లో నుంచి మర్యాదగా వెళ్తేనే బాగుంటుంది అని లేకుంటే జీవితాంతం జైల్లోనే ఉండాల్సి వస్తుంది అని అనడంతో సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు అను పిల్లలను రెడీ చేస్తూ మీకు ఎటువంటి లోటు లేకుండా నేను చూసుకుంటాను అని పిల్లలపై ప్రేమ చూపిస్తూ ఉంటుంది. ఇక ఆర్య అనుని తలుచుకుంటూ ఉంటాడు.
also read it : Madhuranagarilo August 4th: కాబోయే భర్త కోసం జ్యూస్ లో మత్తుమందు కలిపిన సంయుక్త.. రాధకు డ్రెస్ మార్చాలనుకుంటున్న శ్యామ్?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial