గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'భగవంత్ కేసరి' (Bhagavanth Kesari Movie). బ్రో ఐ డోంట్ కేర్... అనేది ఉప శీర్షిక. విజయ దశమి కానుకగా అక్టోబర్ 19న థియేటర్లలో విడుదల కానుంది. ఆల్రెడీ రిలీజైన ట్రైలర్ చూస్తే.... రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదని అర్థం అవుతోంది. బాలకృష్ణ, అనిల్ రావిపూడి కలిసి డిఫరెంట్ అటెంప్ట్ చేశారు. అయితే... ఇక్కడో ట్విస్ట్ ఉంది! అది ఏమిటంటే?

Continues below advertisement


వారం తర్వాతే బాలయ్య, కాజల్ పాట!
'భగవంత్ కేసరి' సినిమాలో బాలకృష్ణకు జోడీగా కాజల్ అగర్వాల్ నటించిన సంగతి తెలిసిన విషయమే. వాళ్ళిద్దరి మీద ఒక డ్యూయెట్ తెరకెక్కించారు. అయితే... ఆ పాట అక్టోబర్ 19న విడుదల అవుతున్న సినిమాలో ఉండటం లేదు. కథకు అడ్డు తగులుతుందని భావించిన దర్శక, నిర్మాతలు ఆ పాటను తీసేశారు. థియేటర్లలో వారం పాటు నిజాయతీగా తాము చెప్పాలనుకున్న కథను చెప్పాలని డిసైడ్ అయ్యారు. కథ సాంగ్స్ డిమాండ్ చేయలేదని అనిల్ రావిపూడి చెప్పారు. 


అక్టోబర్ 24 నుంచి... అనగా విడుదలైన వారం తర్వాత బాలకృష్ణ, కాజల్ సాంగ్ యాడ్ చేస్తామని తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు అనిల్ రావిపూడి పేర్కొన్నారు. నందమూరి అభిమానులకు దసరా బొనాంజా ఉంటుందని ఆయన చెప్పారు. 


ఆల్రెడీ విడుదలైన 'భగవంత్ కేసరి' ట్రైలర్ చూస్తే... బాలకృష్ణ  ఆయనకు బిడ్డగా శ్రీ లీల మధ్య బాండింగ్ చూపించారు. అయితే... సినిమాలో ఉన్న అంశాలు అన్నీ అందులో చూపించలేదని, అసలు కథతో పాటు అందరికీ షాక్ ఇచ్చే ట్విస్ట్ ఒకటి దాచారని సమాచారం. ట్రైలర్ చివరలో బాలకృష్ణ సాంగ్ పాడటం, ఆ తర్వాత ఆయన ఇచ్చే పంచ్ హైలైట్ అయ్యింది. ఫన్ క్రియేట్ చేసే పంచ్ డైలాగ్స్ కొన్ని ఉన్నప్పటికీ... బాలకృష్ణకు అనిల్ రావిపూడి రాసిన మార్క్ కామెడీ ఫైట్స్ కూడా హైలైట్ అవుతుందట.  


Also Read : 'గాడ్' రివ్యూ : హీరోని సైకో కిల్లర్ టార్గెట్ చేస్తే? - 'జయం' రవి, నయనతార సినిమా హిట్టా? ఫట్టా?


ఈ సినిమాలో గిరిజన హక్కుల కోసం పోరాటం చేసే సామాజిక కార్యకర్తగా బాలకృష్ణ కనిపించనున్నారని సమాచారం. ట్రైలర్లో ఆ యాంగిల్ టచ్ చేయలేదు. ఆయన పాత్ర కూడా గిరిజనులలో ఒకరిగా ఉంటుందట. సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలను సైతం దర్శకుడు అనిల్ రావిపూడి సినిమాలో ప్రస్తావించారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇప్పటి వరకు ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలు ఓ లెక్క... ఇప్పుడీ 'భగవంత్ కేసరి'ది మరో లెక్క అనే విధంగా సినిమా ఉంటుందట! కామెడీ కంటే కంటెంట్ ఎక్కువ హైలైట్ అవుతుందని ఫిల్మ్ నగర్ వర్గాల ఖబర్.


Also Read : 'ఫ్యామిలీ స్టార్'గా విజయ్ దేవరకొండ - దసరాకు టీజర్ రిలీజ్, అదీ ఎప్పుడంటే?


'భగవంత్ కేసరి' చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ పతాకంపై హరీష్ పెద్ది, సాహు గారపాటి భారీ నిర్మాణ వ్యయంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన తెలుగు తెర చందమామ కాజల్ అగర్వాల్ నటించారు. యువ కథానాయిక శ్రీ లీల ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. నటుడు శరత్ కుమార్ కీలక పాత్ర చేశారు. బాలకృష్ణకు ఆయనది సోదరుడి పాత్ర అని టాక్. నార్త్ ఇండియన్ బ్యూటీ పాలక్ లల్వానీకి కీలక పాత్రలో నటించే అవకాశం దక్కింది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ విలన్ రోల్‌ చేశారు.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial