Naresh62: టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అల్లరి నరేష్ తన కొత్త సినిమాను షురూ చేశాడు. కెరీర్ ప్రారంభంలో ఎక్కువ శాతం కామెడీ కాన్సెప్ట్ కథలనే చేసిన నరేష్ ‘నాంది’ సినిమా తర్వాత తన స్టోరీ సెలక్షన్ థీమ్ నే మార్చేశాడు. తనకు కాకుండా కథకు బలం ఉండే విభిన్నమైన కథలను ఎంచుకుంటూ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఆయన తాజాగా సోలో బ్రతుకే సో బెటర్’ ఫేమ్ సుబ్బు మంగాదేవి డైరెక్షన్ లో ‘నరేష్ 62’ ను చేయబోతున్నాడు. నేడు(జూన్ 30) నరేష్ పుట్టిన రోజు సందర్భంగా ఆ మూవీను ఓ కొత్త ఐడియాతో వీడియో తయారు చేసి రిలీజ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.


బార్ లోనే హీరోకు కథ చెప్పిన దర్శకుడు..


అల్లరి నరేష్ పుట్టిన రోజు సందర్భంగా తన కొత్త మూవీ గురించి అనౌన్స్మెంట్ చేశారు మేకర్స్. అయితే ‘నరేష్ 62’ ను అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన వీడియో ఇప్పుడు అందర్నీ ఆకట్టుకుంటోంది. కథ చెప్పడానికి నరేష్ కి ఫోన్ చేస్తాడు దర్శకుడు. అయితే ఆ స్టోరీని ఫోన్ లో చెప్పడం కుదరదని, బార్ లో కూర్చోబెట్టి నేరేట్ చేస్తాడు. మూర్ఖత్వం పరిధి దాటిపోయిన ఓ వ్యక్తి కథే ఇది అంటూ సింపుల్ గా స్టోరీ లైన్ ను చెప్తాడు. తర్వాత నరేష్ తనకు ఒకే అని అయితే నిర్మాత, టెక్నీషియన్లకు కూడా నచ్చాలి కదా అని చెప్తుండగానే ఇదే బార్ లో అందరికీ కథ చెప్పేశానని, ఒక్కొక్కరిని పరిచయం చేస్తాడు. దీంతో నరేష్ కాసేపు ఆలోచించి ఓ సిగిరెట్ తీసి వెలిగించి స్టైల్ గా కథ ఓకే చేస్తాడు. ఇదంతా ఓ వీడియో రూపంలో చేసి మూవీ అనౌన్స్మెంట్ చేశారు మేకర్స్. దీంతో ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. 


విభిన్నమైన కథలను ఎంచుకుంటూ..


‘నాంది’ సినిమా తర్వాత అల్లరి నరేష్ స్టోరీ సెలక్షన్ లో చాలా మార్పు వచ్చింది. కథకు బలమున్న మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలనే ఎక్కువగా ఓకే చేస్తున్నాడు. ఈ మూవీ తర్వాత ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’, ‘ఉగ్రం’ వంటి సీరియస్ కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తూ వచ్చారు. అలాంటి ప్రయోగమే ఈ సినిమాతోనూ చేయబోతున్నట్టు తెలుస్తోంది.  హాస్యా మూవీస్ బ్యానర్  ఈ మూవీను నిర్మించబోతోంది. 1990 బ్యాగ్రౌండ్ లో ఈ మూవీ తీస్తున్నారని సమాచారం. మూవీ అనౌన్స్మెంట్ తోనే ఆకట్టుకున్న ఈ సినిమా నరేష్ కు ఎలాంటి హిట్ అందిస్తుందో చూడాలి. ఇక ఈ సినిమాకు ‘సీతారామం’ ఫేమ్ చంద్రశేఖర్ ఈ సినిమాకి సంగీతం అందించబోతున్నాడు. రిచర్డ్ ఎమ్ నాథన్ డిఒపిగా చోట కే ప్రసాద్ ఎడిటర్ గా చేస్తున్నాడు. సెప్టెంబర్ నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూట్ మొదలు కాబోతుంది. ఇక ఈ సినిమా కాకుండా నరేష్ ప్రస్తుతం ‘సభకు నమస్కారం’ సినిమా చేస్తున్నాడు. కామెడీ ఎంటర్టైనర్‌ గా వస్తున్న ఈ  సినిమాకు సతీష్ మల్లంపాటి దర్శకత్వం వహిస్తున్నాడు. ‘జాతిరత్నాలు’ ఫేమ్ ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తుంది. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.


Also Read: ‘కాలం మీ గడియారానికి అందని ఇంద్రజాలం’ - పవర్ ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్కిచ్చే ‘బ్రో’ టీజర్!