‘రామాయణం’ నుంచి అదిరిపోయే అప్ డేట్, శ్రీరామ నవమి రోజున కీలక ప్రకటన!
బాలీవుడ్ దర్శకుడు నితేష్ తివారీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘రామాయణం’ సినిమాకు సంబంధించి ప్రకటన ఏప్రిల్ 17న వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీరామ నవమి శుభ సందర్భంగా ఈ సినిమాను దర్శకుడు ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ‘రామాయణం’ సినిమాలో నటీనటులు ఎవరు? సాంకేతిక బృందంలో ఎవరు ఉంటారు? సినిమా విడుదల ఎప్పుడు? లాంటి కీలక విషయాలను వెల్లడించే అవకాశం ఉంది. భారతీయ సినిమా పరిశ్రమలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మించబోతున్నారు. ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనుల కోసం చిత్రబృందం ఏకంగా 5 సంవత్సరాల సమయాన్ని తీసుకుంది. త్వరలో సినిమా నిర్మాణ పనులు మొదలయ్యే అవకాశం ఉంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
వ్యూహం రివ్యూ: ఓడిపోతాడని వైఎస్ జగన్‌కు తెలుసు - ఆర్జీవీ తీసిన సినిమా ఎలా ఉందంటే?
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన 'వ్యూహం' పలు అడ్డంకులు దాటుకుని ఇవాళ థియేటర్లలో విడుదలైంది. ఏపీ రాజకీయాలపై తెరకెక్కించిన చిత్రమిది. అజ్మల్ అమీర్, మానస రాధాకృష్ణన్ జంటగా నటించారు. దాసరి కిరణ్ కుమార్ ప్రొడ్యూస్ చేశారు. ఈ సినిమా ఎలా ఉంది? ఇందులో వర్మ ఏం చెప్పారు? అనేది రివ్యూలో చూడండి. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
‘హిట్ 3’ను పక్కన పెట్టిన నాని - అదే కారణమా?
హాలీవుడ్‌లోని మల్టీవర్స్ తరహాలో ఇప్పుడు ఇండియన్ సినిమాల్లో కూడా సినిమాటిక్ యూనివర్స్‌లు మొదలయ్యాయి. బాలీవుడ్, కోలీవుడ్‌లో మొదలయిన సినిమాటిక్ యూనివర్స్, మల్టీవర్స్‌ను కాన్సెప్ట్‌ను తెలుగులోకి తీసుకొచ్చిన దర్శకుడు శైలేష్ కొలను. ‘హిట్’ సినిమాతో దర్శకుడిగా తన కెరీర్‌ను ప్రారంభించాడు శైలేష్. అదే తరహాలో ‘హిట్‌వర్స్’ అని ఒక యూనివర్స్‌ను ప్లాన్ చేస్తున్నానని, అందులో ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తాయని ప్రకటించాడు. తను చెప్పినట్టుగానే ఇప్పటికీ ‘హిట్‌వర్స్’లో రెండు సినిమాలు వచ్చాయి. మూడో సినిమా నానితో ఉంటుందని కూడా రివీల్ చేశారు. కానీ ఇంతలోనే ‘హిట్ 3’ మేకింగ్‌లో కన్ఫ్యూజన్ మొదలయ్యిందని టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
షారుఖ్, సుహానా సినిమాకు టైటిల్ ఫిక్స్ - యాక్షన్ కోసం ట్రైనింగ్ మొదలుపెట్టిన తండ్రీకూతుళ్లు
బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌కు 2023 చాలా స్పెషల్. గత కొన్నిరోజులుగా ఆయన నటించిన సినిమాలు అన్నీ ఫ్లాప్ అవుతూ ఉండగా.. 2023లో మాత్రమే మూడు బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రావడమే కాకుండా అన్నింటితో హిట్స్ అందుకున్నాడు కూడా. అంతే కాకుండా తన వారసురాలిగా సుహానా ఖాన్ కూడా గతేడాది నటిగా డెబ్యూ ఇచ్చింది. నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ ఫిల్మ్ ‘ది ఆర్చీస్’లో ఒక హీరోయిన్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది. అయితే త్వరలోనే ఈ ఇద్దరు కలిసి నటించనున్నారు అనే వార్త బాలీవుడ్ సర్కిల్స్‌లో వైరల్ అవ్వగా.. తాజాగా ఈ మూవీపై మరో అప్డేట్ బయటికొచ్చింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
షాకిచ్చిన ఆపరేషన్ వాలెంటైన్ ఫస్ట్ డే కలెక్షన్స్ - వసూళ్లు ఎలా ఉన్నాయంటే
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'ఆపరేషన్ వాలెంటైన్'. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నిన్న మార్చి 1న హిందీ, తెలుగు భాషల్లో థియేటర్లలో విడుదలైంది. సోని పిక్చర్స్, సందీప్ మడ్డా సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. వరుణ్ తేజ్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ చిత్రం నిజ సంఘటన పుల్వామా దాడి నేపథ్యంలో తెరకెక్కింది. రిలీజైన ఫస్ట్ షో నుంచి ఈ సినిమా మిక్స్‌డ్ టాక్‌కు సొంతమైంది. ఆడియన్స్ నుంచి ఆశించిన రివ్యూ అందుకోలేకపోయింది. పెయిడ్ ప్రీమియర్స్ తర్వాత ఈ చిత్రం మిక్స్‌డ్ టాక్ రావడంతో ఆక్యుపెన్సీ కూడా మిశ్రమంగా కనిపించింది. భారీ అంచనాల మధ్య శుక్రవారం థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా ఫస్ట్‌డే కలెక్షన్స్ ఊహించిన విధంగా ఉన్నాయి. మెగాస్టార్ రేంజ్ తగ్గట్టుగా ఈ సినిమా కలెక్షన్స్ చేయలేకపోయింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)