Samantha: లేడీ సూపర్ స్టార్ సమంత వరుస షూటింగ్ లత ఫుల్ బిజీగా గడుపుతోంది. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వెబ్ సిరీస్ లలోనూ సత్తా చాటుతోంది. ‘ఫ్యామిలీ మెన్’ లాంటి వెబ్ సిరీస్ ల తర్వాత సమంత క్రేజ్ దేశవ్యాప్తంగా పెరిగిపోయింది. ఆమె ప్రస్తుతం రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో తెరకెక్కిన ‘సిటాడెల్’ ఇండియన్ వెర్షన్ లో నటిస్తోంది. ఇందులో సమంతతో జంటగా బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ నటిస్తున్నారు. ప్రస్తుతం ‘సిటాడెల్’ షూటింగ్ కోసం టీమ్ అంతా సెర్బియాకు బయలుదేరింది. అక్కడ బెల్గ్రేడ్ లో చిత్రికీరణ జరుగుతోంది. అయితే తాజాగా బెల్ గ్రేడ్ లోని ఓ పబ్ లో సమంత చిందులేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 


‘పుష్ప’ లో పాటకు చిందులేసిన వరుణ్-సమంత..


సిటాడెల్ షూటింగ్ కోసం సెర్బియా వెళ్లింది వెబ్ సిరీస్ యూనిట్. అయితే షూటింగ్ కు గ్యాప్ దొరకడంతో యూనిట్ అంతా అక్కడ పబ్ లో పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. ఆ పార్టీలో సమంత కూడా పాల్గొంది. ఈ సందర్భంగా ‘పుష్ప’ సినిమాలోని ‘ఊ.. అంటావా మావా.. ఉఊ.. అంటావా మావా..’ పాట ప్లే అయింది. దీంతో సమంతను ఆ పాటకు డాన్స్ వేయాలని కోరాడు హీరో వరుణ్ ధావన్. వెంటనే సమంత ఫుల్ జోష్ తో ఓ చితిలో బీర్ బాటిల్ పట్టుకుని ఆ పాటకు డాన్స్ వేసింది. ఆమెతో పాటు హీరో వరుణ్ ధావన్ కూడా చిందులేశాడు. దీంతో పక్కన ఉన్నవారంతా ఉత్సాహంతో సమంతతో పాటకు డాన్స్ చేసి సందడి చేశారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. ఈ వీడియో చూసి నెటిజన్స్ ‘సెర్బియాలో ఊ అంటావా క్రేజ్ మామూలుగా లేదుగా’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. 


‘సిటాడెల్’ ఇండియన్ వెర్షన్ కోసం వెయిటింగ్..


బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ అలాగే సమంత ఇంకా సికిందర్ ఖేర్ ప్రస్తుతం సెర్బియాలో వెబ్ సిరీస్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో తెరకెక్కిన అంతర్జాతీయ వెబ్ సిరీస్ ‘సిటాడెల్’ కు మంచి క్రేజ్ వచ్చింది. ఇందులో ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలో కనిపించింది. అయితే ఈ వెబ్ సిరీస్ కు లింక్ చేస్తూ ఇండియన్ ‘సిటాడెల్’ తెరకెక్కబోతున్నట్టు తెలుస్తోంది. అందుకే ఈ వెబ్ సిరీస్ పై ఉత్కంఠ నెలకొంది. 


ప్రియాంక చోప్రాకు తల్లిగా సమంత..


‘సిటాడెల్’ ఇంగ్లీష్ వెర్షన్ ఏప్రిల్ 28 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పటికే కొన్ని ఎపిసోడ్లు పూర్తయ్యాయి. అయితే రీసెంట్ గా ఐదో ఎపిసోడ్ విడుదల తర్వాత ఓ ఆసక్తికర విషయం ఒకటి బయటకు వచ్చింది. ఇందులో ప్రియాంక చోప్రా తన తండ్రిని పిలిచినప్పుడు హీరో వరుణ్ ధావన్ వాయిస్ వినిపించింది. దీంతో ప్రియాంక చోప్రాకు వరుణ్ తండ్రిగా కనిపించనున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు సమంత కూడా ప్రియాంకకు తల్లిగా కనిపిస్తుందా అనే కోణంలో కూడా చర్చ జరుగుతోంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మేకర్స్ త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు.


Read Also: నయనతారకు విఘ్నేష్ సర్ ప్రైజ్, యానివర్సరీ సందర్భంగా ఊహించని గిఫ్ట్!