నాలుగు రోజులకే ప్రభాస్‌కు డౌట్ వచ్చింది - ఓం రౌత్‌కు చెప్పినా వినలేదా?
విమర్శలు, వివాదాల నడుమ 'ఆదిపురుష్' 350 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసింది. వసూళ్ళతో సంబంధం లేకుండా సినిమాపై విమర్శలు గుప్పిస్తున్న ప్రజల సంఖ్య ఎక్కువే ఉంది. ముఖ్యంగా దర్శకుడు ఓం రౌత్, రచయిత మనీష్ ముంతశిర్ రామాయణాన్ని వక్రీకరించారని హిందువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ తప్పుల్ని ప్రభాస్ ముందుగా ఊహించారా? అంటే 'అవును' అనుకోవాలి. (పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
హనుమంతుడు దేవుడు కాదు, భక్తుడు మాత్రమే: ‘ఆదిపురుష్’ డైలాగ్ రైటర్
ప్రభాస్, కృతి సనన్ జంటగా నటించిన 'ఆదిపురుష్(Adi Purush)' సినిమా విడుదలైనప్పటి నుంచి వార్తల్లో నిలుస్తోంది. 'ఆదిపురుష్'.. రామాయణాన్ని అపహాస్యం చేసేలా ఉందని విమర్శలు వెల్లువెత్తుతోన్న వేళ.. ఇది కేవలం రామాయణం నుంచి ప్రేరణ పొందింది మాత్రమే తీశారనని మాటల రచయిత మనోజ్ ముంతాషిర్(Manoj Muntashir) తమ వాదనను వినిపించారు. దీనికి సంబంధించిన ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో అతను హనుమంతుడు 'భగవాన్ నహీ భక్త్ హై' అని చెప్పడాన్ని వినవచ్చు. ఇది ఇప్పుడు అభిమానులకు విపరీతమైన కోపం తెప్పిస్తోంది. (పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
‘సలార్’ వచ్చేస్తున్నాడు - మరో వంద రోజుల్లో బాక్స్ ఆఫీస్ ఊచకోత!
‘కేజీఎఫ్’ సిరీస్ సినిమాలతో దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించారు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఆ మూవీలు ఎలాంటి భారీ హిట్ ను అందుకున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మరోవైపు ‘బాహుబలి’ లాంటి సన్సేసనల్ సినిమాల్లో నటించి పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు ప్రభాస్. ప్రస్తుతం ప్రభాస్ క్రేజ్ ఎంతలా పెరిగిపోయిందో తెలిసిందే. అలాంటి వీరిద్దరి కాంబోలో ఒక సినిమా వస్తే ఎలా ఉంటుంది. అదే.. ‘సలార్’. ఈ మూవీ భారీ యాక్షన్ డ్రామా కథతో తెరకెక్కుతోంది. శృతి హాసన్ హీరోయిన్ గా చేస్తుంది. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు భారీ అంచనాలను పెంచేశాయి. ప్రభాస్ అభిమానులతో పాటు ప్రేక్షకులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న ఈ భారీ ప్రాజెక్టు నుంచి కొత్త అప్డేట్ వచ్చేసింది. ఈ మూవీ రిలీజ్ ఇంకా వంద రోజులే ఉందంటూ ఓ పోస్ట్ చేశారు మేకర్స్. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ అభిమానుల్లో ఉత్కంఠ మొదలవుతోంది. (పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
మెగా ఇంట మహాలక్ష్మి - పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఉపాసన!
మెగా ఫ్యామిలీలో మహా లక్ష్మి అడుగుపెట్టింది. మంగళవారం తెల్లవారు జామున రామ్ చరణ్ భార్య ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ మేరకు వైద్యులు ప్రకటన విడుదల చేశారు. తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా, పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని ప్రకటనలో పేర్కొన్నారు. కుటుంబంలో మెగా ప్రిన్సెస్ అడుగు పెట్టిందంటూ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. (పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
మహేష్ బాబు సినిమా నుంచి పూజా హెగ్డే అవుట్? తమన్ కూడా!
సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas)ది సూపర్ హిట్ కాంబినేషన్! వాళ్ళిద్దరి కలయికలో 'అతడు', 'ఖలేజా' వంటి క్లాసిక్ సినిమాలు వచ్చాయి. ఇప్పుడు హ్యాట్రిక్ సినిమా 'గుంటూరు కారం' తెరకెక్కుతోంది. అయితే... ఈ సినిమా చిత్రీకరణ అంత సాఫీగా జరగడం లేదని ఫిల్మ్ నగర్ గుసగుస. (పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి)