Stock Market Opening 30 June 2023:
స్టాక్ మార్కెట్లు శుక్రవారం రికార్డు గరిష్ఠాల్లో మొదలయ్యాయి. ఆల్‌టైమ్ హై లెవల్స్‌ను దాటేశాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 128 పాయింట్లు పెరిగి 19,100 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 476 పాయింట్లు పెరిగి 64,391 వద్ద కొనసాగుతోంది. మెటల్ మినహా అన్ని రంగాల సూచీలు పరుగులు పెడుతున్నాయి. ఇన్వెస్టర్ల సంపద అరగంటలోనే రూ.2.5 లక్షల కోట్ల మేర పెరిగింది.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 63,915 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 64,068 వద్ద మొదలైంది. 64,068 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 64,414 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 9:30 గంటలకు 476 పాయింట్ల లాభంతో 64,391 వద్ద కొనసాగుతోంది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
బుధవారం 18,972 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 19,076 వద్ద ఓపెనైంది. 19,024 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 19,108 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 128 పాయింట్ల లాభంతో 19,100 వద్ద ట్రేడవుతోంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ లాభపడింది. ఉదయం 44,666 వద్ద మొదలైంది. 44,447 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 44,668 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 318 పాయింట్లు పెరిగి 44,646 వద్ద కొనసాగుతోంది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 37 కంపెనీలు లాభాల్లో 13 నష్టాల్లో ఉన్నాయి. పవర్ గ్రిడ్, ఇన్ఫీ, బజాజ్ ఆటో, ఎం అండ్ ఎం, బజాజ్ ఫైనాన్స్ షేర్లు లాభపడ్డాయి. అదానీ పోర్ట్స్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, టాటా స్టీల్, ఐచర్ మోటార్స్, భారతీ ఎయిర్‌టెల్ నష్టపోయాయి. మెటల్ మినహా అన్ని రంగాల సూచీలు గ్రీన్‌లో కళకళలాడుతున్నాయి. బ్యాంకు, ఆటో, ఫైనాన్స్, ఐటీ, పీఎస్‌యూ బ్యాంక్, కన్జూమర్ డ్యురబుల్స్ సూచీలు పెరిగాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.58,750గా ఉంది. కిలో వెండి రూ.71,900 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.280 తగ్గి రూ.23,820 వద్ద ఉంది.
Also Read: ఐసీఐసీఐ సెక్యూరిటీస్ డీలిస్టింగ్! 100 షేర్లకు 67 ఐసీఐసీఐ బ్యాంకు షేర్లు!
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.