Trinayani August 9th: తిలోత్తమా తన గదిలో బెడ్ పై పడుకొని కాళ్ల నొప్పితో అవస్థ పడుతూ ఉండటంతో అక్కడికి హాసిని ఏడుచుకుంటూ వస్తూ అత్తో అత్త అంటూ కాసేపు సరదాగా సీన్ క్రియేట్ చేస్తుంది. అంతేకాకుండా నొప్పి ఉన్న కాళ్ల పైన పడి తెగ ముర్రో అంటుంది. ఇక తిలోత్తమా ఆ నొప్పిని భరించలేక గట్టిగా అరుస్తుంది. అక్కడే ఉన్న పావన మూర్తి, జలంధర హాసినిని ఎంత లేవమన్నా కూడా లేవకుండా కాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటుంది.


తిలోత్తమా గట్టిగా వల్లభని పిలవగా వెంటనే అతడు హాసినిని లేపుతాడు. కానీ హాసిని మాత్రం కాసేపు బాగా సరదాగా సీన్ క్రియేట్ చేసి తన అత్తకు చుక్కలు చూపిస్తుంది. వెంటనే హాసినిని అక్కడి నుంచి బయటికి పంపించిన తర్వాత ఊపిరి పీల్చుకుంటుంది. మరోవైపు గదిలో విశాల్ నయని తో తన తల్లికి మరో రెండు మూడు వారాలలో క్లియర్ అవుతుంది అని చెబుతాడు. ఇక నయని విశాల్ కు తాగడానికి మంచి నీళ్లు ఇస్తుంది.


విశాల్ నీరు తాగుతూ ఉండగా వెంటనే నయనికి విశాల్ గొంతు మీద కట్ చేసి రక్తం వచ్చినట్లు కనిపించడంతో గట్టిగా అరుస్తుంది. ఏం జరిగింది అని విశాల్ అడగటంతో బొద్దింకనో, బల్లి లాగానో కనిపించింది అని అనటంతో విశాల్ మీ ఆడవాళ్లు ఎంతో ధైర్యవంతులు కానీ ఈ చిన్న వాటికి భయపడుతూ ఉంటారు అని చెప్పి అక్కడ నుంచి వెళ్తాడు. వెంటనే నయనికి నుదుట మీద భవిష్యత్తు కనిపిస్తుంది.


దాంట్లో విశాల్ గొంతు మీద కట్ చేసి రక్తం వచ్చినట్లు కనిపిస్తుంది. ఇందాక తనకు కనిపించింది నిజమే అనుకొని భయపడుతుంది. మరోవైపు విక్రాంత్ ఆఫీస్ పని చేస్తూ ఉండగా బాగా నిద్రలో ఉన్న సుమనను చూసి ప్రెగ్నెంట్ పేరుతో బాగా పడుకుంటుంది అని అనుకుంటాడు. అప్పుడే హాసిని అక్కడికి వచ్చి సుమనను లేపటంతో వద్దు అని లెగిస్తే తన వర్క్ అంత డిస్టర్బ్ చేస్తుందని అంటాడు విక్రాంత్.


ఇక తను బంగారు నాగుపాము తీసుకొచ్చాను అని.. విశాల్ తనకు కూడా ఒక వర్క్ ఇచ్చాడు అని.. ఆఫీస్ కి వెళ్ళాక ఆ పాము ఎక్కడ ఉంది అని తగులుతుందని అందుకే తీసుకొచ్చాను అని అంటుంది. దాంతో విక్రాంత్ నువ్వే ఎక్కడైనా పెట్టేసేయ్ అనడంతో హాసిని ఆ బంగారు పాముని పెట్టెలో పెడుతుంది. విక్రాంత్ దగ్గరికి వచ్చి ఆ పెట్టె చూడమని అనడంతో అక్కడ చూసేసరికి ఆ పెట్టె కనిపించదు.


కానీ ఆ పెట్టె సుమన కడుపు మీద తిరుగుతూ ఉండటంతో ఇద్దరు చూసి షాక్ అవుతారు. పైగా సుమన నాగుపాము వలే చేతులు పైకెత్తి ఊపుతూ ఉండటంతో ఇద్దరు భయపడతారు. వెంటనే హాసిని అక్కడి నుంచి వెళ్తుంది. ఆ తర్వాత తిలోత్తమా డోర్ దగ్గర సన్నని తీగను వల్లభ చేత కట్టిస్తుంది. విశాల్ అక్కడికి రాగానే ఆ తీగ తగిలి గొంతు కట్ అయ్యి రక్తం వచ్చి చచ్చిపోతాడు అని అంటుంది.


ఇక ఆ తీగ ఎవరికి కనిపించదు అని అంటుంది. ఇద్దరు మాట్లాడుతుండగా హాసిని అక్కడికి వస్తుంది. మీరిద్దరి ఏదో విషయంలో కంగారు పడుతున్నట్లు కనిపిస్తుంది అని కాసేపు వారిపై వెటకారం చేసి అక్కడి నుండి ఆఫీస్ కి వెళ్తుండగా.. ఇక్కడి నుండి వద్దు మరో దారిలో వెళ్ళమని అంటారు వారిద్దరూ. అలా కాసేపు అక్కడ అదే వాదన జరుగుతుంది. ఇక హాసిని మరో దారిలో వెళ్తుండగా తను ఆఫీస్ కి వెళ్తేనే మనకు మంచిది అని వల్లభ అంటాడు. ఆ మాటలు విన్న హాసిని అయితే ఈరోజు నేను ఆఫీస్ కి వెళ్ళను అని అంటుంది. మరోవైపు ధ్యానంలో ఉన్న గురువుకి తిలోత్తమా చేస్తున్న కుట్ర తెలియటంతో వెంటనే ఆ ప్రమాదాన్ని ఆపాలని అక్కడి నుంచి బయలుదేరుతాడు.


also read it : Janaki Kalaganaledhu August 8th: 'జానకి కలగనలేదు' సీరియల్: వెన్నెలకు సంబంధం చూసిన తల్లిదండ్రులు, కూతురిపై అనుమానపడుతున్న గోవిందరాజులు?


 
Join Us on Telegram: https://t.me/abpdesamofficial