Charan-Upasana: మహాలక్ష్మీ రాకతో మెగాస్టార్ ఇంట సంబరాలు మొదలైయ్యాయి. సరిగ్గా పది రోజుల కిందట మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-ఉపాసన పండంటి పాపకు తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. దీంతో మెగా అభిమానులు సంబరాలు కూడా జరుపుకున్నారు. ఇప్పటికే మెగా మనవరాలికి ‘లిటిల్ మెగా ప్రిన్సెస్’ అంటూ అభిమానులు పిలుచుకుంటున్నారు కూడా. తాజాగా మెగా గ్రాండ్ డాటర్ కు సంబంధించి మరో వేడుక జరుగుతోంది. ఈ రోజు(జూన్ 30)న మెగా ప్రిన్సెస్ కోసం ఓ ఫంక్షన్ చేస్తున్నారు. ఈ వేడుక ఉపాసన తల్లి ఇంట్లో జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ వేడుకకు సంబంధించి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. వేడుక జరిగే ప్రదేశాన్ని అందంగా అలంకరిస్తున్నారు ఈవెంట్ ప్లానర్స్. అందుకు సంబంధించిన వీడియోలను ఉపాసన తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. ఇప్పుడీ వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. 


అమ్మమ్మ ఇంట్లోనే నామకరణం..


సాధారణంగా పిల్లలు పుట్టిన తర్వాత 21 రోజులకు ఉయ్యాలలో వేయడం, నామకరణం చేయడం చేయడం ఆచారంగా వస్తోంది. అయితే మెగా గ్రాండ్ డాటర్ కు మాత్రం పట్టిన పది రోజుల్లోనే ఈ వేడుకను చేస్తున్నారు. అయితే నామకరణ వేడుక పాప అమ్మమ్మ ఇంట్లో జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే సాధారణంగా పుట్టిన పిల్లల ఉయ్యాల వేడుక, నామకరణ వేడుక అమ్మమ్మ ఇంట్లోనే చేస్తారు. అందుకే రామ్ చరణ్-ఉపాసన ముద్దుల కూతురి ఉయ్యాల వేడుక కూడా ఉపాసన తల్లి ఇంటి వద్దే జరుగుతున్నట్లు సమాచారం. ఇక ఈ వేడుకకు మెగా ఫ్యామిలీతో పాటు సన్నిహితులు, మెగా హీరోలు కూడా హాజరవుతున్నారని తెలుస్తోంది. 


పచ్చని చెట్లు, తెల్లటి పూలతో అలంకరణ..


మెగా గ్రాండ్ డాటర్ ఉయ్యాల వేడుకను అట్టహాసంగా చేస్తున్నట్టు తెలుస్తోంది. ఉపాసన షేర్ చేసిన వీడియోలు చూస్తే ఆ విషయం అర్థమవుతుంది. ఈ వీడియోలో వేడుక జరిగే ప్రదేశాన్ని ఈవెంట్ ప్లానర్స్ అత్యంత సుందరంగా అలంకరిస్తున్నట్లు కనబడుతోంది. పచ్చని ఆకులు, తెల్లటి పూలు మధ్యలో ఓ పెద్ద చెట్టును సైతం ఏర్పాటు చేసి చాలా న్యాచురల్ గా ఉండేటట్లు డెకరేట్ చేస్తున్నారు. ఈ వేడుక ఏర్పాట్లకు సంబంధించిన వీడియోలను ఉపాసన తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. దానితో పాటు ‘‘మా ముద్దుల కూతురు పేరు పెట్టే కార్యక్రమం’’ అంటూ రాసుకొచ్చింది.


ముందే ఓ పేరు అనుకున్నారు..


ఉపాసన డెలివరీ తర్వాత అపోలో ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకెళ్లే ముందు రామ్ చరణ్ మీడియాతో మాట్లాడారు. తమపై, తమ కూతురిపై ఇంతటి అభిమానాన్ని చూపించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. కూతురు పేరు గురించి అడగ్గా.. ‘‘మేము ఇద్దరం ఓ పేరు అనుకున్నాం. త్వరలోనే మీకు చెబుతాం’’ అని సమాధానమిచ్చారు. అయితే ఇప్పుడు నామకరణం రోజు అదే పేరు పెడతారా? ఆ పేరు ఏంటి? అని తెలుసుకోవాలని ఆసక్తి చూపుతున్నారు మెగా ఫ్యాన్స్. ఈ నేపథ్యంలో నేడు నామకరణ వేడుక జరుగుతుందని తెలియడంతో మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 


Also Read: సుమకు చెంపదెబ్బలు పడాలి, రాజీవ్ ఎలా భరిస్తున్నాడో పాపం - స్టేజీపై బాలయ్య మాస్ ర్యాగింగ్!