ఆరు నెలల్లో అన్నీ ఫినిష్ - ఎన్నికలు సమీపిస్తున్న వేళ పవర్ స్టార్ కీలక నిర్ణయం
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. సుజిత్ దర్శకత్వంలో ‘ఓజీ’,  హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’ సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే ‘హరిహర వీరమల్లు’ సినిమా 75 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకోగా, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తొలి షెడ్యూల్ మాత్రమే పూర్తి చేసుకుంది. ‘ఓజీ’ సినిమా తొలి సెడ్యూల్ ముంబైలో రీసెంట్ గా కంప్లీట్ కాగా, రెండో షెడ్యూల్ పుణెలో కొనసాగుతోంది. మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తో కలిసి ఓ సినిమా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పవర్ స్టార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 6 నెలల్లోగా ఈ మూడు సినిమాలను కంప్లీట్ చేసుకోవాలని భావిస్తున్నారు. వచ్చే ఏడాది ఏపీలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి.  నేపథ్యంలో తను కమిట్ అయిన సినిమా షూటింగ్స్ వీలైనంత త్వరగా పూర్తి చేసుకుని, ఎన్నికలపై ఫుల్ ఫోకస్ పెట్టాలని భావిస్తున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)


పూరిని వెంటాడుతున్న ‘లైగర్’ కష్టాలు, ఫిల్మ్‌ చాంబర్‌ ముందు ఎగ్జిబిటర్ల ఆందోళన
విజయ్ దేవరకొండ హీరోగా,  పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియన్ సినిమా ‘లైగర్’. గత ఏడాది ఆగష్టు 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. మాస్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న పూరి, రౌడీ హీరోగా పేరు తెచ్చుకున్న విజయ్ కాంబోలో ఈ సినిమా రావడంతో ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. వీరిద్దరు కలిసి రూపొందించిన తొలి సినిమా సైతం ఇదే కావడంతో మంచి విజయం సాధిస్తుందని అందరూ భావించారు. కానీ, అంచనాలను తలకిందులు చేస్తూ ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఇటు ప్రొడ్యూసర్స్‌ కు, అటు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు భారీ నష్టాలు తీసుకు వచ్చింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)


తమన్నాతో డేటింగ్ పై స్పందించిన విజయ్ వర్మ, ఇంతకీ ఆయన సమాధానం ఏంటంటే?
సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు విజయ్ వర్మ. ఈ హైదరాబాదీ నటుడితో తమన్నా కొంత కాలంగా ప్రేమాయణం నడుపుతోంది. న్యూ ఇయర్(2023) సందర్భంగా గోవాలో వీరిద్దరు ముద్దులు పెట్టుకుంటున్న ఓ వీడియో బయటకు వచ్చింది. ప్రస్తుతం విజయ్ వర్మ’దహాద్’ అనే సినిమాలో నటించారు. క్రైమ్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కింది. తాజాగా ఈ సినిమా  ప్రమోషన్ లో పాల్గొన్న ఆయన, తమన్నాతో  డేటింగ్ ఊహాగానాలపై స్పందించారు.  ‘దహాద్’ టీజర్ లాంచ్ సందర్భంగా తన సహనటుడు గుల్షన్ దేవయ్య, విజయ్ వర్మను టీజ్ చేశారు. స్టేజి మీదే తమన్నాతో ప్రేమాయణం గురించి అడగడంతో విజయ్ సిగ్గు పడ్డారు. తాజా ఇంటర్వ్యూలోనూ విజయ్ సమాధానం చెప్పకుండా కేవలం సిగ్గుతో ఔననే ఆన్సర్ ఇచ్చారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)


'కస్టడీ' సినిమా రివ్యూ : నాగ చైతన్య సక్సెస్ కొట్టారా? డిజప్పాయింట్ చేశాడా?
తమిళ దర్శకుడు వెంకట్ ప్రభుది సపరేట్ స్టైల్! టేకింగ్, స్క్రీన్ ప్లేతో మేజిక్ చేస్తూ... మెస్మరైజింగ్ సినిమాలు చేశారు. అక్కినేని నాగ చైతన్య కథానాయకుడిగా ఆయన దర్శకత్వంలో రూపొందిన సినిమా 'కస్టడీ'. ఇందులో అరవింద్ స్వామి విలన్ రోల్ చేశారు. కృతి శెట్టి కథానాయికగా నటించారు. కానీ ఈ సినిమాలో థ్రిల్ మిస్ అయింది. (పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)


ఛత్రపతి రివ్యూ: బెల్లంకొండ ‘ఛత్రపతి’ రీమేక్ ఎలా ఉంది? న్యాయం చేశారా? చెడగొట్టారా?
2005లో వచ్చిన ‘ఛత్రపతి’ ప్రభాస్‌ను స్టార్ హీరోను చేసింది. ప్రస్తుతం మనదేశంలో హీరోలని మించిన స్టార్ అయిన డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ‘అల్లుడు శీను’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ యాక్షన్ సినిమాలతో హిందీ ఆడియన్స్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. దీంతో బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ ఎంట్రీకి ‘ఛత్రపతి’ రీమేక్‌ను ఎంచుకున్నారు. మాస్ సినిమాలు తీయడంలో సిద్ధహస్తుడైన వి.వి.వినాయక్‌కు దర్శకత్వ బాధ్యతలు అందించారు. కానీ సినిమా మాత్రం ప్రేక్షకులను నిరాశ పరిచింది. (పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)