Groom Dead at Wedding: 


ఇండోర్‌లో ఘటన..


కాసేపట్లో పెళ్లి చేసుకోవాల్సిన జంట మండపంలో ఉండగానే విషం తాగారు. వరుడు చనిపోగా...వధువు పరిస్థితి విషమంగా ఉంది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగిందీ ఘటన. పెళ్లి విషయంలో తలెత్తిన వివాదం కాస్తా ఆత్మహత్య వరకూ దారి తీసింది. ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే 21 ఏళ్ల వరుడు కన్నుమూశాడు. ఈ జంట ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకోడానికి వెళ్లింది. అక్కడి వెళ్లగానే వరుడు "నేను విషం తాగాను" అని చావు కబురు చల్లగా చెప్పాడు. ఇది తెలిసి వధువు కూడా విషం తాగింది. 


"అబ్బాయి విషం తాగాడని తెలిసిన వెంటనే అమ్మాయి కూడా విషం తాగింది. కాసేపట్లోనే వరుడు చనిపోయాడు. వధువు పరిస్థితి కూడా విషమంగానే ఉంది. ప్రస్తుతానికి లైఫ్ సపోర్ట్ సిస్టమ్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు"


- పోలీసులు


కారణమేంటి..?


అసలు ఎందుకు విషం తాగారు..? ఏ విషయంలో గొడవ జరిగింది..? అన్న ప్రశ్నలకు పోలీసులు సమాధానమిచ్చారు. కొద్ది రోజులుగా తనను పెళ్లి చేసుకోవాలని ఆ అమ్మాయి, అబ్బాయిని ఇబ్బంది పెడుతోంది. పదేపదే ఒత్తిడి చేస్తోంది. అయితే...వరుడు మాత్రం అందుకు అంగీరించలేదు. కెరీర్‌పై ఫోకస్ చేయలేనని తేల్చి చెప్పాడు. రెండేళ్ల టైమ్ అడిగాడు. కానీ...ఆ అమ్మాయి అందుకు ఒప్పుకోలేదు. అంతే కాదు. పోలీసులకు కంప్లెయింట్ చేసింది. తనను మోసం చేశాడని చెప్పింది. ఈ విషయంలోనే ఇద్దరి మధ్యా వాగ్వాదం జరిగింది. మరి కొద్ది సేపట్లో పెళ్లి చేసుకుంటారనగా..విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు వరుడు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపడుతున్నట్టు పోలీసులు వెల్లడించారు. 


ఇండోర్‌లో మరో ఘటన..


ఎగ్జామ్‌లో ఫెయిల్‌ అయిన ఓ బాలిక...తల్లిదండ్రులు తిడతారేమో అన్న భయంతో సినిమా రేంజ్ డ్రామా ఆడింది. కిడ్నాప్ అయ్యానని చెప్పి ముచ్చెమటలు పట్టించింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగిందీ ఘటన. బీఏ ఫస్టియర్‌ ఎగ్జామ్స్‌లో ఫెయిల్ అయిన వెంటనే ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఇండోర్‌కి 50 కిలోమీటర్ల దూరంలోని ఉజ్జెయిన్‌కి వెళ్లింది. ఉన్నట్టుండి కూతురు కనిపించకపోయే సరికి తల్లిదండ్రులు టెన్షన్ పడ్డారు. వెంటనే పోలీస్‌ కంప్లెయింట్ ఇచ్చారు. ఆ బాలిక కోసం అన్ని చోట్లా వెతికిన పోలీసులు చివరకు కిడ్నాప్‌ కథంతా ఫేక్ అని తేల్చి చెప్పారు. ఆ అమ్మాయిని తల్లిదండ్రులకు అప్పగించారు. 


"శుక్రవారం (మే13వతేదీ) రాత్రి బాలిక తండ్రి మా దగ్గరికొచ్చాడు. కూతురు కనిపించడం లేదని కంప్లెయింట్ ఇచ్చాడు. తన కూతురు కిడ్నాప్ అయిందని చెప్పాడు. కాలేజ్ నుంచి ఇంటికి వచ్చే దారిలో ఎవరో ఎత్తుకెళ్లిపోయారని అన్నాడు. ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చిన కాసేపటికే ఇలా జరిగిందని ఫిర్యాదు చేశాడు. గుర్తు తెలియని నంబర్ నుంచి ఆ అమ్మాయి..తండ్రికి కాల్ చేసింది. ఇండోర్‌లో ఎవరో తనను కిడ్నాప్ చేశారని చెప్పింది"


- పోలీసులు


ఓ రెస్టారెంట్‌లో ఒంటరిగా అమ్మాయి కూర్చుని ఉండటాన్ని గమనించారు ఉజ్జెయిన్ పోలీసులు. వెంటనే మిస్ అయిన అమ్మాయి ఫోటోతో మ్యాచ్ చేసుకున్నారు. ఇద్దరూ ఒకటే అని కన్‌ఫమ్ చేసుకున్నారు. వెంటనే ఆ అమ్మాయిని అదుపులోకి తీసుకుని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. ఓ మహిళా పోలీస్‌తో కౌన్సిలింగ్ కూడా ఇప్పించారు. 


Also Read: Delhi Crime: విడాకులివ్వడం లేదని భార్యపై కక్ష గట్టిన భర్త, కిరాయి హంతకులతో దారుణ హత్య