ర్శకుడు వెంకీ కుడుమలకు రష్మిక మందన్నా హ్యాండిచ్చిన సంగతి తెలిసిందే. ఈ మూవీపై ఎన్నో ఆశలు పెట్టుకున్న వెంకీకి ఇది కోలుకోలేని దెబ్బే. రష్మికను మైండ్‌లో పెట్టుకుని మంచి సీన్స్ కూడా రాసుకున్నాడు. కానీ, ఆమె చివరి క్షణంలో ప్రాజెక్ట్ నుంచి తప్పుకుని ఊహించని షాకిచ్చింది. ఎలాగైనా హిట్ కొట్టాలని తపన పడుతున్న నితిన్‌కు కూడా ఒక రకంగా ఇది ఇబ్బంది పెట్టే విషయమే. నేషనల్ క్రష్ చేయిదాటిన తరుణంలో.. ఇప్పుడు టాలీవుడ్ దర్శకనిర్మాతల తాజా క్రష్ శ్రీలీలకు తన సినిమాలో ఛాన్స్ ఇచ్చేందుకు వెంకీ కుడుముల ఆలోచిస్తున్నారట. అది ఎంతవరకు నిజమో తెలియదుగానీ.. అదేగానీ చేస్తే మరోసారి తప్పులో కాలేసినట్లే అని అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు. 


రష్మిక ఈ మూవీని ఎందుకు వదిలేసింది? 


రష్మిక ఈ మూవీని ఎందుకు వదిలేసిందనేది ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ మూవీకి అంగీకరించే సమయంలో రష్మిక చేతిలో ‘పుష్ప-2’తోపాటు కొన్ని బాలీవుడ్ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. ఈ మూవీ షెడ్యూల్ స్టార్ట్ అయ్యేసరికి ఆలస్యమవుతుందనే ఉద్దేశంతో రష్మిక కొన్ని సినిమాలకు కమిట్ అయినట్లు తెలిసింది. ప్రస్తుతం రష్మిక డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న తెలుగు, తమిళ ద్విభాషా సినిమా 'రెయిన్ బో'లో నటిస్తున్నారు. ఇంకా మరో మూడు హిందీ సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి. అన్ని పెద్ద ప్రాజెక్టులు ఉన్నప్పుడు నితిన్ వంటి ఫ్లాప్ హీరోతో చేయడం ఎందుకని అనుకుందో ఏమో.. ప్రాజెక్టు నుంచి తప్పుకుందనే ప్రచారం జరుగుతోంది. 


శ్రీలీలతో వర్కవుట్ అవుతుందా?


శ్రీలీలా ఇప్పటికే డజన్ల కొద్ది సినిమాలతో బిజీగా ఉంది. కాబట్టి, నితిన్‌కు డేట్స్ కేటాయిస్తుందా? లేదా అనేది అనుమానమే. ఒక వేళ గోల్డెన్ లెగ్ కోసమే చిత్ర యూనిట్ ఎదురు చూస్తున్నట్లయితే.. ‘విరూపాక్ష’తో హ్యాట్రిక్ కొట్టిన సంయుక్త మీనన్ బెస్ట్ ఛాయిస్ అనే టాక్ వినిపిస్తోంది. శ్రీలీలతో పోల్చితే సంయుక్తకు అవకాశాలు తక్కువే. కాబట్టి, డేట్స్‌ సర్దుబాటు కావచ్చు. కాదు, శ్రీలీలే కావాలనుకుంటే మాత్రం వెంకీ వెయిట్ చేయకతప్పుదు. ఎందుకంటే శ్రీలీలా.. రష్మికా కంటే బిజీగా ఉంది. పైగా కోలీవుడ్ నుంచి కూడా ఆఫర్స్ వస్తున్నాయి. అయితే, శ్రీలీలాను ఈ మూవీలోకి తీసుకుంటున్నారనేది కేవలం రూమర్ మాత్రమే. అసలు విషయం ఇంకా తెలియాల్సి ఉంది. అయితే, ఈ విషయం తెలియగానే నెటిజన్స్ రకరకాల కామెంట్లు చేస్తున్నారు. టాలీవుడ్‌లో హీరోయిన్లకు కొరత ఉందా భయ్యా? అని కామెంట్లు చేస్తున్నారు. 


హ్యాట్రిక్ మిస్సయ్యారా?


రష్మికాను టాలీవుడ్‌కు పరిచయం చేసింది వెంకీ కుడుముల. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఛలో’ మూవీతో రష్మికా మంచి హిట్‌తో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన తీసిన ‘భీమా’ మూవీ కూడా హిట్టే. దీంతో మూడోసారి కూడా వీరు జతకడుతున్న నేపథ్యంలో తప్పకుండా హ్యాట్రిక్ కొడతారని అనుకున్నారు. పైగా మంచి కాన్సెప్ట్‌తో ఈ మూవీకి సంబంధించిన గ్లింప్స్ కూడా వదిలాడు వెంకీ. అందులో రష్మిక, నితిన్‌లు తమపై తామే సెటైర్లు వేసుకుంటూ నవ్వించారు. మూవీపై కూడా అంచనాలు పెంచారు. కానీ, రష్మికా తప్పకుందనే సమాచారం విని అభిమానులు కూడా షాకయ్యారు. లక్ ఏమిటంటే.. వెంకీ ఈ మూవీని ఇంకా సెట్స్ మీదకు తీసుకురాక ముందే రష్మిక తప్పుకోవడం. అదే షూటింగ్ మొదలైన తర్వాత రష్మికా ఆ పని చేసి ఉంటే.. ఇంకా దారుణంగా ఉండేది పరిస్థితి.


Read Also: బాబోయ్‌, 'ప్రేమ్ కుమార్ కథ'ను గుర్తు పెట్టుకోవడం కష్టమే - ట్విస్టులే ట్విస్టులు!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial