Varun Tej Operation Valentine Collections: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'ఆపరేషన్ వాలెంటైన్'. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నిన్న మార్చి 1న హిందీ, తెలుగు భాషల్లో థియేటర్లలో విడుదలైంది. సోని పిక్చర్స్, సందీప్ మడ్డా సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. వరుణ్ తేజ్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ చిత్రం నిజ సంఘటన పుల్వామా దాడి నేపథ్యంలో తెరకెక్కింది.  రిలీజైన ఫస్ట్ షో నుంచి  ఈ సినిమా మిక్స్‌డ్‌ టాక్‌కు సొంతమైంది. ఆడియన్స్‌ నుంచి ఆశించిన రివ్యూ అందుకోలేకపోయింది. పెయిడ్ ప్రీమియర్స్ తర్వాత ఈ చిత్రం మిక్స్‌డ్ టాక్  రావడంతో   ఆక్యుపెన్సీ కూడా మిశ్రమంగా కనిపించింది. భారీ అంచనాల మధ్య శుక్రవారం థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా ఫస్ట్‌డే కలెక్షన్స్‌ ఊహించిన విధంగా ఉన్నాయి. మెగాస్టార్‌ రేంజ్‌ తగ్గట్టుగా ఈ సినిమా కలెక్షన్స్‌ చేయలేకపోయింది. 


ఫస్ట్‌ డే కలెక్షన్స్‌ చూస్తే..


ఇక ఆపరేషన్ వాలెంటైన్ ఫస్ట్ డే కలెక్షన్ల ఆశించిన రాలేదని ట్రేడ్‌ వర్గాలంటున్నాయి. దాదాపు రూ. 40కోట్లతో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా మిడిల్‌ రేంజ్‌ సినిమా స్థాయిలో కలెక్షన్స్‌ చేసిందట. ఓవర్సిస్‌లో 150K డాలర్లు రాబట్టిన ఆపరేషన్‌ వాలెంటైన్‌ తెలుగు రాష్ట్రాల్లో రూ. 2.5 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిందని ట్రేడ్‌ పండితుల నుంచి సమాచారం. ఓవరాల్‌ ఇండియా వైడ్‌గా ఈ చిత్రం దగ్గర దగ్గర రూ. 3కోట్ల గ్రాస్‌ చేసిందని తెలుస్తోంది. దాంతో ఈ సినిమా తొలి రోజు 4 నుంచి 5 కోట్ల మేర వసూళ్ల చేసినట్టు సమాచారం.


ప్రీ రిలీజ్ బిజినెస్


ఆపరేషన్ వాలెంటైన్‌కు ముందు నుంచి మంచి బజ్ రావడంతో ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగినట్టు తెలుస్తోంది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. నైజాంలో రూ. 6 కోట్లు, ఆంధ్రాలో రూ. 9 కోట్లు, సీడెడ్‌లో రూ. 2 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగిందంటున్నారు. ఇక కర్ణాటకలో రూ. 2 కోట్లు, ఓవర్సీస్‌లో కోటి రూపాయలు వరకు బిజినెస్‌ జరిగిందని సినీవర్గాల నుంచి సమాచారం. మొత్తంగా ఆపరేషన్‌ వాలెంటైన్‌ రూ. 20 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది. 


పుల్వమా ఘటనపై వచ్చిన బెస్ట్ సినిమా...


పుల్వామాలో ఫిబ్రవరి 14, 2019న సీఆర్పీఎఫ్‌ జవాన్లపై ఉగ్రవాదులు చేసిన దాడికి ప్రతీకారంగా భారతీయ వైమానిక దళం నిర్వహించిన ఆపరేషన్ ఆధారంగా ఈ 'ఆపరేషన్ వాలెంటైన్' తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అందుకని, సినిమా స్టోరీ వర్క్ దగ్గర నుంచి ఎయిర్ ఫోర్స్ అధికారుల సలహాలు, సూచనలతో పాటు వాళ్ల అనుమతులు తీసుకున్నారు దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా. సినిమా పూర్తి అయ్యాక వాళ్లకు సినిమా చూపించారు. 


కథ:


అర్జున్ దేవ్ (వరుణ్ తేజ్) ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో వింగ్ కమాండర్. అతని భార్య అహనా గిల్ (మానుషీ చిల్లర్) కూడా వింగ్ కమాండర్. అయితే... రాడార్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తుంటుందామె. ఆపరేషన్ వజ్ర పేరుతో ఎయిర్ ఫోర్స్ ఒక ప్రాజెక్ట్ చేపడుతుంది. తక్కువ ఎత్తులో ఫైటర్ జెట్స్ నడిపితే శత్రువుల రాడార్ కంటికి కనిపించకుండా ఉండటంతో పైలట్స్ ప్రాణాలు కావడవచ్చనేది దాని ఉద్దేశం. ఆ ప్రాజెక్ట్ టెస్ట్స్ జరుగుతుండగా... పుల్వామాలో భారతీయ జవాన్ల మీద దాడి జరుగుతుంది. అప్పుడు అర్జున్ ఏం చేశాడు? అర్జున్, అహనా మధ్య గొడవ ఎందుకు వచ్చిందనేది 'ఆపరేషన్ వాలెంటైన్'.