సుమకు చెంపదెబ్బలు పడాలి, రాజీవ్ ఎలా భరిస్తున్నాడో పాపం - స్టేజీపై బాలయ్య మాస్ ర్యాగింగ్!


టాలీవుడ్ ఇండస్ట్రీలో నటసింహ నందమూరి బాలకృష్ణకు ఎలాంటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమాల్లో ఆయన డైలాగ్ డెలివరీకు ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ నే ఉంది. అయితే సినిమాల్లో సీరియస్ గా పవర్ఫుల్ డైలాగ్ లు చెప్పడమే కాదు.. బయట కూడా తనదైన స్టైల్ లో పంచ్ లు వేస్తూ ఆశ్చర్యపరుస్తుంటారు. తాజాగా ‘రుద్రంగి’ అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అతిథిగా వెళ్లిన బాలకృష్ణ అక్కడ యాంకరింగ్ చేస్తున్న సుమను కాసేపు ఆటపట్టించారు. సరదాగా ఆమెకు పంచ్ లు వేస్తూ వేదికపై హుషారుపుట్టించారు బాలయ్య. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.  (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)


‘బిగ్ బాస్’లో రెచ్చిపోయిన కంటెస్టెంట్స్, 30 సెకన్ల పాటు లిప్ కిస్ - మండిపడుతోన్న నెటిజన్స్!


‘బిగ్ బాస్’ షో కు ప్రేక్షకుల నుంచి ఎలాంటి డిమాండ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏ భాషలో అయినా ఈ షో కు ఉండే క్రేజ్ ఒకేలా ఉంటుంది. ఒకప్పుడు ‘బిగ్ బాస్’ షో ను ఇంట్లో అందరూ కూర్చొని ఎంజాయ్ చేస్తూ చూసేవారు. అయితే ఇప్పుడు వచ్చే ‘బిగ్ బాస్’ సీజన్లు మాత్రం విమర్శలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతున్నాయి. షో పాపులారిటీ కోసం కంటెస్టెంట్ లతో రకరకాల టాస్క్ లు చేయిస్తున్నారు. ప్రస్తుతం హిందీలో ‘బిగ్ బాస్ ఓటీటీ 2’ రన్ అవుతోంది. దీనికి సల్మాన్ ఖాన్ హోస్ట్ గా చేస్తున్నారు. ఈ ఓటీటీ షో ప్రారంభం అయిన మొదట్నుంచీ అందరి దృష్టినీ ఆకర్షించింది. తాజాగా షో లో టాస్క్ పేరుతో ఇద్దరు కంటెస్టెంట్ లు 30 సెకన్ల పాటు లిప్ కిస్ పెట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)


'బేబీ' రిలీజ్ డేట్ పోస్టర్ వివాదం - క్షమాపణలు కోరిన దర్శకుడు!


టాలీవుడ్ లో కొన్ని రోజులుగా కేవలం పాటలతోనే ఆడియన్స్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న చిత్రం 'బేబీ'. అయితే తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ విడుదల చేసిన పోస్టర్ ఒక్కసారిగా వివాదంలో చిక్కుకుంది. 'బేబీ' సినిమా రిలీజ్ డేట్ పోస్టర్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొద్ది నిమిషాల్లోనే వివాదానికి గురైంది. ఈరోజుల్లో సోషల్ మీడియాలో నెటిజన్లు తమని ఇబ్బంది పెట్టే విధంగా ఏదైనా కనిపిస్తే చాలు దాన్ని వెంటనే ట్రోల్ చేసి పెద్ద వివాదంగా మారుస్తారు. సరిగ్గా 'బేబీ' మూవీ రిలీజ్ పోస్టర్ తో కూడా అదే జరిగింది. 'బేబీ' మూవీ టీం రిలీజ్ చేసిన రిలీజ్ పోస్టర్ స్త్రీల మనోభావాలను కించపరిచే విధంగా ఉండడంతో ఈ పోస్టర్ పై సోషల్ మీడియాలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)


మెగా మనవరాలికి పేరు పెట్టేశారోచ్ - రామ్ చరణ్, ఉపాసన కుమార్తె పేరు ఏమిటంటే?


గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), ఉపాసన కొణిదెల (Upasana Konidela) దంపతులు పది రోజుల క్రితం తల్లిదండ్రులు అయ్యారు. ఈ సంగతి అందరికీ తెలుసు. మెగాస్టార్ ఇంట మహాలక్ష్మి అడుగు పెట్టిందని అభిమానులు సంబరాలు చేసుకున్నారు. కొణిదెల, కామినేని కుటుంబాలు చిన్నారి రాకతో సంతోషంలో మునిగాయి. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... ఈ రోజు ఆ అమ్మాయికి పేరు పెట్టారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)


బార్‌లో ఒకే సిట్టింగ్‌తో ఆ డైరెక్టర్‌తో మూవీకి ఓకే చెప్పేసిన అల్లరి నరేష్ - అనౌన్స్‌మెంట్ వీడియో అదుర్స్!


టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అల్లరి నరేష్ తన కొత్త సినిమాను షురూ చేశాడు. కెరీర్ ప్రారంభంలో ఎక్కువ శాతం కామెడీ కాన్సెప్ట్ కథలనే చేసిన నరేష్ ‘నాంది’ సినిమా తర్వాత తన స్టోరీ సెలక్షన్ థీమ్ నే మార్చేశాడు. తనకు కాకుండా కథకు బలం ఉండే విభిన్నమైన కథలను ఎంచుకుంటూ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఆయన తాజాగా సోలో బ్రతుకే సో బెటర్’ ఫేమ్ సుబ్బు మంగాదేవి డైరెక్షన్ లో ‘నరేష్ 62’ ను చేయబోతున్నాడు. నేడు(జూన్ 30) నరేష్ పుట్టిన రోజు సందర్భంగా ఆ మూవీను ఓ కొత్త ఐడియాతో వీడియో తయారు చేసి రిలీజ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)