టాలీవుడ్ యువనిర్మాత SKN(శ్రీనివాస్ కుమార్ నాయుడు) రీసెంట్ గా 'బేబీ'(Baby) సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న విషయం తెలిసిందే. సాయి రాజేష్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఏకంగా రూ.90 కోట్ల వరకు కలెక్షన్స్​ని అందుకొని రికార్డు క్రియేట్ చేసింది. ఓ చిన్న సినిమాగా వచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేయడంతో ఈ సినిమాతో డైరెక్టర్ సాయి రాజేష్, ప్రొడ్యూసర్ SKN ఇండస్ట్రీలో మరింత పాపులర్ అయిపోయారు. 'బేబీ' సినిమా రిలీజ్​కి ముందు ప్రెస్ మీట్స్​లో తన స్పీచ్​తో ఆకట్టుకున్న SKN 'బేబీ'తో స్టార్ ప్రొడ్యూసర్స్ లిస్టులో చేరిపోయారు. దీంతో SKN నెక్స్ట్ ప్రాజెక్ట్స్​పై ఇండస్ట్రీతో పాటు సినీ లవర్స్​లోనూ మరింత ఆసక్తి నెలకొంది.


ఈ క్రమంలోనే తాజాగా నిర్మాత SKN తాను నిర్మించబోయే తదుపరి చిత్రాల అప్డేట్స్ అందించారు. తన నిర్మాణ సంస్థ మాస్ మూవీ మేకర్స్ పై ఈసారి ఏకంగా నాలుగు సినిమాలు నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా నలుగురు దర్శకులతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేశారు. తను ఎంతగానో నమ్మిన స్నేహితులతో సినిమా జర్నీ అందంగా ఉంటుందని ఈ సందర్భంగా రాస్కొచ్చారు. వీళ్లతోనే తన తదుపరి 4 సినిమాలు రూపొందించబోతున్నట్లు అనౌన్స్ చేశారు. SKN పంచుకున్న ఫోటోలో డైరెక్టర్ సాయి రాజేష్ తో పాటు 'కలర్ ఫోటో' మూవీ డైరెక్టర్ సందీప్ రాజ్ కుమార్ మరో ఇద్దరూ సుమన్ పాతూరి, రవి అనే డైరెక్టర్స్ తో సినిమా చేస్తున్నట్టు తెలిపారు.


వీరిలో 'కలర్ ఫోటో' మూవీతో సందీప్ రాజ్ డైరెక్టర్​గా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసారో తెలిసిందే. ఈ సినిమాకు ఏకంగా నేషనల్ అవార్డు రావడం విశేషం. ఆ తర్వాత రీసెంట్​గా సాయి రాజేష్ 'బేబీ'తో బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ డెలివరీ చేశాడు. మరోసారి ఇద్దరు డైరెక్టర్స్​తో SKN ఎలాంటి సినిమాలు ప్రేక్షకులకు అందించబోతున్నారనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఇంతకీ SKN నిర్మించబోయే సినిమాల్లో హీరోలు ఎవరు? బడ్జెట్ ఎంత? అనేది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే SKN తన సొంత బ్యానర్ నుంచి మరో ఇద్దరిని ఇండస్ట్రీకి దర్శకులుగా పరిచయం చేయబోతున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో రైటర్స్ గా కొనసాగుతున్న రవి, సుమన్ పాతూరితో సినిమాలు చేయబోతున్నాడు.


యంగ్ డైరెక్టర్స్ ని ప్రోత్సహిస్తూ వాళ్ల నుంచి కంటెంట్ ఉన్న కథలు మంచి అవుట్ ఫుట్ ని ప్రేక్షకులకు అందించడంలో SKN 100% సక్సెస్ అయ్యారనే చెప్పాలి. మరోవైపు SKN కి గీతా ఆర్ట్స్ సంస్థ ఎప్పుడూ సపోర్ట్ గా ఉంటుంది. గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్, యువ నిర్మాత బన్నీ వాస్ SKN నిర్మించబోయే సినిమాలను ఎప్పుడూ పర్యవేక్షిస్తూ ఉంటారు. గతంలో SKN నిర్మాతగా మారి 'టాక్సీవాలా' సినిమా నిర్మించడం వెనక అల్లు అరవింద్, బన్నీ వాస్  లాంటి నిర్మాతల ప్రోత్సాహం కూడా ఉంది. సో రాబోయే రోజుల్లో SKN నిర్మాతగా కంటెంట్ ఉన్న కథలతో ఆడియన్స్ ని మెప్పించి టాలీవుడ్ ఇండ్రస్ట్రీ లో ఉన్న అగ్ర నిర్మాత లిస్టులో చేరడం ఖాయమని చెప్పొచ్చు.


Also Read : బాలీవుడ్​లో మరో ఆఫర్ అందుకున్న రష్మిక - ఆ మీడియం రేంజ్ హీరోకి జోడిగా?





Join Us on Telegram: https://t.me/abpdesamofficial