సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ఏ సినిమా చేస్తున్నారు? అందరికీ తెలిసిన విషయమే గురూజీ, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వంలో 'గుంటూరు కారం' చేస్తున్నారు. ఆ సినిమా తర్వాత? ఇదీ తెలుసు! దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తారు.


'గుంటూరు కారం', రాజమౌళి సినిమాల మధ్య మరో సినిమా చేసే అవకాశం ఉందని ఈ మధ్య ఫిల్మ్ నగర్ వర్గాల్లో బలంగా వినిపించింది. అందుకు కారణం 'ఏజెంట్', 'భోళా శంకర్' పరాజయాలు! అసలు వివరాల్లోకి వెళితే... 


అనిల్ సుంకరకు మాట ఇచ్చిన మహేష్?
'ఏజెంట్', 'భోళా శంకర్'... నిర్మాత అనిల్ సుంకరకు బ్యాక్ టు బ్యాక్ రెండు ఫ్లాప్స్ వచ్చాయి. వంద కోట్లకు పైగా డబ్బులు ఆవిరి అయ్యాయి. ఎంత పెద్ద నిర్మాతకు అయినా సరే రెండు వరుస పరాజయాలు, అందులోనూ వంద కోట్లు పోవడం అంటే కోలుకోవడం కష్టం. అటువంటి నిర్మాతకు మహేష్ బాబు భరోసా ఇచ్చినట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో వినిపించింది. 


మహేష్ బాబు కుటుంబానికి అనిల్ సుంకర సన్నిహితుడు. 'దూకుడు', 'సరిలేరు నీకెవ్వరు' వంటి విజయాలు అందించిన నిర్మాత. వరుస ఫ్లాప్స్ తర్వాత మంచి కథతో వస్తే సినిమా చేద్దామని అనిల్ సుంకరతో మహేష్ చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఆ సినిమాకు దర్శకుడిగా అనిల్ రావిపూడి పేరు కూడా వినిపించింది. అయితే... అటువంటిది ఏమీ లేదని దర్శకుడు క్లారిటీ ఇచ్చారు. 


మహేష్ గారు సినిమా చేయమంటే నేను రెడీ... కానీ! - అనిల్ రావిపూడి
''మహేష్ బాబు గారితో సినిమా అనేసరికి నేను షాక్ అయ్యా. నాకే తెలియదు. నాకు 'సరిలేరు నీకెవ్వరు' ద్వారా జీవితంలో మంచి మనిషితో పరిచయం అయ్యింది. ఆయన మనస్ఫూర్తిగా మాట్లాడతారు. చాలా ఓపెన్. నా పనిలో తప్పులు ఉంటే చెబుతారు. నాకు సలహాలు ఇస్తారు. ఆయనతో సినిమా అంటే చేయడానికి నేను ఎప్పుడూ రెడీ. త్రివిక్రమ్, రాజమౌళి సినిమాల మధ్యలో నేను సినిమా చేస్తున్నాని వచ్చిన మాట వాస్తవం కాదు. మహేష్ గారు రాజమౌళి గారి సినిమా కోసం రెడీ అవుతున్నారు. అందరూ అంటున్నట్లు గ్యాప్ ఉంటే... మహేష్ గారు సినిమా చేయమని అంటే... నేను రెడీ. రెండు మూడు రోజుల క్రితం మేం మాట్లాడుకున్నాం. ప్రతి పదిహేను రోజులకు ఒకసారి మేం కలుస్తాం. ఆయనతో టచ్ లో ఉంటాను. అది ప్రొఫెషనల్ రిలేషన్షిప్ కాదు. మేం మంచి సినిమా చేశాం. భవిష్యత్తులో ఇంకా మంచి సినిమా చేస్తాం'' అని చెప్పారు.     


Also Read బోయపాటి vs తమన్ - తెలివిగా తమన్‌కు ఓటేసిన అనిల్ రావిపూడి


అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన 'భగవంత్ కేసరి' విజయ దశమికి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నెల 19న విడుదల. సినిమా స్పందన చూసిన తర్వాతే తదుపరి సినిమాపై నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. చిరంజీవి, దిల్ రాజు కలయికలో సినిమా చర్చల్లో ఉన్న మాట వస్తామని అంగీకరించారు. గతంలో ఎన్టీఆర్ హీరోగా సినిమా చేయడానికి ప్రయత్నించానని ఒప్పుకొన్నారు. అయితే, కుదరలేదన్నారు. 


Also Read 'గాడ్' రివ్యూ : హీరోని సైకో కిల్లర్ టార్గెట్ చేస్తే? - 'జయం' రవి, నయనతార సినిమా హిట్టా? ఫట్టా?



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial