గొడ్డలితో ఆ నరుకుడేంది రణబీర్? రక్తంతో నిండిపోయిన 'యానిమల్' ప్రీ టీజర్!
దర్శకుడిగా పరిచయమైన 'అర్జున్ రెడ్డి' సినిమాతో సందీప్ రెడ్డి వంగా సంచలన విజయం అందుకున్నారు. స్టోరీ టెల్లింగ్ పరంగా కొత్త ట్రెండ్ సెట్ చేశారు. ఆ సినిమాను హిందీలో 'కబీర్ సింగ్'గా రీమేక్ చేసి, అక్కడ కూడా భారీ విజయం అందుకున్నారు. ఇప్పుడు ర‌ణ్‌బీర్‌ కపూర్ హీరోగా 'యానిమల్' సినిమా  చేస్తున్నారు.  ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. పెళ్లి తర్వాత ర‌ణ్‌బీర్‌ స్టార్ట్ చేసిన తొలి చిత్రం ఇదే. ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం మనాలీలో జరిగింది. ఇందుకోసం రణ్‌బీర్‌, రష్మిక మనాలిలోనే కొద్ది రోజుల పాటు కున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)


‘OG’లో ‘బుట్టబొమ్మ’ స్టార్ అర్జున్ దాస్ - పవర్ స్టార్ కోసం స్పెషల్ నోట్!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా 'సాహో' ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 'ఓజీ - ఒరిజినల్ గ్యాంగ్ స్టర్'.  డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. శ్రీమతి పార్వతి చిత్ర సమర్పకురాలు. 'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' తర్వాత దానయ్య నిర్మిస్తున్న చిత్రం ఇదే కావడం విశేషం.  భారీ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీ కోసం పవన్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.  ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)


ఇంత పిచ్చి ప్రేమను నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు - బాలయ్య క్రేజ్‌‌కు అర్జున్ రాంపాల్ ఫిదా
సినిమా ఇండస్ట్రీలో హీరో నందమూరి బాలకృష్ణకు ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో చెప్పనక్కర్లేదు. ఆయన స్క్రీన్ మీద కనబడితే చాలు ఫ్యాన్స్ కు పూనకాలు వచ్చేస్తాయి. ప్రపంచాన్ని మర్చిపోయి బాలయ్య సినిమాను ఎంజాయ్ చేస్తూ జై బాలయ్య జై బాలయ్య అంటూ నినాదాల చేస్తారు. బాలయ్య సినిమా రిలీజ్ అయ్యిందంటే చాలు ఆయన ఫ్యాన్స్ చేసే హంగామాతో థియేటర్ల టాప్ లేచిపోద్ది. అంతగా బాలయ్యను అభిమానిస్తారు ఆయన ఫ్యాన్స్. ప్రస్తుతం బాలకృష్ణ తన వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. రీసెంట్ గా ఈ ఏడాది జనవరిలో ‘వీర సింహారెడ్డి’ సినిమాతో మంచి సక్సెస్ ను అందుకున్న బాలయ్య ఇప్పుడు ‘భగవంత్ కేసరి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను బాలకృష్ణ పుట్టిన రోజు సందర్బంగా రిలీజ్ చేశారు. అయితే ఈ టీజర్ ను థియేటర్లలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా మూవీ టీమ్ ఓ థియేటర్ లో సందడి చేశారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)


బాలయ్యకు బర్త్ డే విషెస్ చెప్పని జూనియర్ ఎన్టీఆర్? ఫ్యాన్స్ హర్ట్!
నటసింహం నందమూరి బాలకృష్ణ తాజాగా తన 63వ పుట్టినరోజు జరుపుకున్నారు. జూన్ 10న బాలయ్య 62వ ఏట నుంచి 63వ వసంతంలోకి అడుగు పెట్టారు. ఈ సందర్భంగా బాలకృష్ణ తదుపరి చిత్రం ‘భగవంత్ కేసరి’ టీజర్ విడుదల చేశారు. దీనికి అభిమానులతో పాటు సినీ లవర్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటి వరకు 107 సినిమాల్లో నటించిన నటసింహం.. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'భగవంత్ కేసరి' అనే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ లో నటిస్తున్నారు. బర్త్ డే స్పెషల్ గా ఇప్పటికే రిలీజైన టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్స్  విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ మూవీతో బాలయ్య 'గ్లోబల్ లయన్' గా పాన్ ఇండియాని టార్గెట్ చేయబోతున్నారు. ఓవైపు సినిమాల్లో మరోవైపు రాజకీయాల్లో అన్ స్టాపబుల్ గా దూసుకుపోతున్నారు బాలయ్య. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)


పబ్‌లో డ్యాన్స్ చేసిన సమంత - చేతిలో బీర్ బాటిల్‌తో ‘ఊ అంటావా’ అంటూ చిందులు
లేడీ సూపర్ స్టార్ సమంత వరుస షూటింగ్ లత ఫుల్ బిజీగా గడుపుతోంది. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వెబ్ సిరీస్ లలోనూ సత్తా చాటుతోంది. ‘ఫ్యామిలీ మెన్’ లాంటి వెబ్ సిరీస్ ల తర్వాత సమంత క్రేజ్ దేశవ్యాప్తంగా పెరిగిపోయింది. ఆమె ప్రస్తుతం రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో తెరకెక్కిన ‘సిటాడెల్’ ఇండియన్ వెర్షన్ లో నటిస్తోంది. ఇందులో సమంతతో జంటగా బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ నటిస్తున్నారు. ప్రస్తుతం ‘సిటాడెల్’ షూటింగ్ కోసం టీమ్ అంతా సెర్బియాకు బయలుదేరింది. అక్కడ బెల్గ్రేడ్ లో చిత్రికీరణ జరుగుతోంది. అయితే తాజాగా బెల్ గ్రేడ్ లోని ఓ పబ్ లో సమంత చిందులేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)