Make In India: 


మేకిన్ ఇండియాపై ప్రశంసలు


రష్యా అధ్యక్షుడు పుతిన్ మోదీ సర్కార్ తీసుకొచ్చిన మేకిన్ ఇండియాపై ప్రశంసలు కురిపించారు. "భారత దేశ ప్రధాని మోదీ తన విజనరీతో ప్రవేశపెట్టిన మేకిన్ ఇండియా ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది" అని కొనయాడారు. భారత్, రష్యాకున్న మైత్రినీ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇండియా, రష్యా ఫ్రెండ్స్ అని అన్నారు. రష్యాలో లోకల్‌ బ్రాండ్స్‌, ప్రొడక్ట్స్‌ని ప్రోత్సహించాలని పిలుపునిచ్చిన ఆయన...ఆ సమయంలోనే మేకిన్‌ ఇండియా గురించి ప్రస్తావించారు. ఇటీవలే రష్యా అంబాసిడర్ డెనిస్ అలిపోవ్ ఢిల్లీకి వచ్చారు. రష్యా- ఇండియా వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చించారు. రష్యా గురించి అంతర్జాతీయంగా ఎన్నో ఆరోపణలున్నాయని, కొన్ని అవాస్తవాలనూ ప్రచారం చేస్తున్నారని చెప్పిన డెనిస్...ఇండియాతో రిలేషన్ విషయంలో మాత్రం ఆ ప్రభావం పడదని స్పష్టం చేశారు. గతంలో కన్నా దీన్ని ఇంకా బలోపేతం చేస్తామని తేల్చి చెప్పారు. ఇప్పుడే కాదు. గతంలోనూ చాలా సందర్భాల్లో రష్యా అధ్యక్షుడు పుతిన్...ప్రధాని మోదీని ప్రశంసించారు. ఆయన విజనరీ గొప్పదని కితాబునిచ్చారు. 


గతంలోనూ...


గతంలో భారత్, రష్యా మధ్య ఉన్న సత్సంబంధాల గురించి చర్చించే సమయంలో మోదీపై ప్రశంసలు కురిపించారు పుతిన్. మాస్కోలో నిర్వహించినValdai Discussion Club సమావేశంలో పుతిన్..మోదీపై చేసిన వ్యాఖ్యలపై అంతర్జాతీయంగా చర్చ జరుగుతోంది. ఇంటర్నేషనల్ మీడియా కూడా దీనిపై ఫోకస్ పెట్టింది. "నరేంద్ర మోదీ నిజమైన దేశభక్తుడు. స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అమలు చేసే అతి కొద్ద మంది అధినేతలలో ఆయన ఒకరు. ప్రజల అభిప్రాయాలను ఎలా గౌరవించాలో ఆయనకు తెలుసు. చాలా దేశాలు భారత్‌పై ఆంక్షలు విధించాలని చూశాయి. కానీ మోదీ మాత్రం ఆ ప్రయత్నాలన్నింటినీ తిప్పికొట్టారు. అభివృద్ధి విషయంలో భారత్ ఎంతో సాధించింది. ఆ దేశానికి ఎంతో మంచి భవిష్యత్ ఉంది" అని వ్యాఖ్యానించారు పుతిన్. "దశాబ్దాలుగా భారత్, రష్యా మధ్య మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. ఈ రెండు దేశాల మధ్య ఎలాంటి విభేదాలు లేవు. బ్రిటీష్‌ పాలనలో మగ్గి..ఆ తరవాత స్వతంత్ర దేశంగా మారి భారత్ ఎంతో సాధించింది. ఇప్పుడు ప్రపంచమంతా గౌరవించే స్థాయికి చేరుకుంది. అదంతా ఆ అభివృద్ధి కారణంగానే" అని వెల్లడించారు. ప్రధాని మోదీ నేతృత్వంలో భారత్‌లో ఎన్నో సంస్కరణలు వచ్చాయని కితాబిచ్చారు. 


"మోదీ నేతృత్వంలో భారత్‌లో చాలా మార్పులు వచ్చాయి. ఆయన స్వతహాగానే  ఓ దేశభక్తుడు. అందుకే Make in India లాంటి కార్యక్రమాలతో దేశభక్తిని చాటుకున్నారు. ఆర్థికంగా భారత్‌ను సుస్థిరం చేయాలని భావించారు. భవిష్యత్ అంతా భారత్‌దే. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఎదిగే సత్తా భారత్‌కు ఉంది. భారత్, రష్యా మధ్య ప్రత్యేకమైన అనుబంధం ఉంది. వాణిజ్యపరంగా మునుపటి కన్నా బలోపేతం అయ్యాం. ఫర్టిలైజర్‌ల ఎగుమతిని పెంచాలని ప్రధాని మోదీ అడిగారు. అందుకే...ఇప్పుడు మా దేశం నుంచి వాటి ఎగుమతులు 7.6 రెట్లు పెరిగాయి" 


- పుతిన్, రష్యా అధ్యక్షుడు 


Also Read: US Supreme Court: అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు - జాతి ఆధారంగా అడ్మిషన్లు చెల్లవని స్పష్టం