బుల్లితెరపై రష్మీ, సుధీర్ జోడికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ జంట తమ ఆన్ స్క్రీన్ రొమాన్స్ తో ఎంతో పాపులారిటీ తెచ్చుకున్నారు. ‘జబర్దస్త్ షో’తో సుధీర్, రష్మిల లవ్ స్టోరీ మొదలవగా.. ఆ తర్వాత దాన్ని కొన్ని సంవత్సరాల పాటు కంటిన్యూ చేస్తూ వచ్చారు. ‘జబర్దస్త్’లో కొన్ని ఎపిసోడ్స్ కి స్కిట్స్ కంటే వీళ్ళ లవ్ స్టోరీ ద్వారానే ఎక్కువ టిఆర్పి రేటింగ్స్ వచ్చేవి. దాంతో నిర్వాహకులు కూడా ఈ జంట పైనే ప్రత్యేకంగా స్పెషల్ ఈవెంట్స్ నిర్వహించేవారు. అలా రష్మీ, సుధీర్ జంట మధ్య బాండింగ్ బాగా పెరిగింది. దీంతో వీళ్ళ బాండింగ్ చూసి సుధీర్, రష్మీ ప్రేమలో ఉన్నారని ముందు అనుకున్నా, ఆ తర్వాత అది కేవలం టిఆర్పి కోసం కలిపిన ‘పులిహోర’ అని ప్రేక్షకులు కూడా అర్థం చేసుకున్నారు. అయినా కూడా ఈ జోడికున్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.


‘జబర్దస్త్’ నుంచి సుడిగాలి సుధీర్ బయటికి వచ్చేయడంతో వీళ్ళ లవ్ స్టోరీకి కాస్త బ్రేక్ పడింది. సుధీర్ ప్రస్తుతం సినిమాలపై ఫోకస్ చేస్తున్నాడు. వీలున్నప్పుడు మధ్యలో షోస్ కూడా చేస్తున్నాడు. అయితే గత కొంతకాలంగా బుల్లితెరపై రష్మీ, సుధీర్ కలిసి కనిపించకపోయేసరికి వారి అభిమానులు డిసప్పాయింట్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే తాజాగా సుధీర్, రష్మీ కలిసి ఓ స్పెషల్ ఈవెంట్ లో సందడి చేయబోతున్నారు. 'బలగం' అనే స్పెషల్ ఈవెంట్‌లో వీరిద్దరు మళ్లీ కలిసి కనిపించబోతున్నారు. ఈ ఈవెంట్ కి సుధీర్, రష్మీ కలిసి యాంకరింగ్ చేస్తున్నారు. చాలాకాలం తర్వాత సుధీర్, రష్మీ జంటగా హోస్ట్ చేస్తున్న ఈవెంట్ ఇది. తాజాగా విడుదలైన ప్రోమోలో సుధీర్, రష్మీ కెమిస్ట్రీ మరోసారి హైలెట్‌గా నిలిచింది.


సుధీర్ ని చూడగానే రష్మీ అలిగినట్టు ఈ ప్రోమోలో చూపించారు.' మేడం గారు ఎందుకో కోపంగా ఉన్నారు?' అని సుధీర్ రష్మిని అడిగాడు. అప్పుడు రష్మీ.. ‘‘నువ్వు వస్తావని ఇన్నాళ్లు ఎదురు చూసా’’ అని చెబుతుంది. ‘‘ఇన్ని రోజులు ఎక్కడున్నావు?’’ అని రష్మీ అడిగితే.. ‘‘నేను ఎక్కడున్నా నువ్వు మాత్రం ఇక్కడే’’ అంటూ సుధీర్ గుండెలపై చేయి పెట్టి చూపించడం’’ ప్రోమోకు హైలెట్ గా నిలిచింది. సుధీర్ ఇచ్చిన ఆన్సర్ తో రష్మీ తెగ సిగ్గు పడిపోయింది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి కొన్ని పాటలకు డాన్స్ కూడా చేశారు. ఓ సాంగ్ లో సుధీర్ గుండెల పై రష్మి వాలిపోవడం కూడా ఈ ప్రోమోలో చూడొచ్చు.


చాలా రోజుల తర్వాత రష్మీ, సుధీర్ మళ్ళీ జంటగా కనిపించడంతో ఈ ప్రోమో చూసి అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. దీంతో ఈ ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అంతేకాదు ఈ ప్రోమోను చూసిన కొంతమంది నెటిజన్స్ అయితే.. 'సుధీర్ రష్మీ జోడిని ఇన్ని రోజులు ఎంతో మిస్ అయ్యామని', 'ఎన్నో జంటలు వస్తూ ఉంటాయి. పోతుంటాయి. కానీ సుధీర్ రష్మీ జంట మాత్రం ఎప్పటికీ ప్రత్యేకమైనదని, 'సుధీర్ రష్మీ జోడిలో ఏదో మ్యాజిక్ ఉందని'.. ఇలా రకరకాల కామెంట్స్ చేశారు. కొందరు మాత్రం ఓరి వీరి వేషాలో అని కామెంట్లు పెడుతున్నారు. అదంతా స్క్రిప్టెడ్ అని, మరోసారి పులిహోర లవ్ స్టోరీతో వస్తున్నారని ట్రోల్ చేస్తున్నారు. ఈ ఈవెంట్లో బుల్లితెర నటీనటులతో పాటు ఆస్కార్ విన్నర్ లిరిసిస్ట్ చంద్రబోస్, కార్తికేయ నటించిన 'బెదురులంక' మూవీ టీం తో పాటు మరికొన్ని మూవీ టీమ్స్ పాల్గొన్నాయి.


Also Read : ఆలియా భట్ బ్రిటీష్ దేశానికి చెందినదా? అసలు విషయం చెప్పిన ‘RRR’ సీత!




Join Us on Telegram: https://t.me/abpdesamofficial