బాలీవుడ్ అగ్ర హీరో షారుఖ్ ఖాన్ ఈ ఏడాది డిసెంబర్​లో ప్రభాస్​తో పోటీ పడబోతున్న విషయం తెలిసిందే. డిసెంబర్ 22న షారుఖ్ నటిస్తున్న 'డంకీ' సినిమా ప్రభాస్ 'సలార్' రెండు బాక్స్ ఆఫీస్ బరిలో నిలవనున్నాయి. దీంతో గత కొద్ది రోజులుగా ఈ రెండు సినిమాల గురించి సోషల్ మీడియాలో ఓ రేంజ్​లో డిస్కషన్ నడుస్తోంది. ఈ క్రమంలోనే షారుక్, ప్రభాస్ ఫ్యాన్స్ మధ్య వార్ కూడా నడిచింది. సలార్​తో పోటీ పెడితే షారుఖ్ ఖాన్ సినిమాకి నష్టం కలుగుతుందని పలువురు సినీ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో భారీ క్రేజ్ నెలకొన్న సినిమాల్లో ఒకటిగా 'సలార్' రిలీజ్ కాబోతోంది.


బడ్జెట్, బిజినెస్ దృష్ట్యా 'సలార్', 'డంకీ' సినిమాలు ఒకేసారి రిలీజ్ అయితే రెండు సినిమాలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ట్రేడ్ వర్గాలు సైతం చెబుతూ వచ్చాయి. దక్షిణాదిలో 'సలార్'పై ఉన్న హైప్​కి 'డంకీ' నిలవడం కష్టమే అని, బాలీవుడ్​లో 'డంకీ' మూవీకి థియేటర్స్ ఎక్కువగా దొరికే అవకాశం ఉండడంతో 'సలార్' కి డ్యామేజ్ జరిగే అవకాశం ఉందంటూ వార్తలు వచ్చాయి. కానీ తాజా సమాచారం ప్రకారం డిసెంబర్ 22 రేసు నుంచి షారుక్ 'డంకీ' తప్పుకున్నట్లు తెలుస్తోంది. దాంతో ప్రభాస్ 'సలార్' బాక్సాఫీస్ బరిలో సోలోగా నిలిచి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 'సలార్'కు పోటీగా రిలీజ్ కాబోతున్న షారుఖ్ ఖాన్ 'డంకీ' పోస్ట్ ఫోన్ కానున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.


త్వరలోనే 'డంకీ' పోస్ట్ పోన్ పై ఆఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. 'డంకీ' పోస్ట్ పోన్ కు కొన్ని కారణాలు కూడా వినిపిస్తున్నాయి. డిసెంబర్ 22లోగా  ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ పనులు, విఎఫ్ఎక్స్ పనులు కంప్లీట్ అవ్వడం అనుమానమేనని, అందుకే ఈ సినిమాను పోస్ట్ పోన్ చేయాలనే ఆలోచనలో సినిమా యూనిట్ ఉన్నట్లు చెబుతున్నారు. ఈ మేరకు డిసెంబర్ 22న కాకుండా వచ్చే ఏడాది ఆరంభంలో షారుక్ 'డంకీ' మూవీని రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే కనుక జరిగితే 'డంకి' పోస్ట్ పోన్ 'సలార్' కి బాగా కలిసి వచ్చే అంశం.


డిసెంబర్ 22న సోలో రిలీజ్ తో 'సలార్' బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లు అందుకునే అవకాశం ఉంది. ఇప్పటికే సెప్టెంబర్ 28 నుంచి డిసెంబర్ 22 కు 'సలార్' పోస్ట్ పోన్ అవడంతో ఆ సమయానికి రిలీజ్ కావలసిన తెలుగు సినిమాలు ' 'సైంధవ', 'హాయ్ నాన్న', 'ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్' వెనక్కి తగ్గాయి. ఇప్పుడు రేసు నుంచి 'డంకీ' కూడా వెనక్కి తగ్గబోతుండడంతో డిసెంబర్ 22 ప్రభాస్ సోలోగా బాక్స్ ఆఫీస్ బరిలో దిగబోతున్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ గ్యాంగ్ స్టర్ గా కనిపించబోతున్నాడు. దాదాపు రూ.250 కోట్ల భారీ బడ్జెట్ తో హోంబలే ఫిల్మ్స్ పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శృతిహాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో మలయాళ స్టార్ పృధ్విరాజ్ సుకుమారం విలన్ గా కనిపించనున్నారు.


Also Read : 'గాడ్' రివ్యూ : హీరోని సైకో కిల్లర్ టార్గెట్ చేస్తే? - 'జయం' రవి, నయనతార సినిమా హిట్టా? ఫట్టా?



Join Us on Telegram: https://t.me/abpdesamofficial