రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) అభిమానులకు డిసెంబర్ 22న పండగ రోజు. వై? ఎందుకు? అంటే... వాళ్ళు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న 'సలార్' (Salaar Release Day)విడుదల అయ్యేది ఆ రోజే కదా! ఇప్పటికి పలు వాయిదాలు పడిన ఆ సినిమా ఎట్టి పరిస్థితుల్లోనూ డిసెంబర్ 22న విడుదల కానుంది. చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ కూడా సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది.


జోరు మీదున్న షారుఖ్ 'డంకీ'తో పోటీ!
డిసెంబర్ 22న 'సలార్' రావడం కాస్త రిస్క్ అనే మాటలు ట్రేడ్, డిస్ట్రిబ్యూషన్ వర్గాల్లో వినబడుతున్నాయి. ప్రభాస్ కంటే ముందు ఆ తేదీ మీద బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) కర్చీఫ్ వేశారు. హిందీతో పాటు తెలుగు రాష్ట్రాలు, విదేశాల్లో అభిమానులు ఉన్న రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వంలో ఆయన హీరోగా నటిస్తున్న 'డంకీ'ని విడుదల చేయనున్నట్లు చాలా రోజుల క్రితమే అనౌన్స్ చేశారు. 


Also Read : 'గుంటూరు కారం' తర్వాత రాజమౌళి సినిమాయే - మధ్యలో మరొకటి లేదు!


'పఠాన్', 'జవాన్'... బాక్సాఫీస్ బరిలో ఈ ఏడాది షారుఖ్ ఖాన్ నుంచి రెండు భారీ విజయాలు నమోదు చేశారు. హిందీ మార్కెట్ వరకు చూస్తే సరికొత్త రికార్డులు క్రియేట్ చేశారు. అటువంటి షారుఖ్ సినిమాతో పోటీ అంటే ప్రభాస్ 'సలార్' వసూళ్ల మీద ప్రభావం ఉంటుందని కొందరు అంచనా వేస్తున్నారు. ఉన్నట్టుండి ఈ రోజు కొత్తగా మరో న్యూస్ వచ్చింది. షారుఖ్ 'డంకీ' వాయిదా పడుతుందని! అది ప్రభాస్ అభిమానులకు సంతోషాన్ని ఇచ్చింది. అయితే... అందులో నిజం లేదు!


షారుఖ్ 'డంకీ' వాయిదా పడలేదు!
'డంకీ' సినిమా విడుదల వాయిదా పడిందని వచ్చిన వార్తల్లో నిజం లేదని ప్రముఖ బాలీవుడ్ ట్రేడ్ ఎనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. ముందుగా వెల్లడించినట్లు డిసెంబర్ 22న థియేటర్లలోకి వస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రభాస్ 'సలార్' విడుదల కారణంగా వెంకటేష్ 'సైంధవ్' సంక్రాంతికి, నితిన్ 'ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్' డిసెంబర్ తొలి వారానికి షిఫ్ట్ అయ్యాయి. నాని 'హాయ్ నాన్న' కూడా డిసెంబర్ తొలి వారంలో వచ్చే అవకాశాలు ఉన్నాయని టాక్.      


Also Read 'గాడ్' రివ్యూ : హీరోని సైకో కిల్లర్ టార్గెట్ చేస్తే? - 'జయం' రవి, నయనతార సినిమా హిట్టా? ఫట్టా?






'కెజియఫ్', 'కెజియఫ్ 2' చిత్రాల తర్వాత ప్రశాంత్ నీల్ (Prashanth Neel) డైరెక్ట్ చేస్తున్న సినిమా 'సలార్'. దీనినీ 'కెజియఫ్' తరహాలో రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. విజయ్ కిరగందూర్ నిర్మాత. ఇందులో ప్రభాస్ జోడీగా కమల్ హాసన్ కుమారై, ప్రముఖ కథానాయిక శృతి హాసన్ నటిస్తున్నారు. జర్నలిస్ట్ ఆద్య పాత్రను ఆమె పోషిస్తున్నారు. ప్రభాస్, శృతి హాసన్ జంటగా నటిస్తున్న మొదటి చిత్రమిది. ఈ సినిమాలో ప్రభాస్ తల్లిగా ఈశ్వరీ రావు నటిస్తున్నారు.



వరదరాజ మన్నార్ పాత్రలో మలయాళ కథానాయకుడు పృథ్వీరాజ్ సుకుమారన్, రాజ మన్నార్ పాత్రలో సీనియర్ తెలుగు నటుడు జగపతి బాబు, ఇతర పాత్రల్లో 'పొగరు' ఫేమ్ శ్రియా రెడ్డి, కన్నడ నటుడు మధు గురుస్వామి నటిస్తున్నారు. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. భువన గౌడ సినిమాటోగ్రాఫర్, ఉజ్వల్ కులకర్ణి ఎడిటర్.  


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial