జగన్ చెప్పిన ఐబీ సిలబస్‌ ఏంటీ?


జగనన్న ఆణిముత్యాల కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్ ఏపీలో ఐబీ సిలబస్‌ ప్రవేశ పెట్టబోతున్నట్టు చెప్పారు. దీంతో అసలు ఆ సిలబస్ ఏంటనే చర్చ మొదలైంది. పోటీ పరీక్షలు, ఇతర కోర్సులు అంటూ పిల్లలపై ఒత్తిడి పెంచుతున్న నేటి యుగంలో ఐబీ సిలబస్‌ ఎలాంటి ప్రభావం చూపుతోందో ఓ సారి చూద్దాం. ఐబీ అంటే ఇంటర్నేషల్ బ్యాకలోరియెట్ అని అర్థం. ఇది ఒక నాన్ ఫ్రాఫిట్ ఫౌండేషన్. ఇంకా చదవండి


ఆ ముగ్గురు బీఆర్ఎస్ నేతలకు ఐటీ శాఖ నోటీసులు


భారత రాష్ట్ర సమితి నేతలకు ఐటీ చిక్కులు తప్పడం లేదు. ఇటీవల ఇద్దరు ఎమ్మెల్యేలు, ఓ ఎంపీ ఇంట్లో మూడు రోజుల పాటు సోదాలు చేశారు. వారందరికీ తమ ఎదుట విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు.  84 గంటల పాటు పైళ్ల శేఖర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, మర్రి జనార్దన్‌‌‌‌రెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లోనూ ఐటీ ముమ్మర తనిఖీలు నిర్వహించింది. సోదాల్లో స్వాధీనం చేసుకున్న పలు డాక్యుమెంట్స్, ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ ట్రాన్సాక్షన్స్‌‌‌‌ ఆధారంగా పైళ్ల శేఖర్‌‌‌‌‌‌‌‌రెడ్డికి ఐటీ నోటీసులు జారీ చేసింది.  సంబంధిత వివరాలు, ఆధారాలతో హైదరాబాద్‌లోని ఐటీ ఆఫీస్‌‌‌‌లో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో ఐటీ అధికారులు పేర్కొన్నారు. ఇంకా చదవండి


అక్టోబర్‌లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్


2023 తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly Elections 2023) ఎన్నికలు మరో ఆరు నెలల్లో జరగనున్నాయి. ఇప్పటికే పార్టీ రాజకీయ వ్యూహాల్లో మునిగిపోయాయి. ఇప్పుడు అధికారులు కూడా ఎన్నికలకు సమాయత్తమవుతున్నారు. అక్టోబర్‌ మొదటి పక్షంలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే ఛాన్స్ ఉందని వార్తలు వస్తున్నాయి. దీనికి ఎన్నికల యంత్రాంగం కసరత్తు ముమ్మరం చేసింది. ఇంకా చదవండి


ద్వారంపూడిని వెనుకేసుకొచ్చిన ముద్రగడ


జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ రాశారు. పార్టీ పెట్టి పది మంది ప్రేమ పొందాలే కానీ.. ఇలా వీధి రౌడీలా మాట్లాడడం ఎంత వరకు సమంజసం అంటూ ప్రశ్నించారు. కాపు రిజర్వేషన్ కోసం ఉద్యమాలు చేసి రాజకీయంగా ఎదుగుతున్నారంటూ పవన్ కల్యామ్ చేసిన వ్యాఖ్యలు సరికావని అన్నారు. కాపు ఉద్యమాన్ని తన ఎదుగుదలకు వాడుకోలేదని.. చిత్తశుద్ధితో ఫైట్ చేశానని చెప్పుకొచ్చారు. నేతలను విమర్శించడం మానేసి పవన్ అసలు విషయాలపై దృష్టి సారించాలని లేఖలో హితవు పలికారు. తాను కులాన్ని అడ్డు పెట్టుకొని నాయకుడిగా ఎదగలేదన్నారు. తాను యువతను వాడుకొని భావోద్వేగాలు రెచ్చగొట్టలేదని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం మారినప్పడుల్లా తాను ఉద్యమాలు చేయలేదన్నారు. పోగొట్టుకున్న బీసీ రిజర్వేషన్ పునరుద్ధరిస్తామనని చంద్రబాబు నాయుడి పదే పదే చెప్పడం వల్ల రోడ్డు మీదకు వచ్చామన్నారు. ఈ పరిస్థితిని బాబు ద్వారా పవన్ కల్పించారని ఆరోపించారు. తాను ఏ నాయకుడినీ బెదిరించి డబ్బులు సంపాదించలేదని చెప్పారు. ఇంకా చదవండి


గవర్నమెంట్ బడుల్లో ఐబీ సిలబస్ - సీఎం జగన్


అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్యావ్యవస్థలో మార్పులు చేసే దిశగా ప్రభుత్వం పని చేస్తోందన్నారు సీఎం జగన్. విజయవాడలో జరిగిన జగనన్న ఆణిముత్యాల కార్యక్రమంలో పాల్గొన్న ఆయన టెన్త్, ఇంటర్‌లో  టాపర్స్‌ను సన్మానించారు. మట్టి నుంచి పెరిగిన ఈ మొక్కలు మహా వృక్షాలై, ప్రపంచానికే అభివృద్ధి ఫలాలు అందించాలని కోరుకుంటున్నాను అన్నారు. అందర్నీ చూస్తుంటే గవర్నమెంట్ బడి, గవర్నమెంట్ కాలేజీలను మరింత గొప్పగా మార్చాలనే కోరిక పెరుగుతోందన్నారు. పేద పిల్లలు ఏ ఒక్కరూ కూడా పేదరికం వల్ల చదువులకు దూరం కాకూడదని ప్రభుత్వం గట్టిగా నిర్ణయించిందని తెలిపారు. ఇంకా చదవండి