'సలార్' vs 'డంకీ' - ప్రభాస్‌తో పోటీలో వెనక్కి తగ్గని షారుఖ్
రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు డిసెంబర్ 22న పండగ రోజు. వై? ఎందుకు? అంటే... వాళ్ళు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న 'సలార్' విడుదల అయ్యేది ఆ రోజే కదా! ఇప్పటికి పలు వాయిదాలు పడిన ఆ సినిమా ఎట్టి పరిస్థితుల్లోనూ డిసెంబర్ 22న విడుదల కానుంది. చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ కూడా సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. డిసెంబర్ 22న 'సలార్' రావడం కాస్త రిస్క్ అనే మాటలు ట్రేడ్, డిస్ట్రిబ్యూషన్ వర్గాల్లో వినబడుతున్నాయి. ప్రభాస్ కంటే ముందు ఆ తేదీ మీద బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కర్చీఫ్ వేశారు. హిందీతో పాటు తెలుగు రాష్ట్రాలు, విదేశాల్లో అభిమానులు ఉన్న రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వంలో ఆయన హీరోగా నటిస్తున్న 'డంకీ'ని విడుదల చేయనున్నట్లు చాలా రోజుల క్రితమే అనౌన్స్ చేశారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


'గుంటూరు కారం' తర్వాత రాజమౌళి సినిమాయే - మధ్యలో మరొకటి లేదు!
సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ఏ సినిమా చేస్తున్నారు? అందరికీ తెలిసిన విషయమే గురూజీ, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వంలో 'గుంటూరు కారం' చేస్తున్నారు. ఆ సినిమా తర్వాత? ఇదీ తెలుసు! దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తారు. 'గుంటూరు కారం', రాజమౌళి సినిమాల మధ్య మరో సినిమా చేసే అవకాశం ఉందని ఈ మధ్య ఫిల్మ్ నగర్ వర్గాల్లో బలంగా వినిపించింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


మిలాన్‌లో గోపీచంద్ వర్క్ ఫినిష్ - కావ్యా థాపర్‌తో పాట కూడా!
మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. ఇందులో కావ్యా థాపర్ హీరోయిన్. హీరోగా గోపీచంద్ 32వ చిత్రమిది. అందుకని, వర్కింగ్ టైటిల్‌గా #Gopichand32 అని పెట్టారు. చిత్రాలయం స్టూడియోస్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 1గా వేణు దోనెపూడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అగ్ర హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్స్ తీసిన శ్రీను వైట్ల... కొంత విరామం తర్వాత దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. కొన్ని రోజుల క్రితం షూటింగ్ కోసం టీమ్ ఇటలీ వెళ్ళింది. ఆ షెడ్యూల్ ముగిసింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


బోయపాటి vs తమన్ - తెలివిగా తమన్‌కు ఓటేసిన అనిల్ రావిపూడి
దర్శకుడు బోయపాటి శ్రీను, సంగీత దర్శకుడు తమన్ మధ్య సఖ్యత లేదని 'స్కంద' విడుదల తర్వాత జరిగిన పరిణామాలు చూస్తే అర్థం అవుతోంది. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో 'స్కంద' నేపథ్య సంగీతం విషయంలో చాలా మంది తనకు కంప్లైంట్స్ చేశారని బోయపాటి శ్రీను తెలిపారు. తమన్ నేపథ్య సంగీతం లేకుండా చూసినా 'అఖండ' శక్తివంతంగా ఉంటుందని ఆయన చెప్పారు. 'స్కంద' విడుదలైన తర్వాత నుంచి తమన్‌తో తాను మాట్లాడలేదని చెప్పారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


'వ్యూహం' ట్రైలర్ - చంద్రబాబు, పవన్‌నే కాదు.. తాజా ‘స్కిల్’ స్కామ్‌నూ వదలని ఆర్జీవీ!
రాంగోపాల్ వర్మ 'వ్యూహం' ట్రైలర్ తాజాగా విడుదలైంది. వైఎస్ జగన్ పాదయాత్ర నుంచి మొదలుకొని రాజకీయాల్లో ఆయన ఎదుర్కొన్న పరిణామాలు అన్నిటిని ఈ ట్రైలర్లో చూపించారు. దాంతోపాటు రీసెంట్ గా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు అయిన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ గురించి కూడా ట్రైలర్లో ప్రస్తావించడం అందరినీ షాక్ కి కూడా చేసింది. తాజాగా విడుదలైన ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. టాలీవుడ్ లో సెన్సేషనల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న రాంగోపాల్ వర్మ ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయోపిక్ గా 'వ్యూహం' సినిమాని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)