నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'డెవిల్' (Devil Movie). ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్... అనేది ఉప శీర్షిక. ఇందులో సంయుక్తా మీనన్ హీరోయిన్. 'బింబిసార' తర్వాత కళ్యాణ్ రామ్ సరసన మరోసారి ఆమె నటించిన చిత్రమిది. సంయుక్త కాకుండా 'డెవిల్'లో మరొక హీరోయిన్ కూడా ఉన్నారు.
మణిమేఖల పాత్రలో మాళవికా నాయర్!
'ఎవడే సుబ్రమణ్యం' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన మలయాళీ భామ మాళవికా నాయర్. ఆ తర్వాత 'కళ్యాణ వైభోగమే', 'టాక్సీవాలా', 'ఒరేయ్ బుజ్జిగా', 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి', 'అన్నీ మంచి శకునములే' చిత్రాల్లో నటించారు. 'డెవిల్'లో ఆమె కీలక పాత్ర చేశారు.
Malavika Nair In Devil Movie : 'డెవిల్' సినిమాలో మణిమేఖల పాత్రలో మాళవికా నాయర్ నటించినట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఆమె ఫస్ట్ లుక్ సైతం ఈ రోజు విడుదల చేశారు. అది చూస్తే... రాజకీయ నాయకురాలిగా మాళవిక నటించినట్లు అర్థం అవుతోంది.
Also Read : విజయ్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్' - అఫీషియల్ నామకరణం ఆ రోజే, టైటిల్‌తో పాటు టీజర్ కూడా!
'డెవిల్' సినిమాతో నిర్మాత, అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్ నామా దర్శకుడిగా మారారు. ఆయన ఈ సినిమాపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. మద్రాస్ ప్రెసిడెన్సీ, 1940 నేపథ్యంలో 'డెవిల్' తెరకెక్కిస్తున్నారు. ప్రేక్షకుల్ని ఆ కాలంలోకి తీసుకు వెళ్లేందుకు సంగీతాన్ని కూడా చక్కగా ఉపయోగించుకోవాలని పాటల మీద స్పెషల్ కాన్సంట్రేషన్ చేశారు. దర్శక నిర్మాత అభిషేక్ నామా, సంగీత దర్శకుడు హర్షవర్దన్ రామేశ్వర్. వాళ్ళిద్దరి ఆలోచనల నుంచి పుట్టిందే 'మాయే చేసే' వింటేజ్ సాంగ్.
'మాయే చేసే...' పాటలో రకరకాల వాయిద్యాలు వాడారు. దక్షిణాఫ్రికా నుంచి జెంబో, బొంగొ, డీజెంబోలు... మలేసియా నుంచి డఫ్ డ్రమ్స్... చైనా నుంచి మౌత్ ఆర్గాన్, దర్భుకా... దుబాయ్ నుంచి ఓషియన్ పర్‌క్యూషన్, సింగపూర్ నుంచి ఫైబర్ కాంగో డ్రమ్స్, వెస్ట్ ఆఫ్రికా నుంచి హవర్ గ్లాస్, షేప్డ్ టాకింగ్ డ్రమ్ తదితర వాయిద్యాలను ఈ పాటలో వాడారు. 'డెవిల్' సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నవంబర్ 24న సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
Also Read : లవ్లీగా 'హాయ్ నాన్న' టీజర్, హీరోకి మృణాల్ ముద్దు - డిసెంబర్ 21 నుంచి ముందుకొచ్చిన నాని సినిమా
ఈ చిత్రానికి కాస్ట్యూమ్ డిజైన్స్: అశ్విన్ రాజేష్, రీ రికార్డింగ్ మిక్స్: ఎ.ఎం. రహ్మతుల్లా, ఎం. రహ్మతుల్లా, స్టంట్స్: వెంకట్ మాస్టర్, కూర్పు : తమ్మిరాజు, కథా విస్తరణ : ప్రశాంత్ బరాడి, ఛాయాగ్రహణం : సౌందర్ రాజన్ .ఎస్, ప్రొడక్షన్ డిజైనర్: గాంధీ నడికుడికర్, కథ - కథనం - మాటలు : శ్రీకాంత్ విస్సా, సంగీతం : హర్షవర్ధన్ రామేశ్వర్, సమర్పణ: దేవాన్ష్ నామా, నిర్మాణ సంస్థ : అభిషేక్ పిక్చర్స్, నిర్మాణం - దర్శకత్వం : అభిషేక్ నామా.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial