Madhuranagarilo August 10th: మధుర సంయుక్త కోసం నగలు తీసుకొని వస్తుంది. ఇక నగలు వేసుకొని తమ ఇంట్లో అడుగు పెట్టాలని చెబుతుంది. అప్పుడే శ్యామ్ కి ఫోన్ రావడంతో శ్యామ్ బయటికి వెళ్లగానే రాధ కూడా శ్యామ్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడే సంయుక్త వాళ్ళ ఫ్రెండ్ రాధను అబ్జర్వ్ చేసి తనను ఫాలో అవుతుంది. రాధ శ్యామ్ దగ్గరికి వెళ్లి సంయుక్త ని పెళ్లి చేసుకోనన్న విషయం మేడంకి చెప్పొద్దు అని అంటుంది.


సరే అలా ఏమి చెప్పను నిన్ను పెళ్లి చేసుకుంటానని చెబుతాను అని అక్కడినుంచి వెళ్ళిపోతాడు.  ఇక వీరిద్దరూ ఏం మాట్లాడుకున్నారా అని వెంటనే ఈ విషయం సంయుక్తకు చెప్పాలి అని సంయుక్త ఫ్రెండ్ అనుకుంటుంది. మరోవైపు సంయుక్త అరేంజ్ చేసిన రౌడీలు బయట ఎదురు చూస్తూ ఉంటారు. మరోవైపు రాధ చాలా బాధపడుతూ ఉండగా అక్కడికి స్వప్న రావడంతో.. శ్యామ్ తనతో పెళ్లి గురించి మధుర తో మాట్లాడతాడు అనే విషయాన్ని చెబుతుంది.


మరోవైపు రౌడీలకు సంయుక్త ఫోన్ చేసి రాధ వాళ్ళు తమ ఇంటికి వచ్చారని అవకాశం చూసుకొని తనను కిడ్నాప్ చేయమని చెబుతుంది. ఇక వాసంతి మెహందీ డిజైనర్లతో తనకు నచ్చిన డిజైన్లు పెట్టమని అడుగుతుంది. ఇక వాళ్లతో కాసేపు సరదాగా మాట్లాడుతూ ఉంటుంది. మరోవైపు శ్యామ్ తన తల్లి దగ్గరికి వచ్చి పక్కకు రమ్మని మాట్లాడాలని అంటాడు. ఇక సంయుక్త ఫ్రెండ్ సంయుక్త కు రాధ, శ్యామ్ లు ఏదో మాట్లాడుకున్నారు అని చెబుతుంది.


అప్పుడే సంయుక్త శ్యామ్ వాళ్ళ దగ్గరికి వచ్చి శ్యామ్ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నేను తనతో సరిగ్గా ఉండటం లేదని.. ఒక ఆ విషయం చెప్పడం కోసమే మిమ్మల్ని పక్కకు రమ్మని అంటున్నాడని అంటుంది.  ఆ తర్వాత మెహేంది డిజైన్ శ్యామ్ ను పెట్టమని అంటుంది. కానీ శ్యామ్ తనకు డిజైన్ పెట్టడం రాదు అనటంతో.. తను బలవంతంగా చెయ్యి పట్టుకొని తీసుకొని వెళుతుంది.


ఆ సమయంలో రాధ మొహం మారిపోతుంది. సంయుక్త సర్ చేయి పట్టుకోగానే నేనెందుకు జలసీగా ఫీల్ అవుతున్నాను అని అనుకుంటుంది. ఇక శ్యామ్ సంయుక్త కు మెహందీ పెడుతూ ఉండగా.. రాధ వారిని చూసి సంయుక్త స్థానంలో తను ఉన్నానని ఊహించుకుంటుంది. మళ్లీ తేరుకొని ఇలా ఊహలు వస్తున్నాయి ఏంటి అని ఎలాగైనా శ్యామ్ సర్ సంయుక్తనే పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది.


ఆ తర్వాత రాధ మధురకు వెళ్లి మెహిందీ పెడుతుంది. ఇక శ్యామ్ మెహందీ పూర్తయిందని ఒకసారి చూడు అని సంయుక్తకు చెబుతాడు. దాంతో సంయుక్త తన చేతి వైపు చూడటంతో అక్కడ ఐ లవ్ యు రాధ అని రాసి ఉంటుంది. అది చూసి గట్టిగా అరవటంతో అక్కడున్న వాళ్లంతా ఏం జరిగింది అని అంటారు. శ్యామ్ తన చెయ్యి గిల్లాడు అని అబద్ధం చెబుతుంది.


ఆ తర్వాత సంయుక్త శ్యామ్ తో ఎందుకు ఇలా రాశావు అనటంతో ఉన్నదే రాశాను అని.. నా ప్రేమ గురించి మా అమ్మకు చెప్పడానికే ఇక్కడికి వచ్చాను అని.. అక్కడ రాధ అడ్డుపడుతుంది అని అంటాడు. తరువాయి భాగంలో రౌడీలు రాధను కిడ్నాప్ చేస్తారు. ఇక శ్యామ్ రాధ ఇంటికి రానట్లు అనిపిస్తుంది అని తన తల్లితో చెప్పి రాధ ఇంటికి బయలుదేరుతాడు. ఇక సంయుక్త పండుని తీసుకొని కిడ్నాపైన రాధ దగ్గరికి తీసుకొని వెళుతుంది.


 


also read it : Trinayani August 9th: 'త్రినయని' సీరియల్: విశాల్ కు చావు ముహూర్తం పెట్టిన తిలోత్తమా, బంగారు పామున్న పెట్టెను చూసి షాకైన హాసిని, విక్రాంత్?


 


Join Us on Telegram: https://t.me/abpdesamofficial