ఆన్ స్క్రీన్ లిప్ లాక్స్ విషయంలో రష్మికా మందన్నా (Rashmika Mandanna)కు ఎటువంటి అభ్యంతరాలు లేవు. 'గీత గోవిందం' సినిమాలో విజయ్ దేవరకొండ, రష్మిక పాత్రల మధ్య అసలు గొడవ మొదలైంది బస్సులో ముద్దు దగ్గరే కదా! ఆ సినిమా క్లైమాక్స్ కోసం లిప్ లాక్ షూట్ చేశారు. కానీ, థియేటర్లలో విడుదలైన ఫైనల్ కట్ చూస్తే అది ఉండదు. అఫ్ కోర్స్... నెట్టింట లీక్ అయ్యిందనుకోండి! 'దేవదాస్'లో నాని సరసన రష్మిక నటించారు. అందులో వాళ్ళిద్దరి మధ్య ముద్దు కాని ముద్దు ఒకటి ఉంటుంది. ఇప్పుడు హిందీ హీరోతో లిప్ లాక్ చేశారు రష్మిక.
'యానిమల్' కోసం హీరో హీరోయిన్ల లిప్ లాక్!
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, రష్మికా మందన్నా జంటగా నటిస్తున్న సినిమా 'యానిమల్' (Animal Movie). ఇందులో తొలి పాటను రేపు (అనగా బుధవారం, అక్టోబర్ 10న) విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా ఓ పోస్టర్ విడుదల చేశారు. అందులో రణబీర్, రష్మిక మధ్య ఘాటు ముద్దు ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది.
హిందీలో 'హువా మెయిన్...', తెలుగులో 'అమ్మాయి...' పేరుతో ఈ పాట విడుదల కానుంది. తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఈ పాటను విడుదల చేయనున్నారు. 'అర్జున్ రెడ్డి', 'కబీర్ సింగ్' సినిమాల తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన చిత్రమిది. ఆల్రెడీ విడుదలైన టీజర్ చూస్తే... వయలెన్స్ గట్టిగా ఉన్నట్లు కనపడుతోంది. యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రమే కాదు, ఈ సినిమాలో రొమాంటిక్ సీన్స్ కూడా చాలా వయలెంట్‌గా ఉంటాయట.
Also Read : రాజమౌళి @ 50 - భారతీయ సినిమా బ్రాండ్ అంబాసిడర్ నెక్స్ట్ టార్గెట్ హాలీవుడ్ కుంభస్థలమే
రణబీర్ కపూర్, రష్మిక మధ్య ఫస్ట్ నైట్ సీన్!
'యానిమల్'లో రణబీర్, రష్మికకు పెళ్లైందని టీజర్ చూస్తే తెలుస్తుంది. వాళ్ళిద్దరి మధ్య ఫస్ట్ నైట్ సీన్ కూడా ఉందని బాలీవుడ్ టాక్. ఒకవైపు ఫస్ట్ నైట్... మరో వైపు విలన్స్ ఎటాక్... రెండిటినీ బాలన్స్ చేస్తూ సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) తీసిన సీన్స్ సినిమాలో హైలైట్ అవుతాయని టాక్.
రణబీర్, రష్మిక పెళ్లి తర్వాత ఫస్ట్ నైట్ జరుగుతుండగా... విలన్స్ ఎటాక్ చేస్తారట! ఒకవైపు గాల్లోకి విలన్లను పంపిస్తూ... మరో వైపు రొమాన్స్ చేసిన సన్నివేశాలు బాగా వచ్చాయని ఇన్‌సైడ్ టాక్. సందీప్ రెడ్డి వంగా మేకింగ్ చూసి ప్రేక్షకులు సర్‌ప్రైజ్ అవుతారట. ఇప్పటి వరకు రష్మిక ఇటువంటి సీన్ చేయలేదని ముంబై సినిమా జనాలు అంటున్నారట.
Also Read : త్రివిక్రమ్ - ప్రేక్షకుడితో నడిచే జీవితం, ఎప్పటికీ మరువలేని పుస్తకం!
'యానిమల్' కథ చాలా పవర్ ఫుల్‌గా ఉంటుందని, రణబీర్ కపూర్ ఈ సినిమాలో భిన్నమైన పాత్రలో కనిపిస్తారని చిత్ర బృందం పేర్కొంది. ఆల్రెడీ విడుదలైన టీజర్ చూస్తే... మాఫియా నేపథ్యంలో తీసిన సినిమా అని అర్థం అవుతోంది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'యానిమల్' కోసం రణబీర్ స్పెషల్ మేకోవర్ అయ్యారట. ఆయనకు తండ్రిగా హిందీ సీనియర్ హీరో అనిల్ కపూర్ నటించారు. రష్మిక గీతాంజలి పాత్రలో కనిపించనున్నారు. డిసెంబర్ 1న ఈ సినిమా విడుదల కానుంది.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial