Top 5 Telugu Headlines Today 15 October 2023: 


ప్రజలకు ఐదు లక్షల కేసీఆర్ బీమా- నెల పింఛన్‌ ఐదు వేలు- ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన కేసీఆర్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అదిరిపోయే మేనిఫెస్టోను బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ విడుదల చేశారు. ఈసారి ఎన్నికల్లో పోటీ హోరాహోరీ ఉంటుందని సర్వేలు చెబుతున్న టైంలో కేసీఆర్‌ మరోసారి సంక్షేమ మేనిఫెస్టోతో ఓటర్ల ముందుకు వెళ్లనున్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన మేనిఫెస్టోను కేసీఆర్ విడుదల చేశారు. ఇప్పటికి రెండుసార్లు విజయం సాధించి అధికారం చేపట్టి కేసీఆర్ హ్యాట్రిక్‌ లక్ష్యంగా సంక్షేమ మేనిఫెస్టును రూపొందించారు. ఆయా చాలా రోజులుగా దీనిపై కసరత్తు చేసినట్టు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో విజయవంతంగా అమలు అవుతున్న పథకాలను బేరీజు వేసుకుని అమలు సాధ్యమయ్యే పథకాలను తీసుకొచ్చారు. పూర్తి వివరాలు


చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వ వైఖరి అమానవీయం - నిర్లక్ష్యం తగదన్న జనసేనాని పవన్ కల్యాణ్
స్కిల్ స్కాం కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్యంపై జనసేనాని పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన ఆరోగ్యంపై నిర్లక్ష్యం తగదని అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. 'చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై వైసీపీ ప్రభుత్వ వైఖరి అమానవీయం. మానవతా దృక్పథంతో వ్యవహరించాలి. వైద్యుల నివేదికలను పట్టించుకోకపోవడం సరి కాదు. జైళ్ల శాఖ అధికారుల వ్యాఖ్యలు ప్రభుత్వ వైఖరిని సూచిస్తున్నాయి. చంద్రబాబు ఆరోగ్యంపై ప్రభుత్వమే బాధ్యత వహించాలి.' అని పవన్ అన్నారు. పూర్తి వివరాలు


నవంబర్ నుంచి ఏపీలో కులగణన-ఆరు నెలల్లో పూర్తిచేసేలా ప్రణాళిక
ఎన్నికల సమీపిస్తున్న వేళ ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మక కార్యక్రమాలు చేపడుతోంది. కులగణనకు కూడా శ్రీకారం చుడుతోంది. కులగణన.. ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. జనాభా లెక్కలతోపాటు కులగణన చేయాలని పలు పార్టీలు, సంఘాలు ఎప్పటి నుంచో డిమాండ్‌ చేస్తున్నాయి. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే కులగణన మొదలైంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా రాష్ట్రం కులగణన చేయాలని నిర్ణయించుకుంది. నవంబర్‌ 15 తర్వాత రాష్ట్రంలో కులాల వారీగా అధికారిక సర్వే నిర్వహించేందుకు సిద్ధమవుతోంది జగన్‌ సర్కార్‌. దీనికి సంబంధించి కార్యాచరణ కూడా సిద్ధం చేస్తున్నారు అధికారులు. పూర్తి వివరాలు


పీసీసీ చీఫ్‌ను తిడితే అధిష్ఠానాన్ని తిట్టినట్టే- కారు మూడు ముక్కలు - కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాల్లో విజయం సాధించి కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతోందన్నారు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెంకట్‌ రెడ్డి. టికెట్‌ రాలేదని ఎవరూ బాధపడొద్దని నిజాయితీగా కాంగ్రెస్ జెండా మోసిన ప్రతి ఒక్కరికా న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా పదవులు  ఉంటాయని వాటిలో టికెట్ రానివారిని సర్దుబాటు చేస్తామన్నారు. పొన్నాల లక్ష్మయ్యను డాలర్ లక్ష్మయ్య అని పిలిచే వారని కాంగ్రెస్‌ వల్లే ఆయనకు గుర్తింపు వచ్చిందని గుర్తు చేసారు కోమటిరెడ్డి. అలాంటి వ్యక్తి పార్టీ మారడం బాధకలిగించిందని అభిప్రాయపడ్డారు. అయితే పార్టీ మారడం తప్పుకాదు కానీ... వెళ్లిపోయేటప్పుడు పార్టీపై పార్టీ నాయకత్వంపై నిందలు వేయడం సరికాదని అన్నారు. పూర్తి వివరాలు