టాలీవుడ్ లో కొన్ని రోజులుగా కేవలం పాటలతోనే ఆడియన్స్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న చిత్రం 'బేబీ'. అయితే తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ విడుదల చేసిన పోస్టర్ ఒక్కసారిగా వివాదంలో చిక్కుకుంది. 'బేబీ' సినిమా రిలీజ్ డేట్ పోస్టర్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొద్ది నిమిషాల్లోనే వివాదానికి గురైంది. ఈరోజుల్లో సోషల్ మీడియాలో నెటిజన్లు తమని ఇబ్బంది పెట్టే విధంగా ఏదైనా కనిపిస్తే చాలు దాన్ని వెంటనే ట్రోల్ చేసి పెద్ద వివాదంగా మారుస్తారు. సరిగ్గా 'బేబీ' మూవీ రిలీజ్ పోస్టర్ తో కూడా అదే జరిగింది. 'బేబీ' మూవీ టీం రిలీజ్ చేసిన రిలీజ్ పోస్టర్ స్త్రీల మనోభావాలను కించపరిచే విధంగా ఉండడంతో ఈ పోస్టర్ పై సోషల్ మీడియాలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి.
ఓ వ్యక్తి మిడిల్ ఫింగర్ పై హీరోయిన్‌ని నిలబడి ఉన్నట్లుగా ఆ పోస్టర్‌ను డిజైన్ చేశారు. దీంతో ఈ పోస్టర్ విడుదలైన కొద్ది నిమిషాల్లోనే నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. గతంలో సమంతా రిగ్రెసివ్ ట్వీట్ ను షేర్ చేయడం మొదలుపెట్టారు. నిజానికి రీసెంట్‌గా విడుదలైన పాటలు, టీజర్ తో డీసెంట్ లవ్ స్టోరీగా ప్రచారంలో ఉన్న 'బేబీ' లాంటి సినిమాకి కూడా మేకర్స్ ప్రమోషన్ కోసం ఇలాంటి అభ్యంతరకర పోస్టర్లను వాడుకోవడం చాలామంది ఆడియన్స్ కి ఆశ్చర్యం కలిగిందని చెప్పాలి. అయితే 'బేబీ' రిలీజ్ డేట్ పోస్టర్ పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్న వేళ సినిమా దర్శకుడు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ క్షమాపణలు చెప్పాడు. అంతేకాకుండా ఆ పోస్టర్ ని తొలగించారు.
అయినప్పటికీ పోస్టర్ రిలీజ్ అయిన 30 నిమిషాల వ్యవధిలోనే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ట్వీట్స్, సోషల్ మీడియా షేర్స్ రూపంలో ఆ పోస్టర్ విపరీతంగా వైరల్ అయిపోయింది. కాగా ఈ సినిమా దర్శకుడు సాయి రాజేష్ తన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ క్షమాపణలు కోరాడు. ఆ తర్వాత.. "పోస్టర్ని తొలగించామని, ఈ పోస్టర్ సినిమాలోని ఒక ముఖ్యమైన సీక్వెన్స్ అని, ఖచ్చితంగా అది సినిమా థీమ్ కి సంబంధించింది కాదని" క్లారిటీ ఇచ్చారు. దీంతో ప్రస్తుతం ఈ డైరెక్టర్ చేసిన ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి.
ఇక 'బేబీ' సినిమా విషయానికొస్తే.. యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్స్ గా నటించారు. విరాజ్ అశ్విన్ మరో కీలక పాత్ర పోషిస్తున్నాడు. స్కూల్, కాలేజ్ డేస్ లో సాగే స్వచ్ఛమైన ప్రేమ కథగా ఈ సినిమాని దర్శకుడు సాయి రాజేష్ తెరకెక్కించారు.ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ తో ప్రేక్షకుల్లో మంచి స్పందనను రాబట్టగా, ఈ సినిమాలో వైష్ణవి చైతన్య డిగ్లామరస్ రోల్ లో నటించింది. అంతేకాదు ఈ సినిమాతోనే ఈమె వెండితెరకు హీరోయిన్గా పరిచయం అవుతుంది. ట్రయాంగిల్ లవ్ స్టోరీ గా రాబోతున్న ఈ సినిమా జూలై 14న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. మాస్ మూవీ మేకర్స్ పతాకంపై యువనిర్మాత SKN ఈ సినిమాని నిర్మిస్తున్నారు. విజయ్ బుల్గానిన్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఎమ్ఎన్ బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకి విప్లవ్ నైషధం ఎడిటింగ్ బాధ్యతలు చేపడుతున్నారు.
Also Read : 'ఈ నగరానికి ఏమైంది' రీ-రిలీజ్ కలెక్షన్స్ - ఫస్ట్ రిలీజ్ కన్నా 4 రెట్లు ఎక్కువ!