లవ్లీగా 'హాయ్ నాన్న' టీజర్, హీరోకి మృణాల్ ముద్దు - డిసెంబర్ 21 నుంచి ముందుకొచ్చిన నాని సినిమా
నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా రూపొందుతున్న తాజా సినిమా 'హాయ్ నాన్న'. శౌర్యువ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం1గా ఈ సినిమా రూపొందుతోంది. చెరుకూరి వెంకట మోహన్ (సీవీయమ్), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 'హాయ్ నాన్న' సినిమాలో నాని జోడీగా ఉత్తరాది భామ మృణాల్ ఠాకూర్ నటిస్తున్నారు. 'సీతా రామం' తర్వాత తెలుగులో ఆమె నటిస్తున్న చిత్రమిది. 'హాయ్ నాన్నా'లో నాని తండ్రి పాత్ర చేస్తున్నారు. ఆయన కుమార్తెగా కియారా ఖన్నా కనిపించనున్నారు. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... ఈ సినిమా టీజర్‌ను ఇవాళ విడుదల చేశారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


మాసీగా సాయి ధరమ్ తేజ్ - 'గాంజా శంకర్'గా వచ్చేశాడోయ్!
మెగా మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న సినిమాకు 'గాంజా శంకర్' టైటిల్ ఖరారు చేశారు. ఈ రోజు హీరో బర్త్ డే కానుకగా టైటిల్ అనౌన్స్ చేయడంతో పాటు సినిమా ఫస్ట్ హై (వీడియో గ్లింప్స్) విడుదల చేశారు. ఇంతకు ముందు ఎప్పుడూ కనిపించని విధంగా మాసీగా సాయి ధరమ్ తేజ్ ఉన్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


విజయ్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్' - అఫీషియల్ నామకరణం ఆ రోజే, టైటిల్‌తో పాటు టీజర్ కూడా!
విజయ్ దేవరకొండ హీరోగా ప్రముఖ నిర్మాత 'దిల్' రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థలో ఓ సినిమా రూపొందుతోంది. హీరోకి ఇది 13వ సినిమా అయితే... నిర్మాణ సంస్థలో 54వ సినిమా. ఈ సినిమా ప్రత్యేకత ఏమిటంటే... 'గీత గోవిందం' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ, ఆ సినిమా దర్శకుడు పరశురామ్ కలయికలో వస్తున్న చిత్రమిది. ఈ సినిమాలో 'సీతా రామం', 'హాయ్ నాన్న' సినిమాల ఫేమ్ మృణాల్ ఠాకూర్ కథానాయిక. మరో నాయికగా 'మజిలీ', 'రామారావు ఆన్ డ్యూటీ', 'మైఖేల్' సినిమాల ఫేమ్ దివ్యాంశ కౌశిక్ నటిస్తున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


కళ్యాణ్ రామ్ 'డెవిల్'లో మరో నటి - రాజకీయ నాయకురాలిగా...
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'డెవిల్'. ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్... అనేది ఉప శీర్షిక. ఇందులో సంయుక్తా మీనన్ హీరోయిన్. 'బింబిసార' తర్వాత కళ్యాణ్ రామ్ సరసన మరోసారి ఆమె నటించిన చిత్రమిది. సంయుక్త కాకుండా 'డెవిల్'లో మరొక హీరోయిన్ కూడా ఉన్నారు. 'ఎవడే సుబ్రమణ్యం' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన మలయాళీ భామ మాళవికా నాయర్. ఆ తర్వాత 'కళ్యాణ వైభోగమే', 'టాక్సీవాలా', 'ఒరేయ్ బుజ్జిగా', 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి', 'అన్నీ మంచి శకునములే' చిత్రాల్లో నటించారు. 'డెవిల్'లో ఆమె కీలక పాత్ర చేశారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


ఫిబ్రవరిలో సెట్స్ మీదకు నాగార్జున - ధనుష్ సినిమా!
తెలుగు ప్రేక్షకులకు ధనుష్ సుపరిచితులే. ఆయన తమిళ సినిమాలు తెలుగులో అనువాదం కావడమే కాదు... మంచి విజయాలు కూడా సాధించాయి. అంతే కాదు... ఇప్పుడు ఆయన తెలుగు దర్శకులతో పని చేయడానికి అమితాసక్తి చూపిస్తున్నారు. తెలుగు హీరోలతో కలిసి సినిమాలు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'సార్' చేశారు. అది ఆయనకు తొలి తెలుగు (స్ట్రెయిట్) సినిమా అది. 'సార్' కంటే ముందు సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమాకు 'ఎస్' చెప్పారు ధనుష్. అది వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇందులో టాలీవుడ్ మన్మథుడు, కింగ్ అక్కినేని నాగార్జున సైతం నటిస్తున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)