Dhanush Nagarjuna Movie : ఫిబ్రవరిలో సెట్స్ మీదకు నాగార్జున - ధనుష్ సినిమా!

D51 Movie Updates : ధనుష్, అక్కినేని నాగార్జున, రష్మిక ప్రధాన తారలుగా శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న సినిమా రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరిలో స్టార్ట్ కానుందని తెలిసింది.

Continues below advertisement

తెలుగు ప్రేక్షకులకు ధనుష్ (Dhanush) సుపరిచితులే. ఆయన తమిళ సినిమాలు తెలుగులో అనువాదం కావడమే కాదు... మంచి విజయాలు కూడా సాధించాయి. అంతే కాదు... ఇప్పుడు ఆయన తెలుగు దర్శకులతో పని చేయడానికి అమితాసక్తి చూపిస్తున్నారు. తెలుగు హీరోలతో కలిసి సినిమాలు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'సార్' చేశారు. అది ఆయనకు తొలి తెలుగు (స్ట్రెయిట్) సినిమా అది. 'సార్' కంటే ముందు సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల (Sekhar Kammula) దర్శకత్వంలో ఓ సినిమాకు 'ఎస్' చెప్పారు ధనుష్. అది వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్లనుంది. 

Continues below advertisement

ఫిబ్రవరి నుంచి ధనుష్ - నాగార్జున సినిమా
ధనుష్ కథానాయకుడిగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అందులో టాలీవుడ్ మన్మథుడు, కింగ్ అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) సైతం నటిస్తున్నారు. అయితే... ఆయనది ఫుల్ లెంగ్త్ రోల్ కాదు, అలాగని అతిథి పాత్ర కూడా కాదు! కథలో చాలా అంటే చాలా కీలకమైన క్యారెక్టర్. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరిలో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. 

కథానాయికగా రష్మిక మందన్నా
D51 Movieలో నేషనల్ క్రష్ రష్మికా మందన్నా కథానాయిక. ధనుష్ జోడీగా ఇప్పటి వరకు ఆమె నటించలేదు. వాళ్ళిద్దరి కలయికలో తొలి చిత్రమిది. నాగార్జునతో కలిసి 'దేవదాస్' సినిమాలో నటించారు. నారాయణ్ దాస్ కె నారంగ్ ఆశీస్సులతో... శేఖర్ కమ్ములకు చెందిన అమిగోస్ క్రియేషన్స్ ప్రై.లి. సంస్థతో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి (ఏషియన్ గ్రూప్ యూనిట్) పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ధనుష్ 51వ చిత్రమిది. అందుకని, D51 Movie అని పిలుస్తున్నారు. 

Also Read : పెద్ద మావయ్య శంకర్ దాదా... చిన్న మావయ్య గుడుంబా శంకర్... ఇప్పుడు మేనల్లుడు 'గాంజా శంకర్'

ప్రస్తుతం ధనుష్ చేస్తున్న సినిమాల విషయానికి వస్తే... ఆయన ఓ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అందులో ఆయన హీరో. ఆయన తమ్ముడిగా తెలుగు హీరో సందీప్ కిషన్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ చెన్నైలో జరుగుతోంది. రాత్రి వేళ వచ్చే సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ధనుష్, ప్రియాంకా అరుల్ మోహన్ జంటగా... శివ రాజ్ కుమార్, సందీప్ కిషన్ కీలక పాత్రల్లో నటించిన 'కెప్టెన్ మిల్లర్' సినిమా డిసెంబర్ 15న తమిళంతో పాటు తెలుగు, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. 

Also Read బాలీవుడ్ హీరోతో రష్మిక లిప్ లాక్ - నెట్టింట వైరల్ అవుతోన్న ఫోటో

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
 

Continues below advertisement