'ది' విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) కథానాయకుడిగా ప్రముఖ నిర్మాత 'దిల్' రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థలో ఓ కుటుంబ కథా చిత్రం రూపొందుతోంది. అందులో 'సీతా రామం' ఫేమ్ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) కథానాయిక. మరో నాయికగా 'మజిలీ', 'రామారావు ఆన్ డ్యూటీ', 'మైఖేల్' సినిమాల ఫేమ్ దివ్యాంశ కౌశిక్ నటిస్తున్నారు. విజయ్ దేవరకొండతో 'గీత గోవిందం' వంటి బ్లాక్ బస్టర్ సినిమా తీసిన పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... ఈ సినిమా టైటిల్ ఖరారు చేశారట!


'ఫ్యామిలీ స్టార్'గా విజయ్ దేవరకొండ!
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ సినిమాకు 'ఫ్యామిలీ స్టార్' టైటిల్ ఖరారు చేసినట్లు తెలిసింది. విజయ దశమి కానుకగా ఈ నెల 18న సినిమా టీజర్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేశారు. అప్పుడు టైటిల్ అనౌన్స్ చేయనున్నారు. దసరాకు విడుదలయ్యే సినిమాలతో పాటు థియేటర్లలో టీజర్ ప్రదర్శించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. సంక్రాంతికి సినిమాను విడుదల చేయనున్నారు.


Also Read 'కన్నప్ప'లో కన్నడ సూపర్ స్టార్ - సినిమా రేంజ్ పెంచేస్తున్న విష్ణు మంచు!  


నాలుగు నెలల వ్యవధిలో రెండు సినిమాలు
సెప్టెంబర్ 1న 'ఖుషి' విడుదల అయ్యింది. అది విడుదలైన నాలుగు నెలలకు మరో సినిమాతో సంకాంతికి థియేటర్లలో విజయ్ దేవరకొండ సందడి చేయనున్నారు. ఈ విజయ దశమికి 'ఫ్యామిలీ స్టార్' విడుదల తేదీ అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది. 
ప్రస్తుతానికి మహేష్ బాబు 'గుంటూరు కారం', ప్రభాస్ 'ప్రాజెక్ట్ కె', రవితేజ 'ఈగల్', తేజా సజ్జ 'హను - మాన్' కూడా సంక్రాంతి రేసులో ఉన్నాయి. ఇటీవల వెంకటేష్ 'సైంధవ్'ను కూడా సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. మరి, ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.  


అమెరికాలో VD13 Movie చిత్రీకరణ!
విజయ్ దేవరకొండ, పరశురామ్ కలయికలో సినిమా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థలో 54వ సినిమా. హీరోకి 13వది. ఈ సినిమా కోసం 'దిల్' రాజు, దర్శకుడు పరశురామ్, చిత్ర బృందంలో కీలక సభ్యలు కొందరు కొన్ని రోజుల క్రితం అమెరికా వెళ్లారు. అక్కడ లొకేషన్స్ రెక్కీ చేశారు. కథలో కీలక సన్నివేశాలను అక్కడ చిత్రీకరించడానికి ప్లాన్ చేశారు. త్వరలో యూనిట్ అంతా అమెరికా వెళ్లనున్నారు. అమెరికా షెడ్యూల్ మినహా షూటింగ్ అంతా కంప్లీట్ అయ్యిందట!


Also Read ఫ్లైట్‌లో హీరోయిన్‌ను వేధించిన పాసింజర్ - ఎయిర్ హోస్టెస్‌కి కంప్లైంట్ చేస్తే అలా చేస్తారా?


దర్శకుడు పరశురామ్ తీసిన చివరి మూడు సినిమాలు చూస్తే... హీరో ఒరిజినల్ పేరును సినిమాలో క్యారెక్టర్ పేరుగా ఫిక్స్ చేశారు. 'సర్కారు వారి పాట'లో మహేష్ బాబు పేరు మహి అలియాస్ మహేష్. 'గీత గోవిందం'లో విజయ్ గోవింద్ పాత్రలో విజయ్ దేవరకొండను చూపించారు. 'శ్రీరస్తు శుభమస్తు'లో అల్లు శిరీష్ పేరు శిరి అలియాస్ శిరీష్. 'ఫ్యామిలీ స్టార్'కు వస్తే విజయ్ దేవరకొండను కుటుంబ రావుగా చూపించబోతున్నారని టాక్. కుటుంబ నేపథ్యంలో సినిమా కనుక 'ఫ్యామిలీ స్టార్' టైటిల్ ఖరారు చేశారట. ఇది కాకుండా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో కూడా విజయ్ దేవరకొండ ఓ సినిమా చేస్తున్నారు. 'రాజావారు రాణిగారు' ఫేమ్ రవికిరణ్ కోలా దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు. దానిని కూడా 'దిల్' రాజు నిర్మిస్తారు. 


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial