Telangana News : భారత రాష్ట్ర సమితి నేతలకు ైీట చిక్కులు తప్పడం లేదు. ఇటీవల ఇద్దరు ఎమ్మెల్యేలు, ఓ ఎంపీ ఇంట్లో మూడు రోజుల పాటు సోదాలు చేశారు. వారందరికీ తమ ఎదుట విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. 84 గంటల పాటు పైళ్ల శేఖర్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లోనూ ఐటీ ముమ్మర తనిఖీలు నిర్వహించింది. సోదాల్లో స్వాధీనం చేసుకున్న పలు డాక్యుమెంట్స్, ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ ఆధారంగా పైళ్ల శేఖర్‌రెడ్డికి ఐటీ నోటీసులు జారీ చేసింది. సంబంధిత వివరాలు, ఆధారాలతో హైదరాబాద్‌లోని ఐటీ ఆఫీస్‌లో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో ఐటీ అధికారులు పేర్కొన్నారు.
ఇద్దరు ఎమ్మెల్యేలు, ఎంపీకి ఐటీ శాఖ నోటీసులు
శేఖర్‌రెడ్డితోపాటు జనార్దన్‌రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డికి కూడా నోటీసులు ఇచ్చారు. వారం రోజుల కిందట అధికార బీఆర్‌ఎస్ పార్టీ నేతలను ఆదాయ పన్ను శాఖ అధికారులు హడలెత్తించారు. 50 బృందాలుగా ఏర్పడిన అధికారులు ఏకకాలంలో బీఆర్‌ఎస్ ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేలు, మరో నాయకుడి ఇళ్లలో సోదాలు చేశారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, నాగర్‌కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, బీఆర్‌ఎస్ ముషీరాబాద్ నియోజకవర్గ నాయకుడు కొండపల్లి మాధవ్ ఇళ్లలో దాడులు చేశారు. వీరంతా కలిసి వ్యాపారాలు నిర్వహిస్తున్నారు.
జగన్ చెప్పిన ఐబీ సిలబస్ ఏంటీ? పరీక్షలే లేని చదువులు ఎలా సాధ్యం? పోటీ ప్రపంచంలో రాణిస్తారా?
సోదాల్లో లభించిన ఆధారాల ఆధారంగా వివరాలతో రావాలని నోటీసులు
ఆదాయ పన్ను లెక్కల్లో తేడాలుండడంతోనే ఈ సోదాలు చేసినట్లు సమాచారం. అయితే ఒకేసారి ముగ్గురు నేతల ఇళ్లలో ఐటీ దాడులు జరగడంతో మళ్లీ దర్యాప్తు సంస్థలు తమపై దృష్టి పెట్టాయేమోనని బీఆర్ఎస్ నేతలు ఆందోళన చెందుతున్నారు. గతంలోనూ కొందరు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. సోదాలు పెద్దఎత్తున జరగకపోయినప్పటికీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆందోళనకు గురయ్యారు. ఇప్పుడు మరోసారి అలాంటి సోదాలు జరుగుతూండటంతో మరింత కంగారు పడుతున్నారు.
అక్టోబర్‌లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్- సమాయత్తమవుతున్న అధికారులు!
రాజకీయ కక్ష సాధింపులేనంటున్న బీఆర్ఎస్ నేతలు
అయితే తన ఇంట్లో ఏమీ దొరకలేదని సోదాలు గంటన్నరలో పూర్తయినా కావాలనే మూడు రోజుల పాటు కాలయాపన చేశారని.. ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి ఆరోపించారు. మరో ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి కూడా అదే చెప్పారు. పన్ను కట్టినందుకు తమకు గతంలో అవార్డులు ఇచ్చారని ఇప్పుడు ఇలా సోదాలు చేస్తున్నారని విమర్శించారు. ఇదంతా రాజకీయ కుట్రగానే వారు ఆరోపణలు గుప్పిస్తున్నారు. అయితే ఈ ముగ్గురు నేతలు ఐటీ ముందు హాజరవుతారా లేదా అన్నదానిపై స్పష్టత లేకుండా పోయింది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial