తులసి ఇంటికి ఒక బాక్స్ వస్తుంది. అందులో ఏముందో చూడాలని పరంధామయ్య, తులసి వాళ్ళు తెగ ఆరాటపడతారు. అది ఓపెన్ చేస్తే తన పరువు పోతుందని నందు తెగ ఫీలైపోతాడు. అందులో డంబెల్స్, రన్నింగ్ షూస్, స్కిప్పింగ్ చేసేందుకు తాడు ఉండటం చూసి కాసేపు నందుని ఆడుకుంటారు. ఆరోగ్యం మీద శ్రద్ద పెట్టడం కోసం చేశానని చెప్పి తప్పించుకుని వెళ్ళిపోతాడు. ఇక లక్కీ శేఖర్ వదిలి వెళ్ళిన విషయమే గుర్తు చేసుకుని బాధపడతాడు. తనకిక డాడీ లేడని తలుచుకుని ఏడుస్తాడు. రాజ్యలక్ష్మి హాస్పిటల్ లో తులసి వాళ్ళని స్టాఫ్ మెచ్చుకోవడం తలుచుకుని రగిలిపోతుంది. లాస్య వచ్చి ఏమైందని అడుగుతుంది.
రాజ్యలక్ష్మి: నా కళ్ళ ముందే నా శత్రువులు నా సామ్రాజ్యం కూలిపోతుంది. తులసి అన్నపూర్ణ అయిపోయింది. నన్ను పట్టించుకునే వాళ్ళు లేరు. అది చేస్తాను ఇది చేస్తానని చెప్పి నోరు తెరుచుకుని కూర్చున్నావ్
దివ్య: నేను ఛైర్మన్ భార్యని కాస్త జాగ్రత్తగా మాట్లాడండి. మీ డ్యూటీ హాస్పిటల్ లో అకౌంట్స్ చూడటం మరి మీరు చేస్తుంది ఏంటి లాస్య ఆంటీ
రాజ్యలక్ష్మి; నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు
దివ్య: మీకు చేయాల్సిన పని మీద ఆసక్తి తగ్గి అనవసరపు పని మీద ఆసక్తి పెరిగింది. హాస్పిటల్ కి సంబంధించి ఈనెల అకౌంట్స్
రాజ్యలక్ష్మి: అది నీ చేతికి ఎలా వచ్చింది
Also Read: కట్టుబొట్టు మార్చిన తింగరిపిల్ల- భవానీ నిర్ణయంతో కృష్ణ తిరిగి ఇంటికి వస్తుందా?
దివ్య: ఈనెల మీరు వేసిన లెక్కల్లో ఏడు లక్షలు తేడా వస్తుంది. హడావుడిలో ఏదైనా ఎంట్రీ వేయడం మర్చిపోయారు ఏమో చెక్ చేసి చెప్పు
లాస్య: చెప్పకపోతే
దివ్య: షటప్ నువ్వు నా దగ్గర జీతానికి పని చేస్తున్నావ్. అది గుర్తు పెట్టుకో.. చెప్పకపోతే ఫైల్ విక్రమ్ దగ్గరకి వెళ్తుంది
రాజ్యలక్ష్మి: హాస్పిటల్ సీఈవోని నేను. ఫైల్ నా చేతికి ఇచ్చి వెళ్లిపో
దివ్య: ఇక నుంచి హాస్పిటల్ లో జరిగే ప్రతి విషయంలో దివ్య కల్పించుకుంటుంది. ఆ తర్వాత విక్రమ్ కల్పించుకునేలా చేస్తాను. ఇదే ఫైనల్ వార్నింగ్ పిల్ల తలకాయ ఏం చేస్తుందని అనుకోవద్దు. పెద్ద తలకాయ లేచిపోతుంది. ఒకప్పటి దివ్య వేరు ఇప్పుడు దివ్య వేరు. ఇది నా ఆస్తి
రాజ్యలక్ష్మి: దీన్ని ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు
లాస్యకి లక్కీ హాస్టల్ వార్డెన్ ఫోన్ చేసి అబ్బాయి కనిపించడం లేదని చెప్తుంది. దీంతో లక్కీ ఏమైపోయాడా అని టెన్షన్ పడుతుంది. వరుసగా అన్ని ఎదురుదెబ్బలు తగులుతున్నాయని అనుకుంటుంది. లక్కీ తులసి ఇంటి తలుపు కొడతాడు. నందు తలుపు తీసి ఏడుస్తున్న లక్కీని చూసి షాక్ అవుతాడు. వెంటనే లక్కీ నందుని కౌగలించుకుని నేను మీకోసమే వచ్చాను మీతోనే ఉంటాను డాడీ అని ఏడుస్తాడు. తులసి వాడిని దగ్గరకి తీసుకుని ఎక్కడ నుంచి వచ్చావని అడుగుతుంది.
లక్కీ; హాస్టల్ లో ఉండాలని అనిపించలేదు వెంటనే వచ్చేశాను
తులసి: వస్తున్నట్టు ఎవరికైనా చెప్పావా?
లక్కీ: చెప్తే రానివ్వరు అందుకే పారిపోయి వచ్చాను
నందు: అయినా ఇక్కడికి రావడం ఏంటి మీ అమ్మ దగ్గరకి వెళ్ళాలి
లక్కీ: మీరే కదా నా డాడీ
నందు: ఇప్పుడు మీ అమ్మకి నాకు ఏ సంబంధం లేదు ఆ విషయం తెలియదా?
Also Read: కావ్య ప్లాన్ తెలుసుకోవడానికి రాజ్ తిప్పలు- అపర్ణకి చీవాట్లు పెట్టిన సీతారామయ్య
లక్కీ: తెలుసు. శేఖర్ డాడీ కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. మమ్మీ పట్టించుకోవడం లేదు. డాడీ కావాలన్నా వినిపించుకోవడం లేదు. నాకు ఈ డాడీ అంటే ఇష్టం అందుకే వచ్చేశాను. ఈ డాడీ దగ్గరే ఉంటాను ఆంటీ
నందు: వాడు అడిగింది చాక్లెట్ బిస్కెట్ కాదు డాడీ. వాడికి నాకు ఏ సంబంధం లేదు
తులసి: ముందు లాస్యకి కాల్ చేసి లక్కీ ఇక్కడ ఉన్నాడని చెప్పండి
లక్కీ: వద్దు నన్ను లాక్కుని వెళ్తుంది
లక్కీ కనిపించడం లేదని టెన్షన్ గా లాస్య శేఖర్ కి ఫోన్ చేసి అక్కడికి ఏమైనా వచ్చాడా అని అడుగుతుంది. తన దగ్గరకి రాలేదని చెప్తాడు. ఎప్పుడు ఎవడి కొంప ముంచాలని ఆలోచించడం కాదు పిల్లాడిని పట్టించుకోమని గడ్డి పెడతాడు. అప్పుడే నందు లాస్యకి ఫోన్ చేస్తే కట్ చేస్తుంది. మళ్ళీ ఫోన్ చేసి అసలు విషయం చెప్తాడు. దీంతో లాస్య ఆవేశంగా తులసి ఇంటికి వచ్చి లక్కీ మీద అరుస్తుంది. తల్లిని చూసి వణికిపోతాడు.
లక్కీ: నేను రాను డాడీ దగ్గరే ఉంటాను
నందు: అర్థరాత్రి వచ్చి వాడు తలుపు కొట్టాడు తలుపు తీసి ఇంట్లోకి రానిచ్చాము ఏమైనా అడగాలని ఉంటే అది వాడిని అడుగు
లక్కీ: నన్ను పంపించొద్దు డాడీ ప్లీజ్ అని నందుని కౌగలించుకుని ఏడుస్తాడు
ఎంత చెప్పినా కూడా లక్కీ మాత్రం లాస్యతో వెళ్ళడానికి అంగీకరించడు.
రేపటి ఎపిసోడ్లో..
విక్రమ్ తండ్రిని చక్కగా తయారు చేసి అందరి ముందుకు తీసుకొస్తుంది. అది చూసి విక్రమ్ సంతోషపడతాడు. తులసిని దెబ్బ కొడితే కానీ దివ్య దారిలోకి రాదని రాజ్యలక్ష్మి మరో ప్లాన్ రెడీ చేస్తుంది.