Balakrishna: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటసింహ నందమూరి బాలకృష్ణకు ఎలాంటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమాల్లో ఆయన డైలాగ్ డెలివరీకు ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ నే ఉంది. అయితే సినిమాల్లో సీరియస్ గా పవర్ఫుల్ డైలాగ్ లు చెప్పడమే కాదు.. బయట కూడా తనదైన స్టైల్ లో పంచ్ లు వేస్తూ ఆశ్చర్యపరుస్తుంటారు. తాజాగా ‘రుద్రంగి’ అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అతిథిగా వెళ్లిన బాలకృష్ణ అక్కడ యాంకరింగ్ చేస్తున్న సుమను కాసేపు ఆటపట్టించారు. సరదాగా ఆమెకు పంచ్ లు వేస్తూ వేదికపై హుషారుపుట్టించారు బాలయ్య. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 


సుమకు ఆ అలవాటు ఉంది జాగ్రత్తగా ఉండాలి: బాలయ్య


టాలీవుడ్ స్టార్ నటుడు జగపతి బాబు, ఆశిష్ గాంధీ, విమలా రామన్, మమతా మోహన్ దాస్, గానవి ప్రధాన పాత్రల్లో తెరెకెక్కిన సినిమా ‘రుద్రంగి’. ఈ సినిమాకు అజయ్ సామ్రాట్ దర్శకత్వం వహించారు. ఇటీవలే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ కు బాలయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మూవీ టీమ్ కు శుభాకాంక్షలు చెప్పారు. బాలయ్య మాట్లాడుతుండగా ఆయన అభిమానులు ‘కోకోకోలా పెప్సి.. బాలయ్య బాబు సెక్సి’ అంటూ సందడి చేశారు. దీనికి బాలయ్య స్పందిస్తూ.. ‘‘బాలయ్యబాబు సెక్సీ అంటే విమలా రామన్, మమతా మోహన్ దాస్’ వాళ్లంతా  జెలసీగా ఫీలవుతారు కదా.. అయినా ఇంతకుముందు సుమ నేను ఏమీ మాట్లాడక ముందే మీ ఫ్యాన్స్ చప్పట్లు కొడతారు అంది. సుమకు అప్పుడప్పుడూ చెంపదెబ్బలు కూడా అవసరం. అయితే ఒకటి ఈమె తిరిగి చెప్పు తీసుకుని కొడుతుంది, అదొక బాధ మళ్లీ.. అందుకే జాగ్రత్తగా ఉండాలి. పాపం ఆ రాజీవ్ కనకాలా ఎలా భరిస్తున్నాడో ఏంటో’’ అంటూ సరదాగా సుమను ఆటపట్టించారు బలయ్య. దీంతో వేదికపై నవ్వులు విరిసాయి. 


జగపతి బాబు గొప్ప నటుడు..


ఇక ఇదే కార్యక్రమంలో సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన జగపతి బాబుపై ప్రశంసలు కురిపించారు బాలకృష్ణ. ఒక్క టాలీవుడ్ లోనే కాకుండా యావత్ భారత్ లోనే జగపతి బాబు గొప్ప నటుడు అంటూ కితాబిచ్చారు. నటనంటే ఎంపిక చేసుకున్న పాత్రలో పరకాయ ప్రవేశం చేయడమేనన్న బాలయ్య పాత్రలో జీవిచడం గొప్ప నటించడం కాదంటూ వ్యాఖ్యానించారు. జగపతి బాబు అలాంటి ఒక నటుడని అన్నారు. గతంతో పోల్చుకుంటే సినిమా ఇండస్ట్రీ పరిస్థితులు చాలా మారాయని అన్నారు బాలయ్య. ఒకప్పుడు తమ మనుగడ కోసం సినిమాలు చేస్తుంటే ఇప్పుడు ఇండస్ట్రీ మనుగడ కోసమే సినిమాలు చేస్తున్నామన్నారు. సినిమా కథలో ప్రేక్షకులు లీనమయ్యేలా చేసే అరుదైన చిత్రాలలో రుద్రంగి సినిమా కూడా ఒకటి అని అన్నారు బాలయ్య. ఈ సినిమా అందరికీ నచ్చుతుందన్న ఆయన టీమ్ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఈ సినిమాను ఎమ్మెల్యే, కవి, గాయకుడు రసమయి బాలకిషన్ నిర్మించారు. జూలై 7 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


Also Read: ఆ అమ్మాయి ఎవరు 'బ్రో'? టీజర్‌లో హీరోయిన్‌ను గమనించారా?