'పుష్ప' సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్​గా గుర్తింపు తెచ్చుకున్న నేషనల్ క్రష్ రష్మిక మందన ప్రస్తుతం అగ్ర హీరోలతోనే సినిమాలు చేస్తోంది. టాలీవుడ్​లో అల్లు అర్జున్ సరసన 'పుష్ప 2' బాలీవుడ్​లో రణబీర్ కపూర్ 'యానిమల్' సినిమాలతో బిజీగా ఉంది. వీటితోపాటు సౌత్ లో ఓ లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్ట్​లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే పాన్ ఇండియా ఇమేజ్ అందుకున్న తర్వాత మొదటిసారి ఓ మీడియం రేంజ్ హీరోతో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట ఈ ముద్దుగుమ్మ. ఇంతకీ ఆ మీడియం రేంజ్ హీరో ఎవరు? ఆ ప్రాజెక్టు ఏంటి? డీటెయిల్స్​లోకి వెళ్తే.. ప్రస్తుతం టాలీవుడ్​లో రష్మిక నటిస్తున్న 'పుష్ప2' షూటింగ్ దశలో ఉంది.


దీంతోపాటు రణబీర్ కపూర్​కి జోడిగా నటించిన 'యానిమల్' విడుదలకు సిద్ధమవుతుండగా తాజాగా బాలీవుడ్ లో మరో క్రేజీ ప్రాజెక్టుకు రష్మిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం బాలీవుడ్ లో మీడియం రేంజ్ హీరోగా ఉన్న విక్కీ కౌశల్ సరసన రష్మిక నటిస్తోందట. 'ఉరి' మూవీతో బాలీవుడ్​లో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న విక్కీ కౌశల్ ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంటూ వస్తున్నాడు. రీసెంట్ గానే సారా అలీ ఖాన్​తో కలిసి 'జర హట్కే జర బచ్కే' మూవీతో సూపర్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం విక్కీ కౌశల్ హీరోగా సుమారు రూ.150 కోట్ల భారీ బడ్జెట్​తో ఓ పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ మూవీ తెరకెక్కనుంది.


'చావా ది గ్రేట్ వారియర్' అనే టైటిల్ తో ఈ మూవీని సిల్వర్ స్క్రీన్​పై ప్రజెంట్ చేయబోతున్నారు. విక్కీ కౌశల్ కెరియర్​లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం జయసింగ్ రావు రాసిన మరాఠీ నవల ఆధారంగా రూపొందుతోంది. రాహుల్ జనార్దన్ యాదవ్ ఈ పిరియాడికల్ బ్యాక్ డ్రాప్ మూవీ ని డైరెక్ట్ చేస్తున్నారు. ఇదే సినిమాలో ఫిమేల్ లీడ్​గా రష్మిక మందన నటిస్తున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ లో ఇప్పటికే రష్మిక సిద్ధార్థ్ మల్హోత్రాతో నటించగా ప్రస్తుతం రణబీర్ కపూర్ తో నటించిన 'యానిమల్' త్వరలోనే రిలీజ్ కాబోతోంది. ఇక ఇప్పుడు విక్కీ కౌశల్ తో నటించబోతోంది. నిజానికి రష్మిక కి ఉన్న క్రేజ్ దృష్ట్యా బాలీవుడ్ లో విక్కీ కౌశల్ లాంటి మీడియం రేంజ్ హీరోతో నటించేందుకు ఈ ముద్దుగుమ్మ ఒప్పుకోవడం విశేషం అని చెప్పాలి.


పిరియాడికల్ మూవీ కాబట్టి తన పాత్రకు ప్రాముఖ్యత ఉండటంతో రష్మిక నటించేందుకు ఓకే చెప్పిందని అంటున్నారు. ఒకవేళ రష్మిక నటించిన 'యానిమల్' సూపర్ హిట్ అయితే బాలీవుడ్ లో ఈ ముద్దుగుమ్మకి మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. 'యానిమల్' మూవీని డైరెక్ట్ చేసిన సందీప్ రెడ్డి వంగా హిందీలో తెరకెక్కించిన 'కబీర్ సింగ్' మూవీ తర్వాతే కియర్ అద్వానీ స్టార్ హీరోయిన్ అయింది. ఇప్పుడు 'యానిమల్' తో సందీప్ రెడ్డి రష్మిక ని బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ చేస్తాడేమో చూడాలి. కాగా విక్కీ కౌశల్​తో రష్మిక మందన నటించబోయే చిత్రం వచ్చే ఏడాది సెట్స్ కి వెళ్లనున్నట్లు సమాచారం.


Also Read : ప్రభాస్ దెబ్బకి వెనక్కి తగ్గిన షారుఖ్, ఆగిపోయిన 'డంకీ' - సోలోగా వస్తోన్న 'సలార్'!




Join Us on Telegram: https://t.me/abpdesamofficial