ఫాస్ట్ 10 రివ్యూ: ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సిరీస్‌లో లేటెస్ట్ సినిమా ఎలా ఉంది?
ప్రపంచవ్యాప్తంగా యాక్షన్ మూవీ ఫ్రాంచైజీల్లో ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సిరీస్’కు మంచి క్రేజ్ ఉంది. ఫైట్ అయినా, ఛేజ్ అయినా, సినిమాలో యాక్షన్‌కు సంబంధించిన ఏ ఎలిమెంట్ అయినా అది కార్లతోనూ, రేసింగ్‌తోనూ ముడిపడి ఉండటం దీని స్పెషాలిటీ. ఈ సిరీస్‌లో 10వ సినిమా ‘ఫాస్ట్ X’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ స్టార్ కాస్టింగ్, నమ్మశక్యం కాని యాక్షన్ సీన్లు ఇందులో ఉండనున్నట్లు టీజర్, ట్రైలర్‌లను చూస్తే అర్థం అవుతుంది. మరి సినిమా ఎలా ఉండబోతుంది? (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
'అన్నీ మంచి శకునములే' రివ్యూ : 'సీతారామం' నిర్మాతలు తీసిన సినిమా - సంతోష్ శోభన్‌కు హిట్ వస్తుందా?
యువ కథానాయకుడు సంతోష్ శోభన్ (Santosh) వరుసగా సినిమాలు అయితే చేస్తున్నారు. కానీ, విజయాలు మాత్రం రావడం లేదు. మరి, నందినీ రెడ్డి దర్శకత్వంలో హీరోగా నటించిన అన్నీ మంచి శకునములే ఎలా ఉంది? ఎవడే సుబ్రమణ్యం, మహానటి, సీతా రామం సినిమాల తర్వాత స్వప్న సినిమా సంస్థ నిర్మించిన ఈ సినిమా ఎలా ఉంది? (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
జపాన్ మ్యాగజైన్ కవర్ పేజీపై RRR హీరోలు - తారక్ & చరణ్ పిక్ వైరల్!
RRR (రౌద్రం రణం రుధిరం) సంచలనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ & మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈ మాగ్నమ్ ఓపస్.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచింది. 100 ఏళ్ళ భారతీయ సినిమాకు కలగా మిగిలిపోయిన ప్రతిష్టాత్మక ఆస్కార్ పురస్కారాన్ని తెచ్చిపెట్టింది. అయితే ఇప్పుడు తాజాగా ట్రిపుల్ ఆర్ మూవీ మరో అరుదైన ఘనత సాధించింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
రజనీకాంత్ సినిమాలకు గుడ్ బై చెప్పనున్నారా? అదే సూపర్ స్టార్ లాస్ట్ మూవీనా?
సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలకు గుడ్ బై చెప్పనున్నట్లు 20 ఏళ్ళ క్రితమే ప్రకటించారు. 'బాబా' సినిమా టైంలో ఇదే తనకు చివరి చిత్రమని రజినీ ప్రకటించడం అప్పట్లో సంచలనంగా మారింది. దీనికి ఆయన నిర్మాతగా వ్యవహరించడమే కాదు, స్క్రీన్ రైటర్ గానూ వర్క్ చేసారు. అయితే భారీ అంచనాల మధ్య వచ్చిన ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ ఫలితాన్ని అందుకుంది. దీంతో మూడేళ్ళ గ్యాప్ తీసుకున్న రజినీ, మనసు మార్చుకొని మళ్ళీ కెమెరా ముందుకు వచ్చారు. 'చంద్రముఖి' సినిమాతో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వడమే కాదు..వరుసగా సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు. ఇక అప్పటి నుంచీ తలైవర్ లాస్ట్ మూవీ గురించి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. లేటెస్టుగా మరోసారి రజినీ చివరి సినిమాపై డిస్కషన్ మొదలైంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
అవును 'బ్రో' - పవన్ కళ్యాణ్, సాయి తేజ్ సినిమా టైటిల్ ఇదే! పవర్ స్టార్ లుక్ చూశారా?
మావయ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)తో కలిసి మెగా మేనల్లుడు, యువ కథానాయకుడు సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) ఓ సినిమా చేశారు. ఈ సంగతి తెలుసు. మరి, ఈ సినిమా టైటిల్ ఏంటో తెలుసా? అందులో మామ - అల్లుడు ఎలా ఉంటారో తెలుసా? ఆ ప్రశ్నలకు సమాధానం ఈ రోజు లభించింది. సినిమా టైటిల్ అనౌన్స్ చేయడంతో పాటు ఫస్ట్ లుక్ విడుదల చేశారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)