సాయి తేజ్ - చీటీల చిన్ని - ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ బాసూ!
'విరూపాక్ష' విజయంతో సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) సత్తా చాటారు. ఆ సినిమాకు ముందు ఆయనకు యాక్సిడెంట్ కావడం... 'రిపబ్లిక్'కు ప్రశంసలు వచ్చినప్పటికీ, ఆశించిన రీతిలో వసూళ్ళు రాకపోవడం... ఇతరత్రా అంశాల కారణంగా 'విరూపాక్ష'తో అందరి కన్ను పడింది. ఆ సినిమాతో సాయి ధరమ్ తేజ్ భారీ విజయం సాధించడమే కాదు, వంద కోట్ల క్లబ్బులో చేరారు. ఆ సినిమా నిర్మాతతో చేస్తున్న కొత్త సినిమా 'చీటీల చిన్ని' టైటిల్ ఖరారు చేశారట. (పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.)
నేనేదో సరదాగా అంటే ఆ అమ్మాయి మా వాడినే ప్రేమించింది: అల్లు అరవింద్
Allu Aravind: దర్శకుడు సాయి రాజేష్ డైరెక్షన్ లో తెరకెక్కిన మూవీ ‘బేబీ’ . ఈ సినిమాలో ఆందర్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల అయిన పాటలు, ట్రైలర్ లు మంచి పాజిటివ్ టాక్ ను అందుకున్నాయి. జులై 14 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం మూవీ టీమ్ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఇటీవలే మూవీ కు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు మేకర్స్. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మూవీ టీమ్ పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
నానీని ‘హాయ్ నాన్న’ అని పలకరిస్తోన్న మృణాల్ ఠాకూర్ - నేచురల్ స్టార్ కొత్త మూవీ గ్లింప్స్ చూశారా?
సరికొత్త కథాంశాలతో సినిమాలు చేయడంలో నేచురల్ స్టార్ నాని ముందుంటారు. ప్రస్తుతం ఆయన #NANI30 చిత్రంలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు శౌర్యువ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాతోనే శౌర్యువ్ దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబధించిన టైటిల్, గ్లింప్స్ రిలీజ్ చేశారు. తండ్రీ, కూతుళ్ల సెంటిమెంట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు చిత్రబృందం టైటిల్ ఫిక్స్ చేసింది. ‘హాయ్ నాన్న’ అనే పేరును ఖరారు చేసింది. చిన్న గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. ఇందులో నాని, మృణాల్ ఠాకూర్, నానికి కూతురుగా కనిపించే పాపని మేకర్స్ రివీల్ చేశారు. ఈ గ్లింప్స్ చూస్తుంటే ఒక ఎమోషనల్ స్టోరీగా అర్థం అవుతోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
‘ఫ్యామిలీ’ లెక్క - విజయ్, రష్మికల రిలేషన్‌పై స్పందించిన ఆనంద్ దేవరకొండ
టాలీవుడ్ ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న డేటింగ్ వ్యవహారం ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటుంది. ఇటీవల విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ నటించిన ‘బేబీ’ సినిమా ప్రమోషన్స్ సందర్భంగా విజయ్, రష్మిక ల వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. ‘బేబీ’ మూవీ జులై 14 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం మూవీ టీమ్ ప్రమోషన్స్ లో బిజీ గా ఉంది. మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంటున్న ఆనంద్ దేవరకొండకు విజయ్, రష్మిక ల రిలేషన్ గురించి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. తాజాగా జరిగిన ఓ ప్రమోషన్ కార్యక్రమంలో ఆనంద్ దేవరకొండకు ఇదే ప్రశ్న మళ్లీ ఎదురవడంతో చాకచక్యంగా సమాధానం చెప్పాడు. ఇప్పుడు ఆనంద్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
రష్మిక ఎఫెక్ట్, నితిన్ మూవీలో శ్రీలీలా? టాలీవుడ్‌లో హీరోయిన్లకు కొరత ఉందా భయ్యా?
దర్శకుడు వెంకీ కుడుమలకు రష్మిక మందన్నా హ్యాండిచ్చిన సంగతి తెలిసిందే. ఈ మూవీపై ఎన్నో ఆశలు పెట్టుకున్న వెంకీకి ఇది కోలుకోలేని దెబ్బే. రష్మికను మైండ్‌లో పెట్టుకుని మంచి సీన్స్ కూడా రాసుకున్నాడు. కానీ, ఆమె చివరి క్షణంలో ప్రాజెక్ట్ నుంచి తప్పుకుని ఊహించని షాకిచ్చింది. ఎలాగైనా హిట్ కొట్టాలని తపన పడుతున్న నితిన్‌కు కూడా ఒక రకంగా ఇది ఇబ్బంది పెట్టే విషయమే. నేషనల్ క్రష్ చేయిదాటిన తరుణంలో.. ఇప్పుడు టాలీవుడ్ దర్శకనిర్మాతల తాజా క్రష్ శ్రీలీలకు తన సినిమాలో ఛాన్స్ ఇచ్చేందుకు వెంకీ కుడుముల ఆలోచిస్తున్నారట. అది ఎంతవరకు నిజమో తెలియదుగానీ.. అదేగానీ చేస్తే మరోసారి తప్పులో కాలేసినట్లే అని అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)