నటసింహం నందమూరి బాలకృష్ణ తాజాగా తన 63వ పుట్టినరోజు జరుపుకున్నారు. జూన్ 10న బాలయ్య 62వ ఏట నుంచి 63వ వసంతంలోకి అడుగు పెట్టారు. ఈ సందర్భంగా బాలకృష్ణ తదుపరి చిత్రం ‘భగవంత్ కేసరి’ టీజర్ విడుదల చేశారు. దీనికి అభిమానులతో పాటు సినీ లవర్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటి వరకు 107 సినిమాల్లో నటించిన నటసింహం.. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'భగవంత్ కేసరి' అనే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ లో నటిస్తున్నారు. బర్త్ డే స్పెషల్ గా ఇప్పటికే రిలీజైన టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ మూవీతో బాలయ్య 'గ్లోబల్ లయన్' గా పాన్ ఇండియాని టార్గెట్ చేయబోతున్నారు. ఓవైపు సినిమాల్లో మరోవైపు రాజకీయాల్లో అన్ స్టాపబుల్ గా దూసుకుపోతున్నారు బాలయ్య.
రెండేళ్లుగా బాలయ్యకు బర్త్ డే విషెస్ చెప్పిన జూ. ఎన్టీఆర్
బయట బాలయ్య దూకుడు ఎలా ఉన్నా, కుటుంబలో మాత్రం విభేదాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. బాలయ్యకు వరుసగా రెండో ఏడాది కూడా జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే విషెస్ చెప్పలేదు. తాజాగా బాలయ్య నిర్వహించిన ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు సైతం జూనియర్ ఎన్టీఆర్ రాకపోవడం పలు అనుమానాలకు తావిచ్చింది. బాలకృష్ణ అభిమానులకు, ఎన్టీఆర్ అభిమానులకు మధ్య గందరగోళ పరిస్థితి ఏర్పడింది. బాబాయి, అబ్బాయ్ అభిమానుల మధ్య ఫ్యాన్స్ వార్ జరుగుతూనే ఉంది. నందమూరి ఫ్యామిలీ ఉమ్మడి అభిమానులైతే ఈ విషయంలో చాలా హర్ట్ అయ్యారు.
వాస్తవానికి బాలకృష్ణ 60, 61వ పుట్టినరోజు సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. 2020లో ఎన్టీఆర్ ట్వీట్ చేస్తూ, “నాలోని అభిమానిని మేల్కొల్పింది మీరే. నేను చూసిన మొదటి హీరో మీరే. ఈ 60వ పుట్టిన రోజు మీ జీవితంలో మరిచిపోలేనిదిగా భావిస్తున్నాను. మీరు మంచి ఆరోగ్యంతో, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను” అని ట్వీట్ చేశారు. 2021లో “పుట్టినరోజు శుభాకాంక్షలు బాబాయ్. మీకు ఎల్లవేళలా ఆరోగ్యం, సంతోషాన్ని భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటున్నాను” అని ట్వీట్ చేశారు. గత రెండేళ్లుగా బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ ఎలాంటి ట్వీట్ చేయలేదు.
బాబాయ్, అబ్బాయ్ అభిమానుల వార్
జూనియర్ ఎన్టీఆర్ తీరుతో బాబాయ్ తో అబ్బాయ్ సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నట్లు అభిమానులు భావిస్తున్నారు. తారకరత్న మరణం తర్వాత వీరిద్దరి మధ్య విభేదాలు మరింత ముదిరినట్లు తెలుస్తోంది. అయితే, బాలకృష్ణ కెరీర్ స్టార్టింగ్ రోజుల నుంచి జూనియర్ ఎన్టీఆర్‌కు సపోర్ట్ చేయడం వల్లే ఆయన స్టార్ అయ్యాడని బాలయ్య అభిమానులు ట్రోల్ చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమాల వేడుకలకు ఎప్పుడూ బాలయ్య అండగా నిలిచే వారిని చెప్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ నందమూరి కుటుంబంలో భాగమైనందునే ఇంత పెద్ద స్టార్ డమ్చ ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చిందంటున్నారు. వారి ప్రోత్సాహాన్ని మర్చిపోవడం మంచిదికాదంటున్నారు. అటు 20 ఏళ్లలో బాలకృష్ణ ఎన్నో ఫ్లాప్‌లు ఇచ్చారని, జూనియర్ ఎన్టీఆర్ లేకుంటే నందమూరి కుటుంబ వారసత్వం నశించిపోయేదని జూనియర్ అభిమానులు రివర్స్ కౌంటర్ ఇస్తున్నారు. ఎన్టీఆర్ వారసత్వాన్ని జూనియర్ ఎన్టీఆర్ కొనసాగిస్తున్నారని చెప్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తన హార్డ్ వర్క్, సొంత అభిమానుల వల్లే సక్సెస్ అయ్యారని తేల్చిచెప్తున్నారు. నందమూరి కుటుంబం, బాలకృష్ణ అభిమానుల వల్ల ఆయన సక్సెస్ కాలేదని మరికొందరు అంటున్నారు. ఏది ఏమైనా.. వీరి మధ్య ఉన్న స్పర్థలు తొలగిపోయి.. మళ్లీ ఒక్కటైతే చూడాలని ఉందని నందమూరి ఫ్యాన్స్ అంటున్నారు. ప్రతీ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా చెప్పల్సిన అవసరం లేదని, బహుశా తారక్.. తన బాబాయ్‌కు ఫోన్లో ప్రత్యేకంగా విష్ చేసి ఉండవచ్చని, దీనిపై అనవసర రాద్దాంతం తగదని మరికొందరు అంటున్నారు.
Read Also: వరుణ్‌ను తొలిసారి చూసింది అప్పుడే - తనతో సినిమా అంటే ఆలోచించా: వితికా శేరు