యువ కథానాయకుడు, డైనమిక్ స్టార్ విష్ణు మంచు (Vishnu Manchu) టైటిల్ పాత్రలో రూపొందుతున్న మైథాలజీ మూవీ 'కన్నప్ప' (Kannappa Movie). ఎ ట్రూ ఎపిక్ ఇండియన్ టేల్... అనేది ఉప శీర్షిక. విష్ణుతో పాటు వివిధ భాషలకు చెందిన సూపర్ స్టార్లు ఈ సినిమాలో నటించనున్నారు. 


పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్, సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార 'కన్నప్ప'లో నటించనున్నారు. శివ పార్వతులుగా వాళ్ళు కనిపించనున్నారు. అయితే... విష్ణు నోటి నుంచి ఆ మాట రాలేదు. ప్రభాస్ నటిస్తున్న విషయం మాత్రమే చెప్పారు. వాళ్ళిద్దరికీ మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కూడా సినిమాలో నటిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఆయనను విష్ణు కలిశారు. ఆ ఫోటో రిలీజ్ చేశారు. వీళ్ళకు తోడు ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ కూడా నటించనున్నారు. 


'కన్నప్ప'లో శివ రాజ్ కుమార్ కూడా!
Shiva Rajkumar In Kannappa Movie : ప్రభాస్, నయనతార, మోహన్ లాలే కాదు... 'కన్నప్ప'లో ఓ కీలకమైన పాత్ర చేయడానికి కన్నడ అగ్ర కథానాయకుడు శివ రాజ్ కుమార్ సైతం అంగీకరించారు. ప్రస్తుతానికి ఆయన పాత్ర ఏమిటి? అనేది సస్పెన్స్. 


Also Read : బ్రిటీషర్ల నుంచి ఇప్పటికి రాజకీయం ఏం మారింది? సోషల్ మీడియా వినోదమే! - రానా






హిందీ చిత్రసీమలో అగ్ర హీరో హీరోయిన్లలో కొందరు కూడా 'కన్నప్ప'లో కీలక పాత్రల్లో కనిపిస్తారని సమాచారం. త్వరలో వాళ్ళ పేర్లు అనౌన్స్ చేయనున్నారు. రోజు రోజుకూ సినిమా రేంజ్ పెంచుతూ ముందుకు వెళుతున్నారు విష్ణు. కేవలం నేషనల్ మార్కెట్ మీద మాత్రమే కాదు... ఇంటర్నేషనల్ మార్కెట్స్ మీద కూడా ఆయన దృష్టి సారించారట.    


Also Read ఫ్లైట్‌లో హీరోయిన్‌ను వేధించిన పాసింజర్ - ఎయిర్ హోస్టెస్‌కి కంప్లైంట్ చేస్తే అలా చేస్తారా?



ఇంతకీ, మెయిన్ హీరోయిన్ ఎవరు?
ఇంతకీ, 'కన్నప్ప'లో విష్ణు సరసన నటించబోయే మెయిన్ హీరోయిన్ ఎవరు? అనే క్వశ్చన్ మొదలైంది. తొలుత ఈ సినిమాలో నాయికగా నుపుర్ సనన్ (Nupur Sanon) నటించనున్నట్లు తెలిపారు. శ్రీకాళహస్తిలో జరిగిన పూజా కార్యక్రమాలకు ఆమె హాజరయ్యారు కూడా! అయితే... డేట్స్ అడ్జస్ట్ కాని కారణంగా నుపుర్ సనన్ సినిమా చేయడం లేదని విష్ణు మంచు ట్వీట్ చేశారు. త్వరలో కథానాయికను ఎంపిక చేయాల్సి ఉంది. 


అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై లెజెండరీ నటుడు, కలెక్షన్ కింగ్, విష్ణు తండ్రి మంచు మోహన్ బాబు (Mohan Babu) ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. స్టార్ ప్లస్ టీవీలో మహాభారత సిరీస్ తీసిన ముఖేష్ కుమార్ సింగ్ 'కన్నప్ప'కు దర్శకుడు. సుమారు రూ. 150 కోట్ల నిర్మాణ వ్యయంతో సినిమా రూపొందనుంది. లెజెండరీ రచయితలు పరుచూరి గోపాల కృష్ణ, బుర్రా సాయి మాధవ్, తోట ప్రసాద్ కథకు హంగులు అద్దారు. ఈ చిత్రానికి మణిశర్మ, స్టీఫెన్ దేవాసి సంగీతం అందించనున్నారు.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial