Janaki Kalaganaledhu August 8th: జానకి.. తను చంపేసిన ఇద్దరు టెర్రరిస్టుల టాటూ లు ఒకేలా ఉండటంతో మరో టెర్రరిస్టుకు కూడా ఇదే టాటూ ఉంటుంది అని అతడిని ఎలాగైనా పట్టుకోవాలి అని అనుకుంటుంది. మరోవైపు కొన్ని రోజుల వరకు ఎవరికీ కనిపించకూడదు అని కిషోర్ బైక్ మీద వెళ్తూ ఉండగా ఒక వ్యక్తిని ఢీకొడతాడు. ఆ వ్యక్తి కింద పడినా కూడా పట్టించుకోకుండా వెళ్లిపోవడంతో అదే సమయంలో అక్కడున్న రామ కిషోర్ ని ఆపాలని చూస్తాడు. కానీ అతడు తప్పించుకోవటంతో కిందపడిన వ్యక్తిని కాపాడుతాడు.


మరోవైపు వెన్నెల తన వదిన కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. అక్కడ ఏం జరిగిందో అని తెలుసుకోవటానికి ఆరాటపడుతూ ఉంటుంది. అప్పుడే జానకి లోపలికి రావటంతో ఏం జరిగింది అని.. కనీసం ఫోన్ కూడా చేయలేదు అని వదిన అని అనటంతో.. బిజీగా ఉండటం వల్ల ఫోన్ చేయడం మర్చిపోయాను అని జానకి అంటుంది. ఇక కిషోర్ నీకు నచ్చాడా అని అడగటంతో నవ్వుతూ నచ్చాడు అని.. అంత బుద్ధిమంతుడిని ఎవరు కాదనుకుంటారు అని అంటుంది.


ఇక ఈ విషయాన్ని అమ్మానాన్నలకు చెప్పమని కూడా అంటుంది. ఇప్పుడే అన్నయ్యకు మాత్రం చెప్పకు అని లేదంటే అరుస్తాడు అని అంటుంది. దానికి జానకి సరే అంటుంది. అప్పుడే అక్కడికి రామ రావటంతో ఇద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు అని అడుగుతాడు. దాంతో జానకి కాసేపు అక్కడ సరదాగా ఆట పట్టిస్తూ ఉండటంతో వెన్నెల టెన్షన్ పడుతుంది. ఇక ఏమీ లేదు అని జానకి మళ్ళీ చెప్పడంతో వెన్నెల ఊపిరి పీల్చుకొని లోపలికి వెళ్ళిపోతుంది.


ఆ తర్వాత జానకి రామతో ఇద్దరు టెర్రరిస్టులను పట్టుకున్నాను అని వాళ్ళని చంపేశాను అని ఇంకొకడు ఉన్నాడు అని అంటుంది. దాంతో రామ కాస్త భయపడతాడు. ఇక రామ కూడా రోడ్డుమీద జరిగిన సంఘటన గురించి చెబుతాడు. ఇక మరుసటి రోజు ఉదయాన్నే వెన్నెల జానకితో తన తల్లికి నిజం చెప్పావా అని అడుగుతుంది. నైట్ అమ్మానాన్నలు పెళ్లి సంబంధం గురించి మాట్లాడుకున్నారు అని అంటుంది.


దానితో జానకి ఏం టెన్షన్ పడకు అని పెళ్లీడుకొచ్చిన కూతుర్లు ఉంటే అలాగే మాట్లాడుకుంటారు అని అనటంతో అప్పుడే అక్కడికి జ్ఞానంబ అన్న, వదిన పెళ్లి సంబంధం గురించి మాట్లాడటానికి వస్తారు. దాంతో వెన్నెల, జానకి ఇద్దరు టెన్షన్ పడతారు. గోవిందరాజు దంపతులతో పెళ్లి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక తమ కొడుకుతో ఒకసారి ఫోన్లో మాట్లాడమని వెన్నెలను అడగటంతో ఇప్పుడు మాట్లాడను అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది.


కాసేపు వాళ్లు మాట్లాడుకున్న తర్వాత వెన్నెలను పిలుస్తారు. వెన్నెల ఎంతకు రాకపోయేసరికి జానకి వెన్నెల దగ్గరికి వెళ్లి.. నీకు ఇష్టమైన వ్యక్తితో పెళ్లి చేయించే బాధ్యత నాది.. అత్తయ్య గారితో మెల్లగా చెబితే తనే ఒప్పుకుంటుంది అని ఒప్పించి బయటికి తీసుకుని వస్తుంది. ఇక రామ కూడా అక్కడికి రావడంతో వాళ్లని పలకరిస్తాడు. విషయం తెలియడంతో సంతోషపడతాడు. ఇక గోవిందరాజులు వెన్నెల ఎక్స్ప్రెషన్స్ చూసి అనుమానం పడతాడు. ఇక అందరూ ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్లాక గోవిందరాజుకు అనుమానం పెరిగిపోతుంది.


 


also read it : Madhuranagarilo August 5th: తాగి రచ్చ రచ్చ చేసిన రాధ.. శ్యామ్ తో ప్రేమలో పడ్డ రాధ?


Join Us on Telegram: https://t.me/abpdesamofficial