Upasana Comments on Surekha: మెగా కోడలు ఉపాసన తాజాగా తన అత్తమ్మ, రామ్‌ చరణ్‌ తల్లి సురేఖపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ అవార్డు ఫంక్షన్‌లో పాల్గొన్న సందర్భంగా ఉపాసన మాట్లాడుతూ.. తన అత్తమ్మే తనకు స్ఫూర్తి అని అన్నారు. కాగా రేపు మహిళా దినోత్సవం సందర్భంగా నాలెడ్జ్‌ సిటీలోని టి-హబ్‌లో ట్రంప్‌ ఆఫ్‌ టాలెంట్‌ హౌజ్‌ ఆఫ్‌ మేకప్‌ ఆధ్వర్యంలో వివిధ రంగాలలో రాణించిన మహిళలకు విమెన్‌ ఆఫ్‌ ఇంపాక్ట్‌ పేరుతో సదరు సంస్థ అవార్డుల ప్రదానం చేసింది. బుధవారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమానికి ఉపాసనకు ప్రత్యేక ఆహ్వానం అందింది. ఈ సందర్భంగా ఉపాసన మాట్లాడుతూ.. మహిళలు కుటుంబాన్ని చాలా ప్రభావితం చేస్తారని, కుటుంబ మనుగడలో వీరి పాత్ర చాలా కీలకమని పేర్కొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ముఖ్యంగా ఇక్కుడున్న ధైర్యమైన, దృఢమైన మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపేందుకే నేను ఈ కార్యక్రమానికి వచ్చానన్నారు.


మా అత్తమ్మ చాలా ప్రేమగల వ్యక్తి


అనంతరం ఉపాసన తన అత్తమ్మ సురేఖను కొనియాడారు. వారిని ఉద్దేశిస్తూ.. మా అత్తమ్మ ఎంతో ప్రేమ గల వ్యక్తి అని, ఆమె తనకు స్ఫూర్తి అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఉపాసన కామెంట్స్‌ అందరిని ఆకట్టుకుంటున్నాయి. కాగా ఉపాసన అపోలో చైర్‌పర్సన్‌ అయినా ఉపాసన పలు సామాజిక కార్యక్రమాల్లోనూ ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటారు. మహిళా పారిశ్రామికవేత్తగా ఎంతో మంది మహిళలకు స్పూర్తిగా ఉన్న ఉపాసన తన అత్తమ్మపై చేసిన కామెంట్స్‌తో మెగా ఫ్యాన్స్‌ ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎంత ఎదిగిన ఒదిగి ఉండటమంటే ఇదేనంటూ ఉపాసనను కొనియాడుతున్నారు. కాగా ఇటివలె ఉపాసన సురేఖ బర్త్‌డే సందర్భంగా కొత్త బిజినెస్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. సురేఖ స్ఫూర్తితో ‘అత్తమ్మ కిచెన్’ పేరుతో తన అత్త సురేఖ రెసిపీలను మార్కెట్లోకి ప్రవేశపెట్టాలని నిర్ణయించుకుంది. దానికి సంబంధించిన గ్లింప్స్‌ను తన సోషల్ మీడియాలో షేర్ చేసి, అసలు ‘అత్తమ్మ కిచెన్’ అంటే ఏంటో వివరించారు ఉపాసన కొణిదెల.  


Also Read: ‘శివంగి’ షోలో తారకరత్న భార్య, కూతురు - ఆ ఘటన గుర్తుచేసి ఏడిపించేసిన నటరాజ్, తిట్టిపోస్తున్న నెటిజన్స్


అత్తమ్మ సురేఖపై ప్రేమతో 


ఉపాసన కొణిదెల.. ఒక బిజినెస్ ఫ్యామిలీ నుండి వచ్చారు. తన కుటుంబం నడిచిన బాటలోనే తాను కూడా నడిచి సక్సెస్‌ఫుల్ బిజినెస్ ఉమెన్ అయ్యారు. ఇప్పటికే ఎన్నో వ్యాపారాలలో సక్సెస్ సాధించిన ఉపాసన అత్తమ్మ కిచెన్ తో ఫుడ్ బిజినెస్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చారు.  సురేఖ కొణిదెల వంటకాలంటే మెగా ఫ్యామిలీని అందరికీ ప్రత్యేకమైన ఇష్టం ఉంటుంది. చిరంజీవి ఫారిన్ ట్రిప్స్‌కు వెళ్లినప్పుడు కూడా సురేఖ చేసిన ఆహారాన్ని  తన వెంట తీసుకువెళ్తానని చాలాసార్లు చెప్పారు. ఇంటి నుండి దూరంగా ఉన్నా కూడా హోమ్ ఫుడ్ అనేది వారిని ఒక్క దగ్గర ఉన్నట్టు ఫీల్ అయ్యేలా చేస్తుందన్నదే సురేఖ ఫార్ములా. తన వంటకాలలో ఒక ట్రెడీషన్ ఉంటుందని కూడా మెగా ఫ్యామిలీ అంటుంటారు. ఇప్పటికే ‘అత్తమ్మ కిచెన్’ గురించి రామ్ చరణ్ హింట్ ఇచ్చారు. ఇప్పుడు సురేఖ పుట్టినరోజు సందర్భంగా ఇది లాంచ్ అయ్యి అందరి ముందుకు వచ్చింది. కొణిదెల ఇంట్లో చేసే ఎన్నో వంటకాలను ‘అత్తమ్మ కిచెన్’ అనే పేరుతో పులిహోర, రసం, ఉప్మాలాంటివి ఇన్‌స్టంట్‌గా చేసుకోవడానికి ఉపయోగపడే ప్రొడక్ట్స్ మార్కెట్లోకి అందుబాటులోకి రానున్నాయి.