కోలీవుడ్ అగ్ర హీరో తలపతి విజయ్ నటించిన తాజా చిత్రం 'లియో'(Leo) పై ఏ రేంజ్లో అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకు కారణం ఈ సినిమాను లోకేష్ కనగరాజ్ తెరకెక్కించడమే. 'ఖైదీ' మూవీతో సినిమాటిక్ యూనివర్స్‌ని క్రియేట్ చేసిన ఈ కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ ఇటీవల 'వితక్రమ్' సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. 'విక్రమ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్ - లోకేష్ కాంబినేషన్లో రాబోతున్న రెండవ చిత్రం ఇది. దీంతో ఈ సినిమాపై ఇప్పటికే సౌత్ లో భారీ హైప్ నెలకొంది. ఫ్యాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. అందుకే లోకేష్ కనగరాజ్ వరుస ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు.
ఇప్పటికే తమిళనాట వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాలో చాలా సర్ప్రైజ్ లు ప్లాన్ చేసామని హింట్స్ ఇస్తూ అంచనాలను తారస్థాయికి తీసుకెళ్తున్నాడు. అయితే తమిళంలో ఓ రేంజ్ లో హైప్ ఉన్న ఈ చిత్రానికి తెలుగు, మలయాళంలో అంతగా ఆసక్తి కనిపించడం లేదు. అందుకు కారణం ఇక్కడ పెద్దగా ప్రమోషన్స్ చేయకపోవడమే అంటున్నారు. దానికి తోడు 'జైలర్', 'విక్రమ్' స్థాయిలో మ్యూజిక్ లేదనే మాట కూడా వినిపిస్తోంది.
నిజానికి అనిరుద్ మ్యూజిక్ అంటే ఆ మూవీ ఆల్బమ్ చార్ట్ బస్టర్ అవ్వడం ఖాయం. కానీ 'లియో' సాంగ్స్ ఏమాత్రం ఆకట్టుకోలేదు. దానికి తోడు 'లియో' ఎ హిస్టరీ ఆఫ్ వైలెన్స్ అనే మూవీకి ఫ్రీమేక్ అని ప్రచారం జరుగుతుంది. ఈ కారణాలన్నింటి వల్ల ఆడియన్స్ లో 'లియో'పై అంచనాలు తగ్గిపోతున్నాయి. కానీ బిజినెస్ వర్గాలు మాత్రం ఇవేవీ పట్టించుకోనట్లే కనిపిస్తోంది. ఎందుకంటే 'లియో' మూవీకి భారీగా థియేట్రికల్ అండ్ నాన్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది.
'లియో' థియేట్రికల్ బిజినెస్ వివరాలు చూస్తే..
తమిళనాడు - రూ.100 కోట్లు
ఆంధ్రప్రదేశ్ - రూ. 14 కోట్లు
తెలంగాణ - రూ. 7 కోట్లు
కర్ణాటక - రూ. 13 కోట్లు
కేరళ - రూ.16 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా - రూ.8 కోట్లు
ఓవర్సీస్ - రూ.60 కోట్లు
వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్ 218 కోట్లు
'లియో' నాన్ థియేట్రికల్ బిజినెస్ వివరాలు చూస్తే..
మ్యూజిక్ రైట్స్ - రూ.16కోట్లు
సాటిలైట్ - రూ.80 కోట్లు
డిజిటల్ - రూ.140 కోట్లు
మొత్తం నాన్ థియేట్రికల్ బిజినెస్ రూ.236 కోట్లు
కాగా 'లియో' చిత్రానికి థియేట్రికల్ అండ్ నాన్ థియేట్రికల్ కలిపి మొత్తం రూ.454 కోట్ల బిజినెస్ జరిగింది. తలపతి విజయ్ సినిమాకి ఈ రేంజ్ లో బిజినెస్ జరగడం ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
ఇక 'లియో' విషయానికొస్తే.. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ సరసన త్రిష కథానాయికగా నటిస్తుండగా.. బాలీవుడ్ సీనియర్ యాక్టర్ సంజయ్ దత్, యాక్షన్ కింగ్ అర్జున్, తమిళ డైరెక్టర్ గౌతమ్ మీనన్, మిస్కిన్, మన్సూర్ అలీ ఖాన్, ప్రియ ఆనంద్, మలయాళ నటుడు మ్యాథ్యూ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సెవెన్ స్క్రీన్ బ్యానర్ పై ఎస్ ఎస్ లలిత్ కుమార్, జగదీష్ పళాని సామి నిర్మించారు. అక్టోబర్ 19 దసరా కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.