'విక్రమార్కుడు 2' స్క్రిప్ట్ రెడీగా ఉంది, కానీ అసలు సమస్య ఆయనతోనే - సీక్వెల్ పై నిర్మాత క్లారిటీ
మాస్ మహారాజా రవితేజ - రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన 'విక్రమార్కుడు' సినిమా అప్పట్లో ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హీరోగా రవితేజ క్రేజ్ ని, దర్శకుడిగా రాజమౌళి స్థాయిని పెంచిన సినిమా ఇది. రవితేజ ఆల్ టైం ఫేవరెట్ మూవీస్ లో 'విక్రమార్కుడు' ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే చాలా సందర్భాల్లో చెప్పారు. 2006లో విడుదలైన ఈ సినిమా ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది. ముఖ్యంగా సినిమాలో రవితేజ రెండు డిఫరెంట్ రోల్స్ లో నటించి అదరగొట్టేసారు. ఆ రెండు పాత్రలను రాజమౌళి నెక్స్ట్ లెవెల్ లో ఆవిష్కరించారు. కాగా ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని గత కొన్నేళ్లుగా ప్రచారం జరుగుతూ వస్తోంది. ఎట్టకేలకు నిర్మాత కేకే రాధా మోహన్ 'విక్రమార్కుడు' సీక్వెల్ పై స్పందించారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
వింత వ్యాధితో బాధపడుతున్న సుహాస్, ముఖాలు గుర్తుపట్టలేడట - ఇంట్రెస్టింగ్‌గా ‘ప్రసన్నవదనం’ టీజర్
తెలుగు సినిమా పరిశ్రమలో నటుడు సుహాజ్ వరుస సినిమాలో సక్సెస్ ఫుల్ గా కెరీర్ కొనసాగిస్తున్నాడు. షార్ట్ ఫిలిమ్స్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిన సుహాస్, ఇప్పుడు హీరోగా ఫుల్ బిజీ అయ్యాడు. ‘కలర్ ఫొటో’, ‘రైటర్ పద్మభూషణ్’, ‘హిట్ 2’, ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ లాంటి సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. సరికొత్త కథలతో వరుస హిట్స్ అందుకుంటున్నాడు. రీసెంట్ గా ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండ్’ మూవీతో చక్కటి విజయాన్ని అందుకున్నాడు. ఇప్పుడు ‘ప్రసన్న వదనం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
బంపర్ ఆఫర్ + అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి = వెయ్ దరువెయ్ : సాయిరామ్ శంకర్
పూరి జగన్నాథ్ తమ్ముడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన నటుడు సాయి రామ్ శంకర్ (Sairam Shankar). తొలుత 'ఇడియట్'లో చిన్న క్యారెక్టర్ చేశారు. ఆ తర్వాత '143'తో హీరోగా పరిచయం అయ్యారు. 'బంపర్ ఆఫర్'తో మరో విజయం అందుకున్నారు. కరోనా వల్ల ప్రతి ఒక్కరి సినిమాలు ఆలస్యం అయ్యాయి. కొంత విరామం తర్వాత 'వెయ్ దరువెయ్'తో హీరోగా మళ్లీ ప్రేక్షకుల ముందుకు సాయి రామ్ శంకర్ వస్తున్నారు. ఈ సినిమా మార్చి 15న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ప్రముఖ దర్శకులు హరీష్ శంకర్, కామారెడ్డి ఎమ్మెల్యే కేవీ రమణారెడ్డి ట్రైలర్ విడుదల చేశారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
నేను హీరోయిన్ కావడం శ్రీదేవికి ఇష్టం లేదు, రజనీకాంత్ సినిమాలు తిరస్కరించా: సుహాసిని
తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని నటీమణి సుహాసిని మణిరత్నం. విశ్వ నటుడు కమల్ హాసన్ అన్న కూతురిగా సినిమా పరిశ్రమలో అడుగు పెట్టటారు. స్టార్ కిడ్ గానే సుహాసిని సినిమాలు చేశారు. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఎన్నో అద్భుత చిత్రాల్లో నటించారు. 1980,90లలో దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తున్నారు. అప్పటికీ, ఇప్పటికీ చెక్కు చెదరని అందం, అభినయంతో ప్రేక్షకులను అద్భుతంగా అలరిస్తున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
మా అత్తమ్మే నాకు స్ఫూర్తి - ఉపాసన ఆసక్తికర వ్యాఖ్యలు
మెగా కోడలు ఉపాసన తాజాగా తన అత్తమ్మ, రామ్ చరణ్ తల్లి సురేఖపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ అవార్డు ఫంక్షన్‌లో పాల్గొన్న సందర్భంగా ఉపాసన మాట్లాడుతూ.. తన అత్తమ్మే తనకు స్ఫూర్తి అని అన్నారు. కాగా రేపు మహిళా దినోత్సవం సందర్భంగా నాలెడ్జ్ సిటీలోని టి-హబ్‌లో ట్రంప్ ఆఫ్ టాలెంట్ హౌజ్ ఆఫ్ మేకప్ ఆధ్వర్యంలో వివిధ రంగాలలో రాణించిన మహిళలకు విమెన్ ఆఫ్ ఇంపాక్ట్ పేరుతో సదరు సంస్థ అవార్డుల ప్రదానం చేసింది. బుధవారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమానికి ఉపాసనకు ప్రత్యేక ఆహ్వానం అందింది. ఈ సందర్భంగా ఉపాసన మాట్లాడుతూ.. మహిళలు కుటుంబాన్ని చాలా ప్రభావితం చేస్తారని, కుటుంబ మనుగడలో వీరి పాత్ర చాలా కీలకమని పేర్కొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ముఖ్యంగా ఇక్కుడున్న ధైర్యమైన, దృఢమైన మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపేందుకే నేను ఈ కార్యక్రమానికి వచ్చానన్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)